Karthika Deepam.. హంతకుడి వేటకు దీప.. ఒకే కారులో మోనితతో కలిసి షాకింగ్‌గా

కార్తీకదీపం సీరియల్ ఆగస్టు 3వ తేదీ ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో పలు రకాల ట్విస్టులు కనిపించాయి. కారు డ్రైవర్ ఆచూకీ కోసం వెతుకుతున్న రోషిణి, దీప, మోనితకు సమాచారం అందడంతో సూర్యాపేట్‌కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే అంజిని కలిసి కార్తీక్ ఆపాలని దీప ప్లాన్ చేయగా, అంజిని బెదిరించి కార్తీక్‌ను పెళ్లాడాలని మోనిత ఉన్మాదంతో బయలు దేరింది.

అయితే సూర్యాపేటకు వెళ్లే క్రమంలో దీప, మోనిత దారి మధ్యలో కలుసుకోవడం, వారిద్దరూ అంజి కోసం ఒకే కారులో ప్రయాణించడం మరో ట్విస్టుగా మారింది. ఇంతకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొంటున్న దీప, మోనిత ఒకే కారులో ఎందుకు ప్రయాణించారంటే..

సూర్యాపేటలో అంజి అంటూ సమాచారం

సూర్యాపేటలో అంజి అంటూ సమాచారం

సూర్యాపేటలోని 8 రెస్టారెంట్‌లో అంజి ఉన్నాడనే సమాచారం అందుకొన్న మోనిత పిస్టల్ పట్టుకొని కారులో బయలు దేరింది. అంజి చేతికి చిక్కాడు, ఇక కార్తీక్‌తో పెళ్లి జరగడం ఖాయం అని ఆనందంతో బయలుదేరిన మోనితకు ఆ సంతోషం ఎంతో సేపు ఉండలేదు. దారి మధ్యలోనే కారు పాడైపోవడంతో టెన్షన్‌కు గురైంది. తెల్లవారేలోపే అంజిని కలువాలనుకొంటే కారు పాడైపోవడం ఏమిటని ఆందోళనకు లోనైంది.

దీప కారులో లిఫ్టు తీసుకొని

దీప కారులో లిఫ్టు తీసుకొని

ఎలాగైనా సూర్యాపేటకు చేరుకోవాలని మనసులో పట్టుబట్టిన మోనిత ఏదైనా కారును లిఫ్ట్ అడిగి వెళ్లాలని ప్లాన్ చేసింది. కొంతమంది కారు డ్రైవర్లను లిఫ్ట్ అడిగితే ఇవ్వకుండా పోవడంతో మరింత టెన్షన్‌కు గురైంది. అయితే అదే దారిలో వస్తున్న దీప కారు ఎదురైంది. కానీ ఆ కారులో దీప ఉన్న సంగతి మోనితకు తెలియదు. అయితే మోనితను చూసిన డ్రైవర్.. దీపను అలర్ట్ చేశారు. డాక్టర్ మోనిత లిఫ్ట్ అడుగుతున్నదని చెప్పడంతో దీప కంగుతిన్నది. అయితే మోనిత కూడా ఏదో ప్లాన్ వేసి ఉంటుంది. ఆమెను కారులోకి ఎక్కించుకో. కానీ విజయవాడకు వెళ్తున్నట్టు చెప్పు అని డ్రైవర్‌కు దీప సూచించింది.

మోనిత కుట్రలను మరోసారి

మోనిత కుట్రలను మరోసారి

ఇక దీప ప్రయాణిస్తున్న కారును లిఫ్ట్ అడిగితే డ్రైవర్ ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే విజయవాడకు వెళ్తున్నాను అని కారు డ్రైవర్ చెప్పాడు. అయితే నా కారు చెడిపోయింది? నన్ను సూర్యాపేటలో వదిలేస్తావా? అంటూ మోనిత అడిగింది. అయితే సరే అనడంతో మోనిత కారులో కూర్చొన్నది. కారులో దుప్పటి కప్పుకొని మోనితను పరిశీలిస్తూ దీపను చూస్తూ ఇది కూడా అంజి వద్దకే వెళ్తున్నది. ఇప్పటి వరకు అంజి ఎవరో తెలియదని బుకాయించింది. ఈ విషయం రోషిణి, కార్తీక్‌కు చెబితే ఖచ్చితంగా నమ్ముతారు అని మోనిత మనసులో అనుకొన్నది.

మోనిత పెద్ద ప్లాన్ అంటూ

మోనిత పెద్ద ప్లాన్ అంటూ

కారులో ప్రయాణిస్తూ.. వెనకు సీట్లో ఎవరు అని మోనిత అడిగితే.. మా అక్కయ్య అని కారుు డ్రైవర్ సమాధానం చెప్పాడు. దాంతో ఒంట్లో బాగాలేదా అంటూ సమాధానం చెప్పింది. అదేం లేదు. నిద్ర వస్తుందని పడుకొన్నది అంటూ కారు డ్రైవర్ సమాధానం చెప్పాడు. దాంతో తొందరగానే లిఫ్ట్ దొరికింది. అనుకొన్న సమయానికే సూర్యాపేటకు చేరుకొంటాను అని మనసులో అనుకొన్నది. వెంటనే ఫోన్ తీసి.. వీరేశం.. 40 నిమిషాల్లో 8 రెస్టారెంట్‌కు చేరుకొంటాను అని మోనిత అనగానే.. ఇదేదో పెద్ద ప్లాన్‌తో వస్తుందని ముసుగులో నుంచి దీప మనసులో అనుకొన్నది.

వదిన పిరికిది కాదు అంటూ ఆదిత్య

వదిన పిరికిది కాదు అంటూ ఆదిత్య

ఇక దీప ఫోన్ వదిలేసి ఒంటరిగా వెళ్లడంతో కార్తీక్ టెన్షన్‌లో పడిపోయాడు. దాంతో ఆదిత్య కంగారు పడకు.. వదిన ధైర్యవంతురాలు అని అంటే.. దీప గురించి కాదు.. మోనిత గురించి భయపడుతున్నాను. మోనితకు ఎలాంటి బంధాలు, అనుబంధాలు లేవు. దీపను ఏదైనా చేస్తుందనే భయం ఉంది అంటూ కార్తీక్ అన్నాడు. వదిన పిరికికాదు. అసలే భయపడదు అని ఆదిత్య అంటే. మోనిత గురించి చాలా ఆలస్యంగా తెలుసుకొన్నాను. దీపను ఏదైనా చేయడానికి వెనుకాడదు అని కార్తీక్ అన్నాడు.

ఆదిత్య దెప్పి పొడుస్తున్నావా? అంటూ

ఆదిత్య దెప్పి పొడుస్తున్నావా? అంటూ

నీవు మోనితను చాలా ఆలస్యంగా అర్ధం చేసుకొన్నావు. వదినను అర్ధం చేసుకోవడానికి పదేళ్లు పడితే.. మోనితను అర్ధం చేసుకోవడానికి 16 ఏళ్లు పట్టింది అని ఆదిత్య అన్నాడు. దాంతో టైమ్ దొరికిందని దెప్పి పొడుస్తున్నావా అని కార్తీక్ సీరియస్ అయ్యాడు. దాంతో ఆదిత్య అది కాదు అన్నయ్య అంటూ సర్ది చెప్పాడు. దాంతో దీప ఏమైపోయిందనే ఆలోచనల్లో కార్తీక్ పడ్డాడు. ఇక మోనిత వేసుకొన్న ఎత్తులను చిత్తు చేయాలని దీప మనసులో ప్లాన్ వేసుకోవడంతో ముందు ఏం జరుగుతుందనే ట్విస్ట్‌తో ఎపిసోడ్ ముగిసింది.

Recommended Video

Ikshu Movie Official Promo
కార్తీకదీపంలో

కార్తీకదీపంలో

నటీనటులు: దీపగా ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల లీడ్ రోల్స్‌లో నటించారు. మౌనితగా శోభా శెట్టి, హిమగా బేబీ సహ్రు, శౌర్యగా బేబీ కార్తీక, సౌందర్యగా అర్చనా అనంత్, ప్రియమణిగా శ్రీదేవి తదితరులు నటించారు.
నిర్మాత: గుత్తా వెంకటేశ్వరరావు
దర్శకత్వం: కాపుగంటి రాజేంద్ర
ఎడిటర్‌: ఫణి భట్
బ్యానర్: గగన్ టెలివిజన్ షో బ్యానర్‌
స్ట్రీమింగ్: స్టార్ మా

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X