Karthika Deepam.. నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రివి నీవే.. నీకు ఉంపుడుగత్తెనా.. కార్తీక్‌కు మోనిత షాక్

కార్తీకదీపం సీరియల్‌లో మోనిత బ్లాక్‌మెయిల్ పరాకాష్టకు చేరుకొన్నది. కార్తీక్‌ను తీసుకొని రిజిస్టర్ ఆఫీస్‌కు చేరుకొన్నది. రిజిస్టర్ ఆఫీస్ బోర్డు చేసిన కార్తీక్ కంగు తిన్నాడు. నీవు చేస్తున్న పని ఏమిటని మోనితను కార్తీక్ ప్రశ్నించాడు. ఈ క్రమంలో 1077 ఎపిసోడ్‌లో మోనిత, కార్తీక్ మధ్య ఏం జరిగిందంటే..

రిజిస్టర్ ఆఫీస్‌కు కార్తీక్, మోనిత

రిజిస్టర్ ఆఫీస్‌కు కార్తీక్, మోనిత

రిజిస్టర్ ఆఫీస్‌కు ఎందుకు తీసుకొచ్చావు అంటే.. రిజిస్టర్ ఆఫీస్ ఉన్నది ఎందుకు అని మోనిత ఎదురు ప్రశ్న వేసింది. దాంతో ఇప్పుడు ఎందుకు ఇందంతా.. నేను అందరి ముందు ప్రశ్నార్థకంగా నిలబడాలి అంటే.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ప్రపంచానికి ఏమి చెప్పాలంటూ ప్రశ్నించింది.

 మన ఇద్దరి పరిస్థితి అగమ్య గోచరంగా

మన ఇద్దరి పరిస్థితి అగమ్య గోచరంగా

కార్తీక్ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఆ రోజే ఆ పని వాయిదా వేసుకొంటే.. మన ఇద్దరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది కాదు. ఈ గమ్యానికి వచ్చే వాళ్లమే కాదు అంటూ మోనిత కాస్త కటువుగానే చెప్పింది. అలా వారిద్దరూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోకి వెళ్దాం రా అంటూ మోనిత ముందుకు కదిలింది. కానీ కార్తీక్ అక్కడే నిలబడి పోవడంతో.. రా కార్తీక్.. అక్కడే నిలబడి పోయావు. నన్ను చూస్తే భయమేస్తుందా అంటూ మోనిత ప్రశ్నించింది.

 నీ కథనానికి ప్రేక్షకుడిలా...

నీ కథనానికి ప్రేక్షకుడిలా...


నాకు గుర్తు లేదు. స్పృహ లేదు. ఆ సంఘటన తాలుకూ అనుభూతి లేదు. మనమధ్య స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని చూపించే సాక్ష్యం ఉంది. కానీ సంఘటన తాలుకూ సాక్ష్యం లేదు. కానీ విన్నవాళ్లు నమ్మేస్తున్నారు. విచిత్రంగా నేను వినేవాళ్లలో ఒకడిని అయ్యాను. నువ్వే చెప్పే కథనానికి ప్రేక్షకుడిని అయ్యాను. ఈ పరిస్థితితో శూన్యంలో నిలబడ్డాను. ధీప ముందు దోషిలా నిలబడ్డాను. మా అమ్మ ముందు సంస్కారం లేని మనిషిగా నిలబడ్డాను. ఇదంతా నాకు జీర్ణం కాకముందే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొంటే ఏం చెప్పాలో తెలియడం లేదు.

తప్పును ఒప్పుగా మార్చుకొనేందుకు

తప్పును ఒప్పుగా మార్చుకొనేందుకు

కార్తీక్‌ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. నీకు గుర్తు లేకపోయినా.. అనుభూతి లేకపోయినా.. సాక్ష్యం ఉంది అంటూ మోనిత తన కడుపును చూపిస్తూ.. ఈ సాక్ష్యానికి నీవే తండ్రివి కావాలి. లేకపోతే శౌర్య పెరిగినట్టు ఏడేళ్లు నా బిడ్డ పెరగాలి. కేరాఫ్ కాదు.. డాటర్ ఆఫ్ గానో.. సన్నాఫ్ గానో పెరిగాలి. అలా పెరగాలంటే.. నీకు నాకు పెళ్లి అయిందనే సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యానికి నీ సంతకం కావాలి. ఇద్దరు తప్పును ఒప్పుగా మార్చుకోవడానికి నీ సంతకం సాక్ష్యంగా ఉపయోగపడుతాయి. లోపలికి వెళ్తే వెంటనే దండలు వేసుకోమనరు. నీకు జీర్ణం కావడానికి సమయం ఇస్తారు. నాకు న్యాయం జరుగడానికి శ్రీకారం చుడుతారు అని మోనిత తన జోష్‌తో మాటలు ఒక్కరిబిక్కిరి చేసింది.

 స్టాపిట్ మోనిత అంటూ కార్తీక్

స్టాపిట్ మోనిత అంటూ కార్తీక్

రిజిస్టర్ ఆఫీస్‌లో కూర్చొని ఉన్న కార్తీక్ తన సీట్లో నుంచి లేస్తూ.. వెళ్లిపోదాం అని అంటే ఎందుకు అని మోనిత ప్రశ్నించింది. ఈ నిర్ణయం ఇంత తర్వగా తీసుకొనేది కాదు అంటూ కార్తీక్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు. నా కడుపు సంగతి ప్రపంచానికి తెలిసేంత వరకా? నా కడుపు గురించి అందిరికి తెలిసి రకరకాలుగా అనుకోవాలా? నన్ను నీ ఉంపుడు గత్తే అనుకోవాలా? అని మోనిత అంటే.. స్టాపిట్ అంటూ కార్తీక్ గట్టిగా అరిచాడు. ఏం నా బిడ్డ అనాధగా బతకాలా అంటూ ప్రశ్నించింది.

మోనితకు షాకిచ్చిన రిజిస్ట్రార్

మోనితకు షాకిచ్చిన రిజిస్ట్రార్

నేను నీ స్నేహితురాలిని. నిన్ను పదహారు ఏళ్లుగా ప్రేమిస్తున్నాను. నా మాట మీద నమ్మకం లేదా? మన ప్రేమ మీద నమ్మకం లేదా నీకు అంటూ మోనిత ప్రశ్నల వర్షం కురిపించింది. నా ప్రేమ మీద ఒట్టేసి చెబుతున్నాను. నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రివి నీవే అంటూ మోనిత ఆవేశంగా మాట్లాడింది. అలా వారిద్దరి మధ్య రిజిస్టర్ మ్యారేజ్ గురించి భారీగా వాగ్వాదం జరిగింది. అయితే మోనిత ఆశలకు చెక్ పెడుతూ రిజిస్ట్రార్ షాక్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X