Karthika Deepam మోనిత క్రిమినల్.. ఓ సైకో.. కుట్రలను బట్టబయలు చేసేందుకు దీప మాస్టర్ ప్లాన్!

కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్, దీప మధ్య ఎమోషనల్‌గా సంభాషణ జరిగింది. కార్తీక్ మానసిక పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన దీప మనసులో మోనితపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మోనిత వ్యవహారం తెలిసిన దీప.. అనేక కోణాల్లో ఆమె కుట్రలపై ఆలోచించడం మొదలుపెట్టింది. 1073 ఎపిసోడ్‌లో దీప మనసులో జరిగిన సంఘర్షణ ఏమిటంటే...

మొబైల్ ఫోన్ పగులకొట్టిన మోనిత

మొబైల్ ఫోన్ పగులకొట్టిన మోనిత

మోనిత తనపై చేసిన కుట్రలను ఒక్కొక్కటి గుర్తు చేసుకొంటూ... ఒక సందర్భంలో దీప మొబైల్ ఫోన్ పగలకొట్టి.. ఆ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ గురించి చూసిన సంఘటనను గుర్తు చేసుకొన్నది. నీ ఫోన్ పగలుకొట్టినందుకు నాపై కేసు పెడుతావేమోనని.. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా? అని అలా పైకి చూసాను అంటూ మోనిత చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకొన్నది.

హాస్పిటల్ బెడ్‌పై బలవంతంగా ఇంజెక్షన్

హాస్పిటల్ బెడ్‌పై బలవంతంగా ఇంజెక్షన్


అలాగే తాను హాస్పిటల్ బెడ్‌పై ఉన్న సమయంలో బలవంతంగా తనకు ఒక ఇంజెక్షన్ చేయడం తన మనసులో కదిలింది. మోనిత ఏదో కుట్రతో చేసినట్టు అనుమానం వ్యక్తం చేసింది. అలాగే తనతో కార్తీక్ మాట్లాడుతూ.. నాకు పిల్లలు పుట్టరని చెప్పిన వ్యక్తికి నా వల్ల అలా జరగడం తట్టుకోలేకపోతున్నాను. మన మధ్య తప్పు జరిగిందని మోనిత చెప్పేంత వరకు నాకు తెలియదు అని కార్తీక్ చెప్పిన విషయాలు దీపకు గుర్తుకు వచ్చాయి.

మోనిత మెదడు నిండా కుట్రలే

మోనిత మెదడు నిండా కుట్రలే


ఇలాంటి సంఘటనలన్నీ బేరిజు వేసుకొంటూ.. ఒక సంసార పక్షంగా ఉండే ఆడది ఆలోచించ పద్దతిలో మోనిత విధానం ఉండదు. ఆ మెదడు నిండా కుట్రలు, కుతంత్రాలే. అన్నీ పథకాలే.. ఇది కూడా అదే అయి ఉంటుందా? మోనిత ఉన్నది ఉన్నట్టు ఎప్పుడూ చెప్పదు. మిగితా విషయంలో అది సాధ్య పడొచ్చు. కానీ ప్రెగ్నెన్సీ విషయంలో ఎలా జరుగుతుంది. కార్తీక్ కూడా డాక్టరే.. డీఎన్ఏ పరీక్షలో బయటపడుతుందనే భయం ఆమెకు లేదా అని దీప ఆలోచించడం మొదలుపెట్టింది.

నిజంగా కార్తీక్ తప్పు చేశాడా?

నిజంగా కార్తీక్ తప్పు చేశాడా?


కార్తీక్‌తో గర్బం దాల్చిన విషయంలో అంత ధైర్యంగా అబద్దం చెప్పదు. నిజంగా మోనిత గర్బవతియేనా? ఈ విషయంలో కార్తీక్ ప్రమేయం ఉందా? ఈ విషయంలో కార్తీక్ ఎందుకు బాధపడుతున్నారు. నిజంగా తప్పు జరిగిందా? మోనితను చూసి ఎందుకు భయపడుతున్నారు అంటూ మోనిత గురించి ఆలోచించడంతోపాటు ఏదైనా ఉద్దేశపూర్వకమైన ఆలోచనలు ఉన్నాయా అని దీప మనసు పదే పదే అనుమానాల్ని వ్యక్తం చేసింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
మోనితది క్రిమినల్ బ్రెయిన్.. ఓ సైకో అంటూ

మోనితది క్రిమినల్ బ్రెయిన్.. ఓ సైకో అంటూ


మోనిత విషషయంలో ఇప్పుడు కార్తీక్ కళ్లలో అభిమానం లేదు. అనుమానం, అయోమయం ఉంది. ఆమె చెప్పేంత వరకు ఆయనకే తెలియదు. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఉందనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఏముంటుంది. మోనిత అసలు మామూలు ఆడదే కాదు. దానిది క్రిమినల్ బ్రెయిన్.. అది ఒక సైకో.. దాన్ని నమ్మడానికి లేదు. ఏదో ఉంది అంటూ దీప అనేక కోణాల్లో ఆలోచించింది. ఏదో మోసం ఉందనే విషయాన్ని బయటకు ఎలా తీయాలా అని ప్లాన్ వేసినట్టు కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X