Karthika Deepam క్షణక్షణానికి క్షీణించిన కూతురు ఆరోగ్యం.. సర్జరీకి మొండికేసిన డాక్టర్ కార్తీక్.. ఏం జరిగిందంటే

కార్తీకదీపం సీరియల్‌లో ఎమోషనల్ కంటెంట్‌ మరోసారి కథ, కథనాలను భావోద్వేగంతో నింపింది. కార్తీక్, దీప దంపతుల కుమార్తె శౌర్య ఆరోగ్యం ప్రమాదకరం కావడం, ఆమెకు గుండె జబ్బు తిరగదోడటంతో దీప కన్నీరుమున్నీరైంది. డాక్టర్‌గా మళ్లీ ఆపరేషన్ చేయమని అడిగింది. దాంతో తన వైద్యవృత్తికి పనికిరాననే ఆలోచనల్లో ఉన్న కార్తీక్ అందుకు నిరాకరించాడు. మీ మనసులో ఉన్న ఆలోచనలు పక్కన పెట్టి నీ కూతురును కాపాడుకో అని కార్తీక్‌కు దీప సూచించింది. తన కూతురుకు ఆపరేషన్ చేసి ది గ్రేట్ కార్డియాలజిస్టు అని కార్తీక్ అనుకొన్నాడా? భార్య మాటను గౌరవించాడా? అనే విషయాల గురించి.. తాజా ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

డాక్టర్ కార్తీక్‌కు మాత్రమే సాధ్యం అంటూ..

డాక్టర్ కార్తీక్‌కు మాత్రమే సాధ్యం అంటూ..


కార్తీక్‌తో డాక్టర్ మాట్లాడుతూ.. పాపకు ఇప్పటికే ఒక ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఆపరేషన్ అంటే కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ కార్తీక్‌కు మాత్రమే సాధ్యపడుతుంది. ది గ్రేట్ కార్డియాలజిస్ట్ కార్తీక్ వస్తే పాప ప్రాణాలు దక్కుతాయి అని అన్నారు. అయితే కార్తీక్‌ను రప్పించడం ఎలా? కార్తీక్ ఇప్పటికిప్పుడు వస్తాడా? పేషెంట్ కండిషన్ సీరియస్‌గా ఉందని అంటున్నారు అని డాక్టర్ అంజలి అంటే.. అవును గడిచే ప్రతీ క్షణం పాప ఆయుష్ఫును తగ్గించినట్టే.. అని డాక్టర్ అన్నారు. దాంతో నేను కార్తీక్‌ను ఎలాగైనా రప్పించుకొంటాను అని దీప డాక్టర్స్‌తో చెప్పింది.

ది గ్రేట్ కార్డియాలజిస్ట్ కార్తీక్ రప్పించడం సాధ్యం కాదేమో?

ది గ్రేట్ కార్డియాలజిస్ట్ కార్తీక్ రప్పించడం సాధ్యం కాదేమో?

దీప మాటలపై డాక్టర్ స్పందిస్తూ.. కార్తీక్ అపాయింట్ కావాలంటే.. ఇప్పుడు అడిగితే మరో నెల తర్వాత దొరుకుతుంది. అలాంటి ఇప్పటికిప్పుడు గ్రేట్ కార్డియాలజిస్ట్ కార్తీక్‌ను రప్పించడమే కుదరకపోవచ్చు అని అన్నారు. అయితే కార్తీక్ ఇప్పుడు న్యూస్‌లో లేరు. గతంలో ఏదో జరిగిందనే విషయం తెలిసింది. ఇప్పుడు కార్తీక్‌ను రప్పించడం సాధ్యమేనా అని డాక్టర్ అంజలి అన్నారు. దాంతో ఎలాగైనా డాక్టర్ కార్తీక్‌ను రప్పిస్తాను. గతంలో ఆయన ఇంటిలో వంటమనిషిగా చేశాను. ఆ చనువుతో ఆపరేషన్‌కు ఒప్పిస్తాను అని దీప అని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మీ కూతురును రక్షించుకోండి అంటూ చేతులెత్తి దీప దండం

మీ కూతురును రక్షించుకోండి అంటూ చేతులెత్తి దీప దండం

దీప వెనుకనే కార్తీక్ నడుచుకొంటూ వచ్చి.. నీవు ఎలా రప్పిస్తావని మాటిస్తావు. ఇదేలా సాధ్యం అంటూ కార్తీక్ అంటే.. అత్తయ్యను రక్షించుకోవడానికి మరో మార్గం లేదు అని దీప అన్నారు. ఇప్పుడు మీకే అత్తమ్మను రక్షించుకొనే అవకాశం వచ్చింది. మీ కూతురుకు మీరే ఆపరేషన్ చేసి రక్షించుకొనే ఛాన్స్ ఉంది. మీరు కాదనకండి అంటూ చేతులెత్తి మొక్కింది. చూస్తూ చూస్తూ మన కళ్లముందే ప్రాణాలు పోతే అని దీప అనబోతుండగా.. కార్తీక్ వెంటనే దీప నోరు మూశాడు. దాంతో కాదనకుండా ఆపరేషన్ చేయండి. ఓ కార్తీక్ భార్యగా కాకుండా నా కూతురును కాపాడండి. నీ కాళ్లు పట్టుకొంటాను అని కార్తీక్‌తో ప్రాధేయపడింది.

కూతురును రక్షించుకొనేందుకు కార్తీక్

కూతురును రక్షించుకొనేందుకు కార్తీక్


అయితే అక్కడి నుంచి కార్తీక్ వెళ్లిపోయాడు. అయితే చావు బతుకుల్లో ఉన్న కూతురు ఆరోగ్యం గురించి ఆందోళనపడుతుంటే.. నాన్న ఎక్కడికి వెళ్లాడమ్మా అంటూ హిమ ప్రశ్నించింది. చూస్తూ చూస్తూ కళ్లముందే కూతురు ప్రాణాలు వదిలేసుకొంటామా? అనే మాటలు చెవుల్లో ప్రతిబింబిస్తుండగా.. కార్తీక్ ఆపరేషన్‌కు సిద్దమవుతూ మాస్కులు, గ్లౌజులు పెట్టుకొని ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెట్టాడు. బయట హిమ ఆందోళన చెందుతూ.. శౌర్యకు ఏమీ కాదు కదా అంటే.. నీవు అలా కంగారు పెట్టకు.. అమ్మ అసలే టెన్షన్‌లో ఉంది అంటూ అంజి అన్నాడు. అంతలోనే ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెట్టాడు.

మై గాడ్.. కార్తీక్ వచ్చారా? అంటూ

మై గాడ్.. కార్తీక్ వచ్చారా? అంటూ

ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెట్టిన కార్తీక్.. రిపోర్టులు ఇవ్వండి అడగ్గానే.. వాటిని చేతిలో పెట్టారు. అంతలోనే డాక్టర్ అంజలి వద్దకు నర్స్ పరుగెత్తుకొచ్చి.. మీరు అర్జెంట్‌గా ఆపరేషన్ థియేటర్‌లోకి రావాలి. డాక్టర్ కార్తీక్ వచ్చాడు అనగానే.. ది గ్రేట్ కార్డియాలజిస్టు కార్తీక్ వచ్చారా? ఓ మైగాడ్ నమ్మలేకుండా ఉన్నాను అని అంజలి అన్నారు. థియేటర్‌లోకి వచ్చిన అంజలి ఓ మైగాడ్.. మీరు రావడాన్ని నమ్మలేకపోతున్నాను. థ్యాంక్స్ డాక్టర్ కార్తీక్ అంటూ అంజలి ఆనందంలో మునిగిపోయింది. అలా తన కూతురు శౌర్యకు సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ నిర్వహించి ఆమె ప్రాణాలు కాపాడారు. ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చిన కార్తీక్‌ను గుర్తుపట్టి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చేతులెత్తి దండం పెట్టింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
కార్తీక్, తన కుమారుడి గురించి మోనిత..

కార్తీక్, తన కుమారుడి గురించి మోనిత..

ఇదిలా ఉండగా, మోనిత తన కొడుకు, కార్తీక్ గురించి ఆందోళన పడింది. ఎవడ్రా నీవు నా కొడుకు ఆనందరావును ఎత్తుకెళ్లావు. పది రోజుల్లో కార్తీక్, బాబును కనిపెడుతా అంటూ ఆదిత్య ఛాలెంజ్ చేశాను. పది రోజుల్లో సాధ్యమేనా? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అని టెన్షన్ పడుతున్న సమయంలో డాక్టర్ భారతీ వచ్చింది. భారతీని చూసి అవసరమైన సమయంలో ఫ్రెండ్స్ వస్తారని అంటారు. భారతీ నీవు నాకు ఏదైనా సలహా ఇవ్వు. పది రోజల్లో కార్తీక్, నా కొడుకును కనిపెట్టి మీ ఇంట్లో అడుగుపెడుతానని ఛాలెంజ్ చేశాను. నాకు ఏదైనా ఐడియా చెప్పు అని అంటే.. లేదు నేను ఊరికి వెళ్తున్నాను. వస్తావా? డాక్టర్ అంజలి కూతురు బర్త్ డే అని చెప్పారని డాక్టర్ భారతీ అంటే.. నేను రాను.. కార్తీక్‌ను, ఆనందరావును వెతుక్కోవ్వాలి అని వెంటనే ఏదైనా భారతీతో ఊరికి వెళ్తే.. కార్తీక్, బాబు అడ్రస్ దొరకుతుందో అని తనలోతాను అనుకొన్నది. వెంటనే నేను వస్తానని అంటే.. మనసు మార్చుకోవడం మోనితకు అలవాటే కదా అంటూ మోనిత సమాధానం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X