Karthika Deepam ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటున్నా.. కార్తీక్‌తో పెళ్లికి ముందు బాంబు పేల్చిన మోనిత
కార్తీక్‌తో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్ మోనితను అడ్డుకోవడానికి దీప, ఆమె పిన్ని అర్దపావు భాగ్యం రకరకాల ప్లాన్స్ వేసుకొంటున్నారు. మోనితను చంపైనా జైలుకు వెళ్తాను. కానీ మోనితతో కార్తీక్ పెళ్లి జరుగనివ్వను అంటూ భాగ్యం శపథం చేసింది. దాంతో మోనితను కిడ్పాప్ చేయాలని ప్లాన్ వేసింది. దాంతో మనసులో ఓ ప్లాన్ వేసుకొని ఆటోలో మోనిత ఇంటికి చేరుకొన్నది. కార్తీకదీపం ఎపిసోడ్ 1110లో ఏం జరిగిందంటే..

25వ తేదీ కావడంతో పెళ్లికి ముస్తాబు
అర్ధరాత్రి సూర్యాపేటలో అంజిని కిడ్నాప్ చేసిన మోనిత అలసిపోయి ఇంటికి వచ్చింది. 25వ తేదీ కావడంతో స్నానం చేసి కార్తీక్‌తో పెళ్లికి సిద్దం అవుతున్నది. అంతలోనే అర్ధపావు భాగ్యం మోనిత ఇంట్లోకి ప్రవేశించింది. ఒసే దీప.. వస్తున్నానే.. నీ పీడ విరుగడ అవుతుంది. దీప కాపురంలో ఇక చికాకులు ఉండవు. ఇక చూస్కో.. ఈ మాస్ మహారాణి అర్ధపావు భాగ్యం తడాఖా చూసుకో అంటూ మోనిత ఇంట్లోకి ప్రవేశించింది. దాంతో మోనిత ఆమెను చూసి షాక్ గురైంది.

మోనితతో భాగ్యం హై డ్రామా
భాగ్యంను చూసి ఈవిడ వస్తున్నది అని మోనిత అనుకొన్నది. ఇంట్లోనే ఉన్నావా అంటూ పలకరించిన భాగ్యంను చూసి.. ఈ సారి కూడా మాయమాటలతో నన్ను బురిడి కొట్టించాలని అనుకొంటున్నారా? అంటూ ప్రశ్నించడంతో నా మీద అనుమానం రాకుండా చూసుకోవాలని భాగ్యం మోనితను మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేసింది. ఎంతైనా సాటి ఆడదానివి.. నా కూతురి లాంటిదానివి.. లే లే అంటూ చేయిపట్టుకొని లేపబోయింది. దాంతో నీవు చెబితే మిమ్మల్ని నమ్మి ఎలా వస్తానని అనుకొన్నావు అంటూ మోనిత బదులిచ్చింది.

కార్తీక్ కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు
అయితే నీవు నావెంట రాకపోతే చచ్చిపోతావు. కార్తీక్ నీపై బాగా కోపంతో ఉన్నాడు. పీకల్లోతు కోపం ఉంది. నిన్న రాత్రి నుంచి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు అని భాగ్యం అంటే.. కార్తీక్‌కు ఎందుకు కోపం వచ్చింది. అంజి ఏమైనా కలిశాడా? ప్రస్తుతం అంజి నా ఆధీనంలోనే ఉన్నాడు కదా అంటూ మోనిత ఆలోచనల్లో పడింది. దాంతో చస్తావని చెబితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు. అక్కడికైతే కార్తీక్ రాడు అంటూ భాగ్యం తొందరపెట్టింది. నిన్ను నా ఇంటికి తీసుకెళ్లి గదిలో పెడుతా.. 26వ తారీఖు నిన్ను వదులుతా అంటూ భాగ్యం తన మనసులో అనుకొన్నది. దాంతో మోనిత పెళ్లిని ఆపినని నన్ను అభినందిస్తారు.

భాగ్యం డ్రామాను కనిపెట్టిన మోనిత
భాగ్యంపై అనుమానం వచ్చిన మోనిత.. కార్తీక్ నన్ను ఎందుకు చంపాలనుకొంటున్నాడు అని ప్రశ్నిస్తే.. దానికి కారణం అంతా అంజి.. రాత్రి అంతా కార్తీక్‌తోనే అంజి ఉన్నాడు. ప్రస్తుతం అతడి హాస్పిటల్‌లోనే ఉన్నాడు. నీ గురించి అంతా చెప్పేశాడట. దాంతో కోపంతో మమ్మల్ని చంపాలని డిసైడ్ అయ్యాడు. దాంతో అంజి తన ఆధీనంలో ఉన్నాడటంతో భాగ్యం ఏదో డ్రామా ఆడుతుందని మోనిత గ్రహించింది.

భాగ్యం నీ సంగతి చెబుతా అంటూ
దాంతో కార్తీక్‌తో పెళ్లిని ఆపడానికి ఎంత నాటకం ఆడుతున్నావే.. ఈ మోనితను తక్కువ అంచనా వేశావే అంటూ మోనిత తనలో తాను అనుకొన్నది. ఇక నీ సంగతి చెబుతా అంటూ కపటంగా నవ్వుతూ .. నీవు మంచిదానివి. ఎంత బాగా హెల్ప్ చేస్తున్నావు అంటూ మోనిత అంటే.. పద పద త్వరగా వెళ్దాం అంటూ తొందరపెట్టింది. నేను బట్టలు సర్దుకొంటాను. నీవు నాతోపాటు గదిలోకి రా అంటూ గదిలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టింది.

చనిపోవాలని అనుకొంటున్నా
భాగ్యాన్ని గదిలోకి తీసుకెళ్లి మాటలు కలుపుతూ.. అసలు నేను ఏం పాపం చేశాను పిన్నిగారు. ప్రేమించడం తప్పా.. కార్తీక్ తప్పు చేసి నాపై విరుచుకుపడితే ఎలా చెప్పండి. నన్ను అర్దం చేసుకోవాల్సిన కార్తీక్ నన్ను అపార్ధం చేసుకోవడాన్ని భరించలేకపోతున్నాను. అందుకే నేను చావాలని అనుకొంటున్నాను పిన్నిగారు నేను ఆత్మహత్యా చేసుకోవాలని అనుకొంటున్నాను అని భాగ్యం ముందు బాంబు పేల్చింది. దాంతో భాగ్యం షాక్‌లో పడిపోయింది. అలా 1110 ఎపిసోడ్ చివర్లో ట్విస్ట్ ఇచ్చి ముగించడంతో తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచారు.
Recommended Video

కార్తీకదీపంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: దీపగా ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల లీడ్ రోల్స్‌లో నటించారు. మౌనితగా శోభా శెట్టి, హిమగా బేబీ సహ్రు, శౌర్యగా బేబీ కార్తీక, సౌందర్యగా అర్చనా అనంత్, ప్రియమణిగా శ్రీదేవి తదితరులు నటించారు.
నిర్మాత: గుత్తా వెంకటేశ్వరరావు
దర్శకత్వం: కాపుగంటి రాజేంద్ర
ఎడిటర్: ఫణి భట్
బ్యానర్: గగన్ టెలివిజన్ షో బ్యానర్
స్ట్రీమింగ్: స్టార్ మా
బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











