twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసు అదుపులో ప్రియమణి.. హత్య కేసులో ఏసీపీ రోషిణి ఆఫర్.. కార్తీక్ కోసం దీప ఏం చేసిందంటే?

    |

    సూర్యాపేట రెస్టారెంట్‌లో అంజి, మోనిత మధ్య జరిగిన సంభాషణను షూట్ చేసిన దీప.. ఆ వీడియోను కార్తీక్ తల్లి, కుటుంబ సభ్యులకు చూపించింది. మోనిత చెప్పిన మాటలు చూసి అందరూ షాక్ గురయ్యాడు. దాంతో కార్తీక్ హత్య చేసి ఉంటాడనే నమ్మకం వారిలో పెరిగింది. ఈ క్రమంలో కార్తీక్ కుటుంబ సభ్యుల మధ్య, మోనిత వంట మనిషి ప్రియమణి ఏసీపీ రోషిణి, లాకప్‌లో దీప, కార్తీక్ మధ్య జరిగిన సంభాషణలు ఈ ఎపిసోడ్‌కు హైలెట్‌గా మారాయి. 1118 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    కార్తీక్ హత్య చేసే ఉంటాడు..

    కార్తీక్ హత్య చేసే ఉంటాడు..


    దీప ఇచ్చిన వీడియో చూసిన తర్వాత కార్తీక్ హత్య చేసి ఉంటాడు. మోనితను చంపేసే ఉంటాడు అని సౌందర్య అంటే.. మీరు కూడా నమ్ముతున్నారా? అని దీప ప్రశ్నించింది. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా చంపకుండా ఉంటారా? అని సౌందర్య బదులిచ్చింది. దాంతో ప్రాణం పోసే వృత్తిలో ఉన్న డాక్టర్ బాబు ప్రాణాలు తీస్తాడంటే నేను నమ్మను. నా భర్త నిరపరాధి అంటూ దీప ఆవేదన వ్యక్తం చేసింది. తల్లి సౌందర్య మాటలకు మద్దతు పలుకుతూ ఆ రోజు అన్నయ్య ఇంటికి వచ్చి నీ గదిలోకి వెళ్లాడు. అప్పుడే నీ రివాల్వర్ తీసుకొని వెళ్లి ఉంటాడు. ఆ వీడియో చూసిన తర్వాత ఆవేశంగా వచ్చి వెళ్లాడు అని ఆదిత్య అన్నాడు. దాంతో మీ అన్నయ్య కోసం రావొచ్చు.. మోనిత ఇంటికి వెళ్లవచ్చు. కానీ అలా నిర్దాక్షిణ్యంగా చంపుతారని నేను అనుకోలేను దీప చెప్పింది.

    డాక్టర్ బాబు హత్య చేశాడంటే.. నమ్మను..

    డాక్టర్ బాబు హత్య చేశాడంటే.. నమ్మను..

    మోనితను కార్తీక్ బాబు హత్య చేయలేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు.. మీరు నిజంగానే హత్య చేశానా అని అడిగితే.. మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎలానో.. నేను అలానే మళ్లీ మోసానికి గురియ్యానని డాక్టర్ బాబు చెప్పాడు. మోనిత ప్రెగ్నెన్సీకి ఆయన కారణం కాదని ఎలా నమ్మానో.. ఇప్పుడు ఈ హత్యకు ఆయన కారణం కాదని నేను నమ్ముతున్నాను అంటూ దీప ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులంతా సందిగ్దంలో పడ్డారు. అయితే వాడిలో ఆవేశమే ఈ పని చేసేలా ఉండొచ్చు. అందుకే వాడిలో ఈ వైరాగ్యం అంటూ అని సౌందర్య అభిప్రాయపడింది.

    రెండుసార్లు తుపాకి పేలిన శబ్దం

    రెండుసార్లు తుపాకి పేలిన శబ్దం

    మోనిత ఇంట్లో జరిగిన సంఘటనను భాగ్యం గుర్తు చేస్తూ.. ఆ రోజు అల్లుడు గారు అన్న మాటలు నా చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి. నిన్ను వదలను. నీలాంటిది బతక్కూడదు. నిన్ను ఈ భూమి మీద ఉండనివ్వనని.. కార్తీక్ అన్నాడు. ఆ తర్వాత రెండుసార్లు తూటాలు పేలిన శబ్దం వినిపించింది. పొద్దునే కట్లు తెంచుకొని చూస్తే హాలులో రక్తపు మరకలు కనిపించాయి. పొద్దునే ప్రియమణి పోలీసులను పిలిచారు. ఖర్మకొద్ది నేను అక్కడే ఉన్నాను. మోనిత హత్యకు నేనే సాక్ష్యం అని భాగ్యం అంటే.. ఎవరెన్నీ చెప్పినా నా భార్త హత్య చేయలేదు. నేను ఆయన చూడటానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లున్నాను అంటూ దీప చెప్పాడు.

    నా తలరాతను మీరెలా మారుస్తారు అంటూ దీప

    నా తలరాతను మీరెలా మారుస్తారు అంటూ దీప

    పోలీస్ స్టేషన్‌లో ఉన్న కార్తీక్‌ను దీప కలిసింది. దీప ఏంటీ అలా చూస్తున్నావు.. మళ్లీ కలుస్తానో లేదో అని అనుకొంటున్నావా? అని కార్తీక్ అంటే.. నిన్నిలా చూస్తానని అనుకోలేదు డాక్టర్ బాబు అంటూ దీప కంటతడి పెట్టింది. ఇట్నుంచి చూస్తే నువ్వే జైలు పాలైనట్టు కనిపిస్తున్నది. నీకు మరోసారి జైలుశిక్ష వేసినట్టు అనిపిస్తున్నది అంటూ కార్తీక్ బాధపడ్డారు. నా తలరాతను మీరేలా తిరగరాస్తారు. నేను పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు రాశాడు అని కార్తీక్ అంటే.. ప్రతీ దానిని నీ తలరాతపై వేసుకొంటావు. నీవు బాగా అర్ధం చేసుకొంటావు అని కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

    నా మీద అంత నమ్మకం ఏమిటి అంటూ కార్తీక్

    నా మీద అంత నమ్మకం ఏమిటి అంటూ కార్తీక్

    అయితే నీవు హత్య చేశావా? అని దీప ప్రశ్నించింది. అయితే చేయలేనని తప్పుకోలేను అని కార్తీక్ అంటే.. చేయని తప్పును ఓప్పుకోవడం తప్పే కదా అని దీప అంది. అయితే నీకు నా మీద అంత నమ్మకం ఏమిటి దీప అని కార్తీక్ అంటే.. మోనిత గర్భం మీరే కారణమని అందరూ నమ్మారు. కానీ నేను నమ్మలేదు. నేను ఒక మాటల అడుగుతాను నిజం చెబుతారా? పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు.. మోనిత గర్బానికి ఎలా కారణం అయ్యానో.. ఈ హత్యకు కూడా అలానే కారణమయ్యాను అని మీరు ఒక మాట అన్నారు. కానీ ఇలా మౌనంగా ఉండటం ప్రశ్నార్తకంగా మారింది హత్య చేశావంటే నమ్మడం లేదు. తాళి కట్టావు కాబట్టే నిన్ను నేను రక్షించుకొంటాను. భార్త లేకుండా భార్య, తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు అంటూ దీప ఆవేదన వ్యక్తం చేసింది.

    పోలీసుల అదుపులో ప్రియమణి

    పోలీసుల అదుపులో ప్రియమణి

    ఇలాంటి పరిస్థితుల్లో మోనిత పని మనిషి ప్రియమణిని ఏసీపీ రోషిణిని ఇంటారాగేషన్‌కు తీసుకెళ్లింది. ప్రియమణి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకొంటూ వెళ్తుంటే.. రోషిణి.. కారు ఆపింది. దాంతో ప్రియమణి షాక్ గురైంది. ప్రియమణి మాట్లాడుతూ.. నన్ను అమ్మలా చూసుకొన్నది. అమ్మ అయిపోతుందనే సంతోషంలో ఉన్నాను. కార్తీక్ బాబును పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డది. కానీ అలా హత్యకు గురైంది. ఈ విషయంలో కార్తీక్ బాబుకు ఎలాంటి శిక్ష వేస్తారో నాకు తెలియదు కానీ.. మా మోనిత శవాన్ని మాత్రం ఇప్పించండి. ఆమె అనాథ శవంలా ఎక్కడో పడి ఉండొద్దు అంటూ ప్రియమణి ప్రాధేయపడింది. దాంతో నేను నిన్ను మర్డర్ ఎలా జరిగిందో చెప్పమన్నానా? కారు ఎక్కు అంటూ తనతో ప్రియమణిని రోషిణి తీసుకెళ్లింది.

    Recommended Video

    Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
    దీపకు ఏసీపీ రోషిణి ఆఫర్

    దీపకు ఏసీపీ రోషిణి ఆఫర్

    ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్‌లో దీప, ఏసీపీ రోషిణి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మీరు నాకు ఓ సహాయం చేయాలి? అంటూ రోషిణి అంటే.. ఏమిటది అని దీప ప్రశ్నించింది. ఏమీ లేదు. మోనిత బాడీని కార్తీక్ ఎక్కడ దాచాడో అడిగి తెలుసుకోండి. దాంతో ఆయనకు శిక్ష తగ్గించేలా నేను చూసుకొంటాను అని ఏసీపీ అంటే.. దీప కోపంతో సీట్లో నుంచి లేచింది. ఏసీపీ మాటలకు ఆగ్రహంతో ఊగిపోయినట్టు కనిపించింది. తాజా ప్రోమోలో ఇలాంటి ట్విస్టుతో మరింత ఆసక్తిని పెంచారు.

    English summary
    Karthika Deepam August 14th August's Episode preview. Latest episode of 1118 goes once again with emotional content. Monita is prepating for marriage with Karthik on 25th...In this occasion, Karthik arrested in Monita murder case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X