Karthika Deepam డాడీతో కలిసి ఉన్నా.. ఎప్పుడూ ఇంతేనా.. హిమ ప్రశ్నల వర్షం.. కంటతడి పెట్టిన దీప
కార్తీక దీపం సీరియల్ సుదీర్ఘంగా సాగుతూ ఎన్నో మలుపులు తిరుగుతూ ముందుకెళ్తున్నది. మోనిత ప్రెగ్నెన్సీ వ్యవహారం దీప కాపురంలో మరోసారి అగ్గి రాజేసింది. సౌందర్య, భాగ్యం ఇద్దరు కలిసి మోనితను ఎలా ఎదుర్కోవాలనే ప్లాన్ వేస్తూ కనిపించారు. చిన్నప్పటి నుంచి దూరంగా పెరిగిన శౌర్యపై కార్తీక్ ప్రేమను కురిపిస్తూ ఆనందంలో ముంచెత్తారు. ఇలా భావోద్వేగంగా సాగిన 1071 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే...

దీప, హిమ బయటకు వెళ్తూ...
దీప, హిమ కలిసి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లారు. ఆటోవాలా వారణాసి లేకపోవడంతో రోడ్డు మీదకు వచ్చి ఎండలో నడుస్తూ ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు. ఎండ బాగా ఉండటంతో హిమ తట్టుకోలేకపోయింది. దాంతో తన చీర కొంగు తీసి హిమపై కప్పింది. సరుకులు తీసుకొని ఇంటికి తీరుగు ముఖం పట్టిన తర్వాత హిమ ఎమోషనల్ అయింది. తలిదండ్రులతో కలిసి ఉన్న ఆనందం లేదంటూ హిమ కంటతడి పెట్టింది.

అంతా ఏదో కొత్తగా అంటూ
వారణాసి ఆటోలో ఎందుకు వెళ్లడం లేదంటూ హిమ ప్రశ్నించింది. వారణాసి ఊర్లో లేడంటూ దీప సమాధానం ఇవ్వడంతో.. ఫోన్ ఎందుకు ఎత్తడం లేదంటూ మళ్లీ అడిగింది. బయటకు వెళ్లాడు.. అందుకే ఫోన్ ఎత్తడం లేదు అని దీప సమాధానం ఇస్తే.. ఊరు వెళితే ఫోన్ ఎత్తడానికి ప్రాబ్లెం ఏమిటని హిమ ప్రశ్నించింది. దాంతో నాకు అంతా కొత్తగా అనిపిస్తున్నది. ఎంటో దిగులుగా ఉంది అంటూ హిమ బాధపడింది.

డాడీ, నీవు కలిసి ఉన్నా..
డాడీ, నువ్వు కలిసి మాతో ఉన్నా మాకు ఏదో దిగులు. మనసులో ఏదో భయం వెంటాడుతున్నది. నాన్న నీతో మాట్లాడకపోయినా.. సైలెంట్‌గా ఉండేవాడు. నీవు నాన్నతో మాట్లాడకపోయినా మాతో బాగా మాట్లాడేదానిని. మీకు మేముంటే చాలు అనే దానివి. కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు. అందరం ఒకటే ఇంట్లో ఉన్నా ఎవరికి వారే ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వారణాసి కూడా ఫోన్ ఎత్తకపోతే మన మీద కోపం వచ్చినట్టు అనిపించాదా అనిపిస్తున్నది అంటూ హిమ కంటతడి పెట్టింది.

మనం నలుగురం వేరా మమ్మీ...
తల్లి మౌనంగా వింటుండటంతో హిమ తన బాధను వెళ్గక్కుతూ.. ఈ ప్రపంచంలో మనుషులంతో వేరు.. మనం నలుగురం వేరు అన్నట్టు అనిపిస్తున్నది. డాడీ నన్ను ఎంతగానో పెంచినా అమ్మా లేదనే దిగులు ఉండేది. ఎవరి ఫోటో చూపించి ఇదే మీ అమ్మ అన్నాడు. ఎప్పుడో పేపర్లో వచ్చిన పెళ్లి ఫోటో చూసి నీవు అమ్మా అని తెలుసుకొన్నాను. కానీ నీవు అమ్మ అని పిలువవద్దని అన్నావు. అమ్మను అమ్మా అని పిలువకుండా ఉండాలంటే ఎంత కష్టంగా ఉండేదో తెలుసా అమ్మా? అని హిమ అంటే దీప కంటతడి పెడుతూ మౌనంగా ఉంది.
Recommended Video

హిమ ప్రశ్నలు దీప మౌనంగా రోదిస్తూ..
వంటలక్క నుంచి నీవు నాకు అమ్మగా మారావు. కానీ మనం కొద్ది రోజులు బస్తీలో ఉంటాం. కొన్ని రోజులు బంగ్లాలో ఉంటాం. కొన్ని రోజులు విజయనగరంలో ఉంటాం. ఎక్కడా వారం రోజుల కూడా ఉండలేం. ఎందుకమ్మా అలా.. ఎప్పుడూ ఏదో ఇంతేనా? అంటూ దీపతో మాట్లాడుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. హిమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దీప మౌనంగా రోదిస్తూ ఎమోషనల్ అయింది. తన కూతరు బాధను అర్ధం చేసుకొంటూ హిమ తలను ఒడిలో పెట్టుకొని ఓదార్చింది.


Click it and Unblock the Notifications











