Karthika Deepam May 18th Episode: ఈ పెద్దోళ్లు ఉన్నారే.. పిడుగుల్లా శౌర్య, హిమ.. బుల్లెట్స్‌లా పేలిన డైలాగ్స్

సుదీర్ఘంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్‌లో దీప, కార్తీక్ మధ్య ఎమోషనల్ సీన్లు చోటు చేసుకొంటుంటే వారి పిల్లలు శౌర్య, హిమకు ఏమీ అర్ధం కాని పరిస్థితి. శ్రీరాంనగర్ బస్తీ ఇంట్లో ఏం జరుగుతందో అనే విషయం వారిని కలవర పెడుతున్నది. ఈ సందర్భంగా శౌర్య, హిమ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. వారిద్దరూ ఏమి మాట్లాడుకొన్నారంటే..

అమ్మను డాడీ ఎందుకు తిట్టడం లేదు..

అమ్మను డాడీ ఎందుకు తిట్టడం లేదు..

మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం అని శౌర్య అంటే.. అమ్మ ఏం చెప్పడం లేదు.. అలాగని డాడీ కూడా ఏం మాట్లాడటం లేదు అంటూ హిమ సమాధానం చెప్పింది. అమ్మను డాక్టర్ బాబు ఎందుకు తిట్టడం లేదు అని శౌర్య అంటే.. గట్టిగా తిడితే ఇక్కడుకు వచ్చింది కదా.. మళ్లీ తిడితే విజయనగరం వెళ్లిపోతుందేమో అని హిమ సమాధానం చెప్పింది.

డాక్టర్ బాబు ఇక్కడే ఉంటారా?

డాక్టర్ బాబు ఇక్కడే ఉంటారా?

డాక్టర్ బాబును చూసి అమ్మ ఎందుకు భయపడటం లేదు.. ఎందుకు అని హిమ అంటే.. ఇది డాక్టర్ బాబు ఇళ్లు కాదు కదా.. అందుకే భయ పడటం లేదు అని శౌర్య చెప్పింది. అది కాదు.. అమ్మకు ఆరోగ్యం బాగా లేదు కదా అంటూ హిమ సమాధానం చెప్పింది. మనం ఇక్కడే ఉండాలా? అంటే అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి. అయితే డాక్టర్ బాబు ఇక్కడే ఉండిపోతాడా అంటూ హిమ మరో అనుమానం వ్యక్తం చేసింది. ఇక్కడే ఉండి హాస్పిటల్‌కు ఎలా వెళుతాడు అంటూ శౌర్య చెప్పింది.

ఏది సరిగా చెప్పరు ఈ పెద్దాళ్లు..

ఏది సరిగా చెప్పరు ఈ పెద్దాళ్లు..

ఈ పెద్దాళ్లు ఉన్నారు కదా.. పిల్లలకు అసలే అర్ధం కాదు అని శౌర్య అంటే.. అదేమిటో మనకు ఏది అనిపించినా చెప్పేస్తాం. కానీ వాళ్లు ఏ విషయం సరిగా సరిగా చెప్పరు. కానీ చిన్న చిన్న విషయాలకు అమ్మను డాక్టర్ బాబు ఎందుకు తిడుతారు.. హిమ అంటే.. అమ్మకు వంట వచ్చు కాబట్టి.. వంట చేస్తానంది..దానికి ఎందుకు తిట్టాలి అంటూ శౌర్య అనుమానం వ్యక్తం చేసింది.

ముసి ముసి నవ్వులతో

ముసి ముసి నవ్వులతో


తన తల్లి, తండ్రి గురించి మాట్లాడుకొంటూ ఈ పెద్దోళ్లు ఉన్నారే.. పిల్లలకు అసలే అర్ధం కారు అంటూ మళ్లీ డైలాగ్ చెప్పి ముసి ముసి నవ్వులు నవ్వుకొన్నారు. అంతలోనే ఆటోడ్రైవర్ వారణాసి అక్కడకు వచ్చారు. దాంతో ఆయనను చూసి ఆట పట్టించాలని డిసైడ్ అయ్యారు.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
వారణాసిని ఆటపట్టించిన పిడుగులు

వారణాసిని ఆటపట్టించిన పిడుగులు

వారణాసి రాగానే నోట్లో టూత్ బ్రష్ పెట్టుకొని మాట్లాడుతుంటే.. అర్థం కాక వారణాసి బిక్కమొఖం వేశాడు. ఏంటమ్మా.. మీరు ఏమంటున్నారో అర్ధం కావడం లేదు అని వారణాసి అడిగాడు. దాంతో వేస్ట్ ఫెలో అంటూ శౌర్య అంటే.. నాకు అర్ధం కావడం లేదు.. నన్ను పొగడుతున్నారా అంటూ వారణాసి అంటే.. అలా అతడిని ఆటపట్టించి సంతోషంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X