Karthika Deepam హిమ, దీపనే కాదు.. నీ తల్లి సౌందర్యను కూడా అంటూ కార్తీక్‌కు షాకిచ్చిన మోనిత

కార్తీక దీపం సీరియల్‌లో మోనిత, కార్తీక్ మధ్య హైడ్రామా నడించింది. దీప ద్వారా మోనిత నిజం స్వరూపం తెలుసుకోవడమే కాకుండా స్వయంగా ఆమె తన వికృత రూపాన్ని బయటపెట్టడంతో కార్తీక్ తట్టుకోలేకపోయాడు. తన ప్రేయసి హిమను చంపించడమే కాకుండా, భార్య దీపను చంపించడానికి ప్రయత్నించిన మోనితను నరరూప రాక్షసి అంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఓ దశలో మోనిత చేష్టలను భరించలేక నేరు తన పాకెట్‌లో నుంచి పిస్టల్‌ తీసి మోనిత తలకు గురిపెట్టాడు.

ఇన్నాళ్లు స్నేహితురాలివి, శ్రేయోభిలాషివని నమ్మినందుకు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కార్తీక్ తన తలకు పిస్టల్‌ గురిపెట్టగానే మోనిత తన మోసాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసింది. తాజా ఎపిసోడ్ 1113లో ఏం జరిగిందంటే..

నీపైన ప్రేమతోనే ఇన్ని దారుణాలు అంటూ

నీపైన ప్రేమతోనే ఇన్ని దారుణాలు అంటూ

హిమ చావు గురించి తెలిస్తేనే ఇలా రెచ్చిపోతున్నావు. నిన్ను సొంత చేసుకోవడానికి.. నీ భార్య దీపను చంపించడానికి దుర్గతో ప్రయత్నించాను. జరిగిన యాక్సిడెంట్‌ను నువ్వే చేయించావని దీపను తప్పుదోవ పట్టించి నీపై మనసు విరిగిపోవడానికే కుట్ర చేశాను. నిన్ను నీ భార్యను విడదీయడానికి వంటలక్కకు విహారి సంబంధం అంటగట్టాను. ఇదంతా ఎందుకు చేశానంటే అందుకు కేవలం ఒకే ఒక కారణం ప్రేమ. నీపై నాకు ఉన్న నాకు పిచ్చి ప్రేమ అంటూ మోనిత చెప్పుకొంటూ పోయింది.

నిలువెత్తు ప్రేమమూర్తికి తుపాకి గురిపెడుతావా?

నిలువెత్తు ప్రేమమూర్తికి తుపాకి గురిపెడుతావా?

తన తలకు కార్తీక్ పిస్టల్ గురిపెట్టడంతో నా కార్తీక్ నన్ను చంపేస్తాడా? ఇవన్నీ దారుణాలుగా కనిపిస్తున్నాయా? వీటి వెనుక నా కారణాలు అర్ధం కావడం లేదా? ఎంత వెర్రివాడివి. ఎదురుగా నిలుచున్న నిలువెత్తు ప్రేమమూర్తిని చేతులారా చంపేస్తావా? దీప ఏమనుకొంటుందనని ఆలోచిస్తున్నావా? ఇన్ని చేసిన దాన్ని దీపను చంపడం నాకు ఓ లెక్కనా.. అవసరమైతే మీ అమ్మను కూడా అంటూ మోనిత అనగానే.. ఆపపే అంటూ కార్తీక్ అరవడంతో ఎపిసోడ్‌కు ముగింపు పలికింది.

బందీగా భాగ్యం పరిస్థితి ఏమిటంటే..

బందీగా భాగ్యం పరిస్థితి ఏమిటంటే..

కార్తీక్, మోనిత మధ్య జరుగుతున్న వాగ్వాదం, సంభాషణ వాడివేడిగా జరిగింది. మోనిత ఇంట్లో బందీ అయి మూతికి ప్లాస్టర్‌తో ఉన్న దీప పిన్ని భాగ్య పలు రకాల ఎమోషన్స్‌తో వింటూ వచ్చింది. మోనిత చెబుతున్న కుట్రలను విన్న భాగ్యం ఓ దశలో షాక్ గురైంది. ఏమీ చేయలేకపోతున్నాననే అసహనం ఆమెలో కనిపించింది.

తల్లి సౌందర్యను కూడా టార్గెట్ చేసిందా?

తల్లి సౌందర్యను కూడా టార్గెట్ చేసిందా?

ఇక తన తల్లి సౌందర్యను కూడా ఏదో చేస్తానని మోనిత చెప్పడంపై కార్తీక్ ఏం చేశాడనేది ఆసక్తిగా మారింది. దీపను నిజంగానే షూట్ చేశాడా? లేదా ఇంకా ఏదైనా జరిగిందా? అనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపింది. తదుపరి ఎపిసోడ్‌పై క్యూరియాసిటీని పెంచింది. అయితే భాగ్యం ఆ ఇంటి నుంచి బయటపడిందా? మోనిత పరిస్థితి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానం వచ్చే ఎపిసోడ్ 1114లో సమాధానాలు లభించనున్నాయి.

కార్తీక్ అరెస్ట్‌తో మరో మలుపు

కార్తీక్ అరెస్ట్‌తో మరో మలుపు

ఇక తదుపరి ఎపిసోడ్‌లో మోనిత హత్యకు గురైంది. శవం ఎక్కడ దాచిపెట్టావు అంటూ ఏపీసీ రోషిణి రావడం, దీప ఇంటిని నుంచి కార్తీక్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మరో ట్విస్టుకు తెరలేపారు. కార్తీకదీపం సీరియల్‌లో ప్రస్తుతం ట్విస్టుల పర్వం కొనసాగుతున్నది. ఈ ట్విస్టులకు ముగింపు ఎప్పుడు అనే ప్రశ్న బుల్లితెర ప్రేక్షకులను వెంటాడుతున్నది.

Recommended Video

#HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu
30వ వారంలో కూడా టాప్ రేటింగ్‌తో

30వ వారంలో కూడా టాప్ రేటింగ్‌తో

కార్తీకదీపం సీరియల్ 2021 సంవత్సరంలో 30వ వారం కూడా టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. 29వ వారాన్ని మించి 30వ వారంలో మెరుగైన టీఆర్పీని సాధించింది. 30వ వారంలో కార్తీక దీపం (17.68 (అర్బన్), 17.03 (రూరల్))‌లో రేటింగ్‌ను సాధించింది. తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్‌కు అందనంత దూరంలో ఈ సీరియల్ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X