Karthika Deepam అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? మోనితపై భారతీ సెటైర్స్

కార్తీకదీపం సీరియల్‌లో మోనితకు సంబంధించిన ఓ ట్విస్టు ఆసక్తికరంగా సాగింది. కార్తీక్‌, తన కొడుకును వెతుకుతున్న ఆమెకు కార్తీక్ దొరికినట్టే దొరికి చేజారిపోయాడు. తాడిపత్రిలోని డాక్టర్ అంజలి ఇంటిలో బర్త్ డే ఫంక్షన్‌కు వచ్చిన మోనితకు కార్తీక్ కనిపించడంతో సంబరపడిపోయింది. కానీ తృటిలో తప్పించుకోవడంతో కంగారుపడిపోయింది. అయితే బర్త్ డే ఫంక్షన్ తర్వాత హైదరాబాద్‌కు భారతీతో కలిసి వెళుతూ..

డాక్టర్ అంజలి ఇంటిలో జరిగిన బర్త్ డే వేడుక నుంచి డాక్టర్ భారతీ, మోనిత బయటకు వచ్చారు. కారును ఓ చోట ఆపి వెంటనే బయటకు దిగింది. కారు ఆపడం ఎందుకు మనం వెళ్లిపోదాం అని భారతీ అంటే.. ఊరి పొలిమేరలో గ్రామదేవతలు ఉండి.. గ్రామాన్ని కాపల కాస్తుంటారని చెబుతారు అని మోనిత అంటే.. అవును అని భారతీ అంది. ఈ ఊరిలో కార్తీక్ ఉన్నారని, నా కార్తీక్‌ను గ్రామ దేవతలు అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలిగా అని మోనిత అంటే.. ఏంటి మోనిత ఇది అని భారతీ చిరాకు పడింది.

భారతీ మాటలకు మోనిత స్పందిస్తూ.. నీకు కార్తీక్‌ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు అని మోనిత అంటే.. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు.. నీ వ్యవహారం నాకు తెలియదా. కావాలంటే ఈ ఊరు ఫోటోను తీసి.. రోజు చూసుకో అంటూ డాక్టర్ భారతీ అసహనం వ్యక్తం చేసింది. అయితే నేను తాడికొండలో ఇంతకు ముందే ఒకసారి వచ్చాను. నీకు తెలుసా? మా అత్తమామలను వెంటాడుతూ ప్రకృతి వైద్యశాలకు వచ్చాను అని మోనిత అంటే.. వాళ్లను ఇక్కడికి పంపిందే నేను అని భారతి సమాధానం చెప్పింది. దాంతో ఏది ఏమైనా నా కథ తాడికొండలో సుఖాంతం అవుతుందని రాసిపెట్టి ఉందనుకొంటాను అని మోనిత అంటే.. అవునా భారతీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దాంతో పరుగు పందెంలో గెలువాలని ఆడాలి.. కానీ ఓడాలని కాదు అంటూ గ్రామానికి చేతులెత్తి మోనిత, భారతీ అక్కడి నుంచి బయలు దేరారు.

Karthika Deepam serial todays episode highlights: Monita worried about Karthik and her son Anandarao

తాడికొండ నుంచి బయలు దేరిన మోనిత.. మరోసారి కారును మధ్యలో ఆపింది. ఏంటి మోనిత.. తాడికొండ ఊరి బోర్డును మరోసారి చూసి వస్తావా? అంటూ భారతీ సెటైర్ వేసింది. దాంతో నా బతుకు నీకు కామెడీ అయిందా? అని మోనిత అంటే.. కాదు మోనిత. కార్తీక్ ఈ ఊర్లో లేరని తెలిసింది కాద అని భారతీ సమాధానం చెప్పింది. కార్తీక్ ఈ ఊరికి వచ్చి ఆపరేషన్ చేశాడు. దొరికినట్టే దొరికి చేజారుతున్నారు. ఇక్కడే ఉన్నారని సంతోషపడ్డాను.

కానీ నా ప్రేమ ఇలా సంతోష పెడుతున్నారు. కార్తీక్ నాకు అంత సులభంగా దొరికితే.. నా ప్రేమకు విలువ ఏముంటుందని మోనిత అంటే.. ప్రశ్న, జవాబు నీవే చెప్పుకొంటున్నావు.. అదే నీ గొప్పతనం అంటూ భారతీ దెప్పిపొడిచింది. దాంతో నా కార్తీక్, నా బాబు దూరమయ్యారు. నా జీవితం ఇలా మారిపోయిందంటూ మోనిత వేదాంతం పలికింది. నన్ను నేను ఓదార్చుకొంటూ.. నన్ను సరిపుచ్చుకొంటూ బతకుతున్నాను. సౌందర్య, ఆనందరావు కూడా ప్రకృతి వైద్యశాలను విడిచి వెళ్లారు. అందరూ దొరికినట్టే దొరికి తప్పించుకొంటున్నారు. చూద్దాం.. ఎంత వరకు వెళ్తారో అంటూ మోనిత, భారతీ తమ కారును ముందుకు కదిలించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X