For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కార్తీక్‌కు మరోసారి షాకిచ్చిన మోనిత.. ఓవరాక్షన్‌ను తట్టుకోలేకపోయిన దీప, హిమ, శ్రావ్య

  |

  అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్ తప్పు చేశాననే బాధతో కుమిలిపోతున్నాడు. దీప, తన కుటుంబానికి చేరువ కాబోతున్న శుభ తరుణంలో మోనిత పెట్టిన చిచ్చుకు మదనపడిపోతున్నాడు. తన ప్రమేయం లేకుండా చేసిన తప్పును ఎలా సరిద్దిద్దుకోవాలనే ఆలోచనలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో మోనిత తన దూకుడు మరింత పెంచడంతో దీప, సౌందర్య, ఇద్దరు పిల్లలు ఒక రకమైన షాక్ గురవుతున్నారు. తాజాగా 1071 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  డైరెక్టుగా మోనిత ఎంట్రీతో

  డైరెక్టుగా మోనిత ఎంట్రీతో

  దీప ఉదయమే ఏదో పని ఉందని చెప్పి బయటకు వెళ్లింది. దాంతో పిల్లలు, దీప, తన కోసం కార్తీక్ ఇడ్లీ ప్రిపేర్ చేశాడు. ఆకలిగా ఉండటంతో ఇడ్లీ తినడం ప్రారంభించగానే దీప ఇంట్లోకి అడుగపెట్టింది. దీపను చూసి... నీవు రావడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో నేను టిఫిన్ చేస్తున్నాను. నీకు కూడా హాట్ ప్యాక్‌లో టిఫిన్ దాచి పెట్టాను. రా కలిసి తిందం అంటూ అనబోతుండగా.. హాయ్ కార్తీక్.. మరీ నాకు ఇడ్లీ లేదా అంటూ సరాసరి వచ్చి డైనింగ్ టేబుల్‌పై కూర్చున్నది. దాంతో పిల్లలు, కార్తీక్, దీప షాక్ అయ్యారు.

  ఇడ్లీ కూడా నీలాగే సాఫ్ట్‌గా

  ఇడ్లీ కూడా నీలాగే సాఫ్ట్‌గా

  కార్తీక్, దీప ఉంటున్న ఇంట్లోకి మరోసారి డాక్టర్ మోనిత అడుగుపెట్టి... హిమ, శౌర్యను పలకరిస్తూ.. ఇడ్లీ ఎలా ఉందని అడిగితే.. బాగానే ఉంది. మానాన్న ఏది చేసిన బాగుంటుంది. మా నాన్న ఏ పనిచేసిన బాగుంటుంది అని వారు సమాధానం ఇచ్చారు. ఆ విషయం నాకు తెలియదా అంటూ.. కార్తీక్‌ను అడిగి ఇడ్లీ తీసుకొంది. ఆ తర్వాత ఇడ్లీ సూపర్‌గా ఉంది. సాఫ్ట్‌గా నీలాగే అంటూ కార్తీక్ వైపు చూసింది.

  వాంతులు అవుతున్నాయి.. నోటికి పుల్లగా

  వాంతులు అవుతున్నాయి.. నోటికి పుల్లగా

  ఇక దీపతో మాట్లాడుతూ.. ఈ మధ్య వీక్‌నెస్‌గా ఉంటుంది. వాంతులు కూడా అవుతున్నాయి. నిమ్మకాయ పచ్చడి ఏదైనా ఉందా? పుల్లగా ఉంటే నోటికి బాగుంటుంది అంటూ మోనిత తినడం ప్రారంభించింది. పిల్లల్ని చూసి మీ గురించి మరిచిపోయాను. నాకు ఈ మధ్య మతిమరుపు వస్తున్నది. దాంతో వారు తీసుకోవడానికి నిరాకరించింది. దాంతో నీవైనా చెప్పు కార్తీక్.. మన పిల్లలు అని తీసుకొచ్చాను అని మోనిత చెప్పింది. దాంతో కార్తీక్ తీసుకోమని చెప్పగానే వారిద్దరూ తీసుకొన్నారు. మోనిత విషయాన్ని చూసి దీప, ఇద్దరు పిల్లలతోపాటు కార్తీక్ జీర్ణించుకోలేకపోయారు.

  నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు..

  నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు..

  మోనిత తీరును మనసులో ఊహించుకొటూ.. నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు. గిల్టీగా ఫీలవ్వలేదు. అందుకే నేను తలదించుకోలేదు. కానీ ఒక తప్పు చేస్తే ఇంత అవమానభారంగా ఉంటుందా? నేను దీపను అనుమానిస్తే ఎంత క్షోభకు గురై నరకంగా అనుభవించి ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఈ బాధను చూస్తే నా కళ్ల కింద భూమి రెండుగా చీలిపోయి ఉంటే బాగుండని అనిపిస్తుంది అని కార్తీక్ తనలో తాను అనుకొన్నారు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  ఇంకా 8 రోజులే డెడ్‌లైన్

  ఇంకా 8 రోజులే డెడ్‌లైన్

  ఇద్దరు పిల్లల్ని మోనిత బయటకు పంపించి.. నేను ఇటువైపు పని ఉండి వచ్చాను. అలా కలిసి వెళ్దామని వచ్చాను. అనుకోకుండా మంచి టిఫిన్‌ను ఎంజాయ్ చేశాను అని మోనిత వెళ్లిపోవడానికి సిద్ధమై మళ్లీ ఆగింది. గోడ మీద గీసిన గీతల్లో రెండో గీతను క్రాస్ చేసింది. వస్తా కార్తీక్.. దీప మళ్లీ కలుద్దాం అంటూ మోనిత ఇంటి నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత ఇంకా ఎనిమిది రోజుల డెడ్‌లైన్ మాత్రమే ఉందనే విషయం కార్తీక్‌ను గుర్తు చేసింది.

  English summary
  Karthika Deepam 20th June's Episode of 1071 goes with emotional content. Doctor Monita set deadline for Karthik. After Monita's pregnancy revelations, situation become horrible in karthik's home. In this emotional situtaion, Soundarya serious over Karthik in latest episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X