Karthika Deepam కార్తీక్ కోసం పుస్తకం నేలకేసి కొట్టి.. భారతీకి షాకిచ్చిన మోనిత

తెలుగు బుల్లితెరపై టాప్ టీఆర్పీతో దూసుకెళ్తున్న కార్తీకదీపం సీరియల్‌ రకరకాల ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. డాక్టర్ కార్తీక్ ప్రేమ కోసం పరితపిస్తున్న భగ్న ప్రేమికురాలు మోనిత తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. పొగొట్టుకొన్న తన కొడుకు కోసం మోనిత వెతుకుతూనే.. కార్తీక్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో తన స్నేహితురాలు డాక్టర్ భారతీతో కలిసి తాడికొండ గ్రామంలో ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. అదే గ్రామంలో కార్తీక్ ఉన్నారనే విషయం తెలుసుకొని ఎమోషనల్ అయింది. తాజా ఎపిసోడ్ 1272లో మోనిత ఆరాటం ఎలా ఉందంటే..

ఇక తాడికొండలో కార్తీక్‌ను కలుసుకోలేకపోవడంపై డాక్టర్ భారతీతో డాక్టర్ మోనిత బాధపడింది. ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చాం. ఈ హోటల్‌లో ఉంటున్నాం అని మోనిత మాట్లాడుతుంటే.. భారతీ చదువుతున్న పుస్తకాన్ని లాగేసుకొని నేలకేసి కొట్టింది. నేను బాధపడుతుంటే.. బుక్ చదువుకోవడమేమిటి? అని మోనిత అంటే.. నీ కష్టాలు కోరి తెచ్చుకొన్నవి అని భారతీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. నాకు ఉన్న ఏకైక ఆప్తురాలివి అని మోనిత అంటే.. నేను ఏమీ చేయలేను. నీవు బాధపడుతుంటే నేను ఓదార్చాలా అంటూ భారతీ జవాబిచ్చింది.

దాంతో నీ ఓదార్పులు.. పరామర్శలు నాకు అవసరం లేదు. ఇక ముందు సాయం చేయలేనంటావా? నా కార్తీక్ ఎలాగైనా దక్కుతాడు? ఈ గొడవలో పడి నా కొడుకును వెతకడం మరిచిపోయాను అని మోనిత అంటే.. నీవు పోలీసుల సాయం తీసుకోవాల్సింది అని భారతీ సలహా ఇచ్చింది. అయితే నాకు కొన్ని పరిమితులు, పరిధులు ఉన్నాయి అని మోనిత కన్నీళ్లు పెట్టుకొన్నది.

Karthika Deepam serial todays episode highlights: Monita emotional about Karthik

ఇక ఆదిత్యతో ఛాలెంజ్ చేసిన విషయాన్ని మోనిత గుర్తు చేసుకొన్నది. పదే పది రోజుల్లో కార్తీక్‌ను పట్టి తీసుకొచ్చి నీ ఇంటిలోకి అడుగుపెడుతాను అంటూ చెప్పిన విషయాలను మోనిత గుర్తు చేసుకొని.. ఛాలెంజ్ అయితే చేశాను. కానీ అది నెరవేర్చుకోలేనేమో అంటూ మోనిత మనసులో అనుకొన్నది. భారతీతో మాట్లాడుతూ.. నా వాళ్ల నీవు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత ఎవరినైనా పంపించి వెతికిస్తాను అని మోనిత అంటే.. లేదు.. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అని భారతీ సమాధానం ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడకపోవడమే నీ గొప్పతనం అని మోనిత అంటూ.. హైదరాబాద్‌కు వెళ్దాం అంటూ చెప్పింది.

ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్‌లో గత మూడేళ్లకుపైగా ప్రతీవారం కంటెంట్‌పరంగా, రేటింగ్‌పరంగా దూసుకెళ్తున్నది. ప్రతీ వారం టాప్ రేటింగ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నది. ప్రతీ వారం 13 పాయింట్లకుపైగానే రేటింగ్ సాధిస్తున్నది. రానున్న రోజుల్లో మరిన్ని ట్విస్టులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ సీరియల్ టాప్ రేటింగ్‌తోనే కొనసాగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X