For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam June 23rd Episode కార్తీక్ పరిస్థితి దారుణంగా... సిగ్గుతో చస్తున్నా అంటూ దీప చేయి పట్టుకొని!

  |

  కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్ కుటుంబంలో మోనిత వ్యవహారం మింగుడు పడని విషయంగా మారింది. దీప తల్లి భాగ్యం, సౌందర్య మధ్య, అలాగే ఆదిత్య, తల్లి సౌందర్య మధ్య ఎమోషనల్‌గా సన్నివేశాలు చోటుచేసుకొన్నాయి. అలాగే కార్తీక్ తనలో తాను మదనపడుతూ.. ఓ రకమైన డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనల మధ్య 1073 ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ మధ్య ఏం జరిగిందంటే..

  దీప.. నీకు అన్యాయం చేయలేదు

  దీప.. నీకు అన్యాయం చేయలేదు

  కార్తీక్, దీప ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరి మధ్య రాజ్యం ఏలుతున్నది. ఇద్దరు ముభావంగా ఉండటం చూసి పిల్లలకు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కార్తీక్ మానసిక పరిస్థితి దారుణంగా మారుతున్నది. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించడాన్ని తట్టుకొలేకపోతున్నాడు. ఈ క్రమంలో గోడపై మోనిత గీసిన డెడ్‌లైన్ మార్కును చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్.. మోనిత అంటూ కార్తీక్ గోడకు చేతిని బాదుతూ... దీప నన్ను నమ్ము. నీకు నేను అన్యాయం చేయలేదు. నాతో మాట్లాడు. నాతో వాదించు.. నన్ను నిందించు. నేను తట్టుకోలేకపోతున్నాను.. దీప అంటూ గోడపై కొడుతూ బాధపడిపోయాడు.

  లోకమంతా కోడైకూసినా..

  లోకమంతా కోడైకూసినా..

  దీపతో చెప్పాలనుకొన్న మాటలను తన మనసులో వ్యక్తం చేసుకొంటూ.. నన్ను అర్ధం చేసుకో దీప.. నన్ను నమ్ము దీప. నేను నీకు అన్యాయం చేయలేదు అంటూ కార్తీక్ క్షోభకు గురై దీపకు కనిపించాడు. దాంతో దీప తన మనసులో కార్తీక్ గురించి ఆలోచిస్తూ...ఎందుకింత మదన పడుతున్నారు. ఎప్పుడు తను నమ్మిన దాని మీద.. తప్పైనా ఒప్పైనా దాని మీదే నిలబడుతారు. దానిమీదే నిలబడి వాదిస్తారు. నేను తప్పు చేశానని ఆయన నమ్మారు. తల్లిదండ్రులు, సోదరుడు చెప్పినా, లోకమంతా కోడైకూసినా తాను నమ్మిందే నిజమని నమ్మాడు. కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా మదనపడి పోతున్నాడు అని దీప మనసులో అనుకొంది.

   కార్తీక్ విషయంలో ఏం జరిగిందంటే..

  కార్తీక్ విషయంలో ఏం జరిగిందంటే..

  కార్తీక్ పరిస్థితి గురించి ఆలోచించడం మొదలు పెట్టిన దీప... ఇది అపరాధ భావన కాదు. భార్యతో సవ్యంగా కాపురం చేస్తున్న వాడైతే .. అయ్యో.. భార్యకు అన్యాయం అయిపోయిందని గిల్టీగా ఫీల్ అవుతాడు. నన్ను దూరం పెట్టి పదేళ్లు అయింది. మోనిత అంటే ఆయనకు ఇష్టం. మోనితను పెళ్లి చేసుకొంటానని పలుమార్లు చెప్పారు. అందువల్ల కలిశాం.. అందులో తప్పేముంది. ప్రపంచంలో జరిగే పని అని దాబాయించి చెప్పవచ్చు. కానీ అలా చేయడం లేదు. అసలు ఏం జరుగుతున్నది అంటూ దీప ఆలోచనలో పడింది.

  మౌనంగా శిక్షించకు దీప అంటూ

  మౌనంగా శిక్షించకు దీప అంటూ

  ఇక తనలో తాను కుమిలిపోతూ బాధతో కార్తీక్ గోడకు జారగిలపడ్డారు. అది చూసి గ్లాస్‌లో నీళ్లు ఇవ్వడానికి దీప ప్రయత్నిస్తూ.. డాక్టర్ బాబు నీళ్లు తాగండి అంటూ చెప్పింది. నీళ్ల గ్లాస్ ఇచ్చి తిరిగి వెళ్తున్న దీప చేయిపట్టుకొని.. కూర్చోపెట్టారు... దీప... నాతో మాట్లాడు.. నాతో డిస్కస్ చేయి.. మౌనంగా ఉండి శిక్షించవద్దు. నన్ను అలా అనుమానంగా చూడకు దీప.. పదేళ్లు అవమానించి.. అనుమానించినందుకు.. ఆ బాధ ఎలా ఉంటుందోనని చెప్పాలనుకొంటున్నావా.. దయచేసి అలా మౌనంగా ఉండకు దీప.. అంటూ ప్రాధేయపడ్డారు.

  నాకు పిల్లలు పుట్టరని చెప్పిన వ్యక్తితోనే..

  నాకు పిల్లలు పుట్టరని చెప్పిన వ్యక్తితోనే..

  మోనిత గీసిన గీతలు చూస్తూ అది నా ఖర్మ.. నాకు పిల్లలు పుట్టరనే విషయం మరో రూపంలో చెప్పాల్సి ఉండాల్సింది. నాకు పిల్లలు పుట్టరని చెప్పిన వ్యక్తికి అలా జరగడం చాలా అన్యాయం. నా వల్ల అలా జరగదు. నన్ను తండ్రి అయ్యే యోగం నా క్లోజ్ ఫ్రెండ్ వల్లే నిరూపించబడటం నేను తట్టుకోలేకపోతున్నాను అని కార్తీక్ చెప్పాడు. నీకు పిల్లలు పుట్టరని చెప్పింది మోనితనా? డాక్టర్లు కాదా? అని దీప ప్రశ్నిస్తూ.. డాక్టర్లు చెప్పిందే.. మోనిత చెప్పింది.. నేను బాధపడుతానని చెప్పి మోనితతో చెప్పించారు. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్‌కే అలా జరిగిందా అంటూ కార్తీక్ బాధపడిపోయాడు

  Pitta Kathalu Team Interview With Ramya Krishna
  ఆ రోజు మత్తులో అలా జరిగిపోయింది దీప..

  ఆ రోజు మత్తులో అలా జరిగిపోయింది దీప..

  దీపకు తన మనసులోని బాధను చెబుతూ.. నీకో విషయం తెలుసా? బయట మందు కొట్టడం చేయను. పార్టీలకు కూడా హాజరుకాను. ఆ రోజు నా బ్యాడ్ లక్. మోనిత పీకలదాకా తాగాను. మన మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేంత వరకు నాకు తెలియదు. అంత మత్తులో ఉన్నాను. అంత తాగినందుకు సంస్కారం లేకుండా.. లేకి పని చేసినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. నన్ను నమ్ము.. నన్ను అర్ధం చేసుకో. నన్ను క్షమించు దీప.. నేను దుర్మార్గుడిని కాదు. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేయి.. ఏ అమ్మాయిని అలాంటి దృష్టితో చూడలేదు అంటూ బాధపడిపోయాడు. దాంతో మీరు వెళ్లి పడుకోండి అంటూ దీప చెప్పింది.

  English summary
  Karthika Deepam 23nd June's Episode of 1073 goes with emotional content.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X