Karthika Deepam అడ్డంగా బుక్కైన కార్తీక్, దీప.. మోనిత కంటికి దొరికి.. అలాంటి ట్విస్టు!
నెల రోజుల్లో కార్తీక్, ఆనందరావును తీసుకొచ్చి మీ ఇంట్లో అడుగుపెడుతా అని మోనిత చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని ఆదిత్య, శ్రావ్య ఆలోచించారు. మోనిత మాటల వెనుక ఏదైనా ప్లాన్ ఉందా? అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది? ఒకవేళ బావ, అక్కల ఆచూకి కనిపెట్టి ఇంటికి తీసుకొస్తే అంతకంటే మంచి ఏముంటుందని శ్రావ్య అంటే.. అవును అన్నయ్య, వదినలను కనిపెట్టగలిగితే.. మోనిత తన జీవితంలో చేసిన మంచి పని అవుతుంది అని ఆదిత్య అన్నాడు. ఇంకా తాజా ఈ సీరియల్ ఎపిసోడ్‌లో ఏలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయంటే..

డాక్టర్ అంజలి ఇంట్లో ఫంక్షన్‌కు
శౌర్యకు సర్జరీ చేసిన హాస్పిటల్ ఓనర్ డాక్టర్ అంజలి కూతురు బర్త్ డే కోసం డాక్టర్ భారతీ, మోనిత బయలుదేరారు. ఈ ఫంక్షన్‌కు వెళ్లొస్తే రిలాక్స్‌గా ఉంటుందని చెప్పడం బాగుంది. కానీ అక్కడ కార్తీక్ ఏమైనా దొరుకుతాడో ఏమో అనే అనుమానం కలుగుతున్నది. అదే ఆశతోనే నేను అక్కడికి వస్తున్నాను. కానీ అక్కడకు వెళ్తే ఎక్కడ ఉంటాం.
అక్కడ ఉండటానికి హోటల్స్ ఏమైనా ఉన్నాయా? అని మోనిత అడిగితే.. అంజలికి భారతీ ఫోన్ కలిపింది. అయితే తన ఇల్లు చాలా పెద్దది. మా ఇంటిలోనే ఉండొచ్చు అంటూ అంజలి చెప్పడంతో ఇద్దరు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే మనం వెళ్తున్నాం. కార్తీక్ నాకు కనిపిస్తాడా? అతడు కనిపిస్తాడనే పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతున్నది అంటూ మోనిత చెప్పడంతో కాస్త మాటలు ఆపి మ్యూజిక్ విందామా? అని భారతీ అంటే.. నన్ను నోర్ముసుకో అని చెబుతున్నావా అంటూ అడిగింది.

గొప్ప గొప్ప వాళ్లకు కష్టాలు తప్పలేదు
ఇక కార్తీక్, దీప ఇద్దరు హోటల్ పనిచేయడానికి నడచుకొంటూ వెళ్తుంటే.. తనను వంటలక్క తదేకంగా చూస్తుండటంతో ఎందుకు అలా చూస్తున్నావు అని కార్తీక్ అడిగాడు. మీరు నా ఎప్పుడు నా దృష్టిలో డాక్టర్ బాబే.. మనం వంట చేయడానికి వెళ్తున్నప్పటికీ. ఏదో సర్జరీ చేయడానికి వెళ్తున్నట్టు అనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఊహించలేదు అని దీప అంటే.. గొప్ప గొప్ప వాళ్లకే కష్టాలు వచ్చాయి. మనం కష్టాలకు అతీతం కాదా అని కార్తీక్ ప్రశ్నించాడు.
మన శౌర్యకు సర్జరీ చేయడానికి సహాయం చేసిన అంజలి ఇంట్లో ఫంక్షన్‌కు వంట చేయడానికి వెళ్లడం హ్యాపీగా ఉందంటే.. నేను వంట చేసి వచ్చే దానిని కదా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అంటూ దీప అడిగితే.. అంజలి మనకు హెల్ప్ చేసింది. అందుకే ఒప్పుకొన్నాను అని కార్తీక్ సమాధానం చెప్పాడు. అయితే వంట చేసి వచ్చే సరికి ఏ సమయంలో అవుతుందో.. పిల్లలు ఏమౌపోతారో అంటూ దిగులు పడితే.. అప్పు ఇంటిలో పెట్టాం కదా.. రుద్రాణికి తెలియదు అంటూ దీపతో కార్తీక్ అన్నాడు.

అంజలి ఇంట్లో మోనిత అలంకరణ పనులు
అంజలి ఇంట్లో ఫంక్షన్ కోసం మోనిత ఉత్సాహం దండలు కడుతూ కనిపించింది. అయితే పూల దండలు కడుతుంటే.. మోనిత మెడలో తాళి కనిపించింది. దాంతో మీకు పెళ్లి అయిందా అంటూ మోనితను అంజలి ప్రశ్నించింది. అవును అంటూ సమాధానం ఇచ్చింది. అయితే ఏం చేస్తారు మీ వారు అంటూ మళ్లీ అంజలి అడిగింది. దాంతో మా ఆయన డాక్టర్ అని సమాధానం చెప్పడంతో మీ ఆయనకు కార్డియాలజిస్ట్ కార్తీక్ తెలుసా? అని అంజలి ప్రశ్నించింది. అంతలోనే కార్తీక్, దీప కాలింగ్ బెల్ కొట్టడంతో అంజలి డోర్ తీసి వారితో మాట్లాడింది. వారిని వంట చేయమని ఇంటి వెనుకకు పంపించింది. మళ్లీ వచ్చి కార్తీక్ గురించి మోనితను అడగడం మొదలుపెట్టింది.

నా భార్తే డాక్టర్ కార్తీక్ అంటూ మోనిత
మోనితతో అంజలి మాట్లాడుతూ.. మీ భర్తకు డాక్టర్ కార్తీక్ తెలుసా అంటే.. మా ఆయనే డాక్టర్ కార్తీక్ అని చెప్పడంతో అంజలి షాక్ తిన్నది. మీ ఆయన కార్తీకా? మీకు తెలుసా ఆయన మా హాస్పిటల్‌కు వచ్చి సర్జరీ చేశాడు అని చెప్పగానే మోనిత ఆశ్చర్యంలో మునిగిపోయింది. మీ హాస్పిటల్‌కు వచ్చి కార్తీక్ సర్జరీ చేశాడా? ఎవరికి చేశాడు అంటే.. ఒక పేద అమ్మాయికి సర్జరీ చేశాడని చెప్పడంతో అవునా.. కార్తీక్ ఇక్కడే ఉన్నాడా? నేను ఇక్కడికి రావడం మంచిదే అయింది అంటూ మోనిత తన మనసులో అనుకొన్నది.
వెంటనే భారతీని పక్కను తీసుకు వచ్చి కార్తీక్ ఇక్కడే ఉన్నాడు. నేను రావడం మంచిదే అయింది. నీవు ఇక్కడే ఉండు.. నేను కార్తీక్ కోసం ఈ ఊర్లో వెతుకుతాను అంటే.. ఏమిటి? పార్టీకి వచ్చి బయటకు వెళ్లడం సరికాదు అంటూ భారతీ ఆపే ప్రయత్నం చేసింది.

కార్తీక్ ఇదే ఊళ్లో ఉంటే..
అయితే కార్తీక్ వెళ్లి చాలా రోజులైంది. నా కార్తీక్ ఇదే ఊర్లో ఉంటే నేను వెతుకకుండా ఎలా ఉంటాను? కార్తీక్‌ను వెతకకుండా పార్టీలో తిండి తినుకుంటా ఉండాలా? అని మోనిత అంటే.. అంది కాదు.. అంజలి భర్త వస్తాడు.. ఇక ఆయనతో కార్తీక్ గురించి మాట్లాడకు. పార్టీ అయిపోయిన తర్వాత కార్తీక్ గురించి వెతుకుదాం అంటూ నచ్చ చెప్పబోయింది.
అందుకు మోనిత అభ్యంతరం చెప్పడంతో నేను వద్దని అన్నందుకు నీకు కోపం వచ్చిందా అంటూ ప్రశ్నించింది దాంతో కోపం కాదు.. బాధ.. అరే కార్తీక్ ఇక్కడే ఉన్నాడని తెలిసి ఇక్కడే ఎలా ఉంటాను అని చెప్పింది. వంటలు వండుతున్నారు.. నీవు వెళ్లి వారిపై అజమాయిషీ చేయి అని మోనితకు చెబితే.. ఏంటి కార్తీక్ నాకు ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తే.. నేను వెళ్లి వంటలు చేయాలా? అని మోనిత కోపంగా అడిగింది. అంతలోనే అంజలి వచ్చి.. వంటలు జరుగుతున్నాయి.. మీరు వెళ్లి ఉప్పు కారం చూసుకొంటావా? అంటే.. నీవు టెన్షన్ పడకు.. నేను అతిథులను రిసీవ్ చేసుకొంటాను. మోనిత వంటల గురించి చూసుకొంటుందని డాక్టర్ భారతి చెప్పింది.
Recommended Video

కార్తీక్‌ను కనిపెట్టిన మోనిత
ఇక కార్తీక్, దీప ఇద్దరు వంట పనుల్లో మునిగిపోయారు. దీప వంట చేస్తుండగా.. కార్తీక్ వచ్చి వాసన గుమగుమలాడుతున్నది. నాకు కూడా వంటలు నేర్పించవచ్చు కదా.. నేను నీకు ఫీజు కూడా ఇస్తాను అంటూ కార్తీక్ అంటే.. నీవు చేయాల్సింది వంటలు కాదు.. వైద్యం అంటూ దీప చెప్పింది. కార్తీక్, దీప వంట చేస్తుండగా మోనిత ఆ ప్రదేశానికి రావడం.. వంట చేస్తున్న కార్తీక్‌ను చూసి షాక్ తిన్నట్టు తాజా ప్రోమోలో కనిపించింది. దీంతో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్‌కు సీరియల్ సిద్ధమైంది. తాజా ట్విస్టుతో మరింత రసకందాయకంగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











