Karthika Deepam వీధికుక్క ఇంట్లోకి.. పిచ్చిదానా నీ బాడీ సగం బయటకు.. దీప కౌంటర్‌కు మోనిత ఫ్యూజులు అవుట్

కార్తీకదీపం సీరియల్‌లో దీప, మోనిత మరోసారి ఎదురెదురు పడ్డారు. వారి మధ్య మాటలు తూటాల్లా పేలాయి. తన భర్తను కట్టుకోవడం నీ తరం కాదనే రేంజ్‌లో దీప విశ్వరూపం చూపించింది. దీప మాటలతో కంగుతున్న మోనిత ఏం మాట్లాడాలో తెలియక కంగారు పడింది. ఇంకా 1089 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

దీప ఇంటికి డాక్టర్ మోనిత

దీప ఇంటికి డాక్టర్ మోనిత

వంట గిన్నెలు శుభ్రం చేస్తున్న సమయంలో డాక్టర్ మోనిత దీప ఇంట్లోకి ప్రవేశించింది. ప్లేట్‌లో మోనిత కనిపించడంతో దీప ఘాటుగా స్పందించింది. అప్పటికీ పిల్లలకు చెబుతూనే ఉన్నాను. తలుపులు తెరిచి ఉంచితే వీధికుక్కలు ఇంట్లోకి వస్తాయని చెప్పాను అంటూ మోనితను చూసి కామెంట్ చేసింది. దాంతో మోనితకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అటువైపు తిరిగి ఉన్నా ఎలా కనిపించానని ఆశ్చర్యపోతున్నావా? నాకు ఒళ్లంత కళ్లే అంటూ మోనితకు మరో షాక్ ఇచ్చింది. అందుకే నీవు వేసే ప్రతీ అడుగును గమనిస్తూ ఉంటాను అని వ్యాఖ్యానించింది.

నా గీతను కార్తీక్ దాటడు

నా గీతను కార్తీక్ దాటడు

మోనిత మాటలకు చిరునవ్వు ఇస్తూ.. నేను గీసిన గీతలు చెరిపేసినట్టు ఉన్నావు అంటూ గోడవైపు చూస్తూ అంది. నేవు గీతలు చెరిపేసినా.. నేను గీసిన గీత కార్తీక్ దాటడు. మన కార్తీక్ అంటూ దీపతో మాట్లాడుతూ.. వంట గిన్నెలు శుభ్రం చేస్తుంటే.. నేను సహాయం చేయనా?.... ఏది ఏమైనా మనం మనం. అన్నీ పంచుకోవాల్సిన వాళ్లమే కదా అంటూ మోనిత అంటే.. నీ బాడీ సగం బయటకు వెళ్లాలి అంటే అలానే వాగుతుండు అని దీప గట్టిగా బదులిచ్చింది.

నీ మొగుడు నాకే సొంతం

నీ మొగుడు నాకే సొంతం

దాంతో మోనిత స్పందిస్తూ.. ఏంటీ దీప అలా స్పందిస్తున్నావు. నా మొగుడు నాకే సొంతం అనేది పాత మాట. ఇప్పుడు నీ మొగుడు నాకే సొంతం అనేది కొత్త మాట. నేను ట్రెండ్ మార్చాను అని అనగానే.. దీప ఏకంగా చేయి లేపింది. దాంతో భయపడిన మోనిత దూరంగా జరిగింది. మోనితను ఉద్దేశించి దీప మాట్లాడుతూ.. నీ మాటల్లో తెగింపు కనిపించినా.. నీ కళ్లలో భయం స్పష్గంగా కనిపిస్తుంది. దాంతో భయమా? నాకా అంటూ మోనిత అదే ఊపుతో మరింత గట్టిగా జవాబిచ్చింది.

చేయి దెబ్బ తిన్నా.. ఇంకా..

చేయి దెబ్బ తిన్నా.. ఇంకా..

దీపతో మాట్లాడుతూ.. ఈ మోనితను చూస్తే జనాలు గజగజ వణికిపోవాలి అంటూ కుర్చీపై కూర్చోపోయింది. దాంతో దీప ఒక్క ఊదుటన కాలితో కుర్చీని తన్నింది. దాంతో మోనిత మరింత కంగారు పడింది. ఇక దీప తన విశ్వరూపాన్ని చూపిస్తూ.. మా ఇంట్లో కూర్చోవడానికి కూడా అర్హత లేనిదానివి. నీవు మా ఇంటికి కోడలిగా వస్తానంటే చూస్తూ ఎలా ఊరుకొంటానని అనుకొన్నావు. గరిట తిప్పే చేయి.. గాజులు వేసుకొన్న చేయి చిన్నచూపు చూడదు. ఈ చేయి దెబ్బ రుచి చూసిన గానీ.. ఎప్పటికప్పుడు మరిచిపోతున్నావు. పట్టపగలు నక్షత్రాలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లు అంటూ మోనితకు దీప వార్నింగ్ ఇచ్చింది.

నీకు హార్ట్ ఎటాక్ వస్తే..

నీకు హార్ట్ ఎటాక్ వస్తే..

దీప మాటలకు మోనిత జవాబిస్తూ. నాకు నక్షత్రాలైనా కనిపిస్తాయి. నేను కార్తీక్ పెళ్లి చేసుకొంటే నీ బతుకంతా చీకటి కనిపిస్తుంది అని అంది. దాంతో అదా నీ ధైర్యం.. వెళ్లు.. వెళ్లు.. వెళ్లి మంగళసూత్రాలు, మట్టెలు కొనుక్కో. దండలు అప్పుడే ఆర్డర్ ఇవ్వకు.. వాడిపోతాయి.

జిలకర్ర, బెల్లం వద్దు.. రిజిస్టర్ మ్యారేజ్ కదా.. అదే మా ఆయన పక్కనే ఉంటాడని ఆశపడుతున్నావు కదా.. నీవు అనుకొన్నది జరగకపోతే హార్ట్ ఎటాక్ వస్తే.. ఫ్రీగా ట్రీట్‌మెంట్ ఇస్తాడు. నీకు పెళ్లే జరుగుతుందని అనుకొంటే.. పిచ్చిదానా.. నేను వంట గిన్నెలు ఎందుకు శుభ్రం చేసుకొంటాను అని దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది. నీ అంతు చేసేందుకు బయలుదేరే దానిని కదా అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
నీవో చిత్తు కాగితం అంటూ

నీవో చిత్తు కాగితం అంటూ

దీప కాన్ఫిడెన్స్ చూసి.. ఏం చూసుకొని నీకు ఇంత ధైర్యం అని మోనిత అంటే.. నా మెడలో తాళి ఉండగా.. నీ మెడలో తాళి పడదు. నీవు తప్పుల మీద తప్పులు చేసే అసమర్ధురాలివి అంటూ దీప గట్టిగా కామెంట్ చేసింది. నా మొగుడు నా భర్త. నా పెనిమిటి గౌరవనీయమైన కుటుంబంలో పుట్టిన వాడు. నీలాగా గాలికి పుట్టి, చిత్తు కాగితంలా పెరిగిన దానికి నా భర్త, కుటుంబం తలవంచాల్సిన అవసరం లేదు అంటూ దీప క్లాస్ పీకింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X