Karthika Deepam..కిలో రవ్వలో అర్దపావు షుగరా? రవ్వ లడ్డూతో దీప పిన్నికి మోనిత రిటర్న్ గిఫ్ట్!
కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్‌తో మోనిత పెళ్లి ప్రయత్నాల్లో ఉండటం అందర్నీ షాక్ గురి చేస్తున్నది. కార్తీక్ తల్లి సౌందర్య, దీప పిన్ని భాగ్యం, భార్య దీప అందరూ టెన్షన్‌లో పడ్డారు. అందరిలోను మానసిక సంఘర్షణ మొదలైంది. ఎవరికి కూడా ఏం జరగబోతున్నదో అర్ధం కావడం లేదు. ఇలాంటి క్రమంలో మోనిత ఇంటికి దీప పిన్ని భాగ్యం వెళ్లింది. అలాగే మోనిత వ్యవహారం చర్చించడానికి తన ఇంటికి వెళ్లి తల్లితో కార్తీక్ చివాట్లు తిన్నాడు. తాజా ఎపిసోడ్ 1079లో ఇంకా ఏం జరిగిందంటే...

కార్తీక్ ఇచ్చిన డబ్బుతోనేనా?
తన కూతురు దీపకు అన్యాయం చేస్తున్నదనే భావనలో ఉన్న భాగ్యం ఇక లాభం లేదనుకొని మోనిత ఇంటికి వెళ్లింది. ఇల్లు, కారు అన్నీ కార్తీక్ కొనిచ్చాడని బయట ప్రజలు అంటున్నారు. నిజమేనా అంటూ దీర్ఘాలు తీయడంతో.. కాదు నా సొంతంగా సంపాదించుకొన్నాను అని మోనిత సమాధానం చెప్పింది. దాంతో నీవు నీ బిడ్డను కూడా సొంతంగానే పెంచుకో.. కావాలంటే కార్తీక్ ఆ బిడ్డను చదివిస్తాడు అంటూ భాగ్యం షాకిచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా కడుపుతో ఉన్నావని నేను నీకోసం రవ్వ లడ్డులూ తెచ్చాను. తినమ్మా అంటూ సెటైర్ వేసింది.

కార్తీక్‌తో నా పెళ్లి ఆగదు
భాగ్యం ఇంటెన్షన్‌ను తెలుసుకొన్న మోనిత ఆమెపై ఎదురుదాడి చేయబోయింది. మీరు ఎన్ని అనుకొన్నా.. ఎలాంటి ప్రయత్నాలు చేసినా నా పెళ్లి కార్తీక్‌తో ఆగదు. కార్తీక్‌తో నా పెళ్లి 25వ తేదీన అంటూ మోనిత షాకిచ్చింది. దాంతో నోరు తెరిచిన భాగ్యంపై సెటైర్ వేస్తూ.. నోరు మూసుకో.. ఇంకో లడ్డూ కూడా పట్టేటట్టుంది అంటూ ఎద్దేవా చేసింది. నీవు చేసిన లడ్డు కోసం.. కేజీ రవ్వలో అర్ధపావు చక్కెరా వేశావా? అంటూ అవమానించే ధోరణిలో మాట్లాడింది. దాంతో దీపకు ఈ విషయం చెప్పడానికి అక్కడి నుంచి బయలుదేరింది.

దీప, కార్తీక్ ఎమోషనల్‌గా
కార్తీక్ బయటకు వెళ్లబోతుండటంతో దీప ఎదురు వచ్చింది. ఏమైనా చెప్పాలనుకొంటున్నావా అని కార్తీక్ అడిగితే.. భోజనం చేసి వెళ్లండి.. నీ కోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు. నీవు పిల్లలతో కూడా సరిగా మాట్లాడటం లేదు. కాబట్టి వారితో కలిసి భోజనం చేయండి అంటూ అడిగితే.. ఆకలిగా లేదు.. తినాలని అనిపించడం లేదు. నేను తల్లిని కలువడానికి వెళ్తున్నాను అంటూ కార్తీక్ సమాధానం ఇచ్చాడు. అయితే నీవు ఎక్కడికి వెళ్తున్నావనే విషయం నాకు అవసరం లేదు అంటూ సమాధానం చెప్పింది. దాంతో నీవు కూడా పిల్లలతో సరిగా మాట్లాడటం లేదనే విషయాన్ని తెలుసుకో అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు.

కార్తీక్‌ను కడిగిపడేసిన తల్లి సౌందర్య
తల్లి సౌందర్యను కలిసి కార్తీక్.. తన బాధను చెప్పుకొనే ప్రయత్నం చేశాడు. కానీ సౌందర్య ఆయనను కడిగి పడేసింది. పదేళ్లు అగ్ని ప్రవేశం చేసి వచ్చిన దీపకు అన్యాయం చేయకు. పదేళ్లు అనాథలు పెరిగిన పిల్లలకు జవాబుదారీగా ఉండు. సమాజం దృష్టిలో దీపకు న్యాయం చేసే విధంగా జవాబుదారీగా ఉండమని హెచ్చరించింది. మోనిత పెళ్లి విషయం నీకు ఎలా తెలిసిందని అడిగితే.. స్వయంగా ఆమె వచ్చి చెప్పిందని సౌందర్య వెల్లడించడంతో కార్తీక్ షాక్ తిన్నాడు.

మోనిత, కార్తీక్ పెళ్లి విషయం దీప దృష్టికి
ఇక దీప వద్దకు వెళ్లిన భాగ్యం అసలు విషయం చెప్పేసింది. కార్తీక్, మోనిత పెళ్లి 25వ తేదీన అంటూ అసలు విషయం బయటపెట్టింది. దాంతో దీప షాక్ గురైంది. ఆ సమయంలో దీప మనసులో రకరకాల ప్రశ్నలు లేచాయి. ఇలాంటి ట్విస్టులతో 1079 ఎపిసోడ్ ముగిసింది. తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి రేపే విధంగా కార్తీకదీపం సీరియల్ ముందుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











