Karthika Deepam చావు బతుకుల్లో కూతురు. డాక్టర్ బాబు, వంటలక్క లైఫ్‌లో మరో ట్విస్టు!
కార్తీకదీపం సీరియల్ నింపాదిగా, నత్త నడకన కొనసాగుతూ టాప్ రేటింగ్‌తో ముందుకెళ్తున్నది. తాడిపత్రి గ్రామంలో కార్తీక్, దీప కుటుంబం ఎదుర్కొన్నే సమస్యలు సాగదీతగా సాగుతున్నాయి. తాడిపత్రిలోని హోటల్‌లో దీప వంటలు చేయడం.. కార్తీక్ క్లీనింగ్ పనులు చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో తన కూతురు శౌర్యకు గుండె జబ్బు తిరగదోడింది. ఆమె ఆడుతూ కిందపడటంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం వల్ల వైద్యం అందించడానికి కష్టంగా మారింది. రుద్రాణి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాంటి సమయంలో శౌర్యను కాపాడుకొనేందుకు చెల్లెలు హిమ చేసిన సాహసం ఏమిటంటే..

రుద్రాణి వద్దకు హిమ వెళ్లి
చావు బతుకుల్లో ఉన్న శౌర్యకు ఆపరేషన్ చేయించడానికి డబ్బు అవసరం కావడంతో నేరుగా రుద్రాణి వద్దకు హిమ వచ్చింది. నా సోదరికి ఆపరేషన్ చేయించాలి. డబ్బు అవసరం. ఆ డబ్బు మాకు ఇవ్వండి. నేను శాశ్వతంగా మీ వద్దే ఉంటానని హిమ చెప్పింది. హిమ మాటలకు సంతోషపడిన రుద్రాణి స్వీట్లు తెప్పించి ముద్దు చేయబోయింది. అంతలోనే దీప వచ్చి రుద్రాణికి వార్నింగ్ ఇచ్చింది. నా బిడ్డను తీసుకొచ్చే హక్కు నీకెక్కడిది అంటే.. నీ మాదిరిగానే పిల్లలకు ప్రేమ పంచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకే హిమను ముద్దు చేస్తున్నాను అని రుద్రాణి సమాధానం ఇచ్చింది. అయితే హిమను తీసుకొచ్చే అధికారం ఎవరు ఇచ్చారు అని ప్రశ్నిస్తే.. నేను తీసుకురావడం ఏమిటి? హిమే నా వద్దకు వచ్చింది. ఒట్టు అంటూ రుద్రాణి చెప్పడంతో దీప షాక్ తిన్నది.

శౌర్యను తీసుకెళ్లిన దీప
హిమను చూస్తూ నీవు ఇక్కడికి రావడం ఏమిటి? అని దీప నిలదీస్తే.. శౌర్యకు బాగాలేదు. డబ్బు తీసుకొని ఆపరేషన్ చేయిద్దాం అని హిమ సమాధానం ఇచ్చింది. హిమ మాటలకు అడ్డు పడుతూ నీకు ఏం తెలియదు రా.. నీవు కనిపించకపోతే ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ చేయి లాగుతూ తీసుకెళ్లే ప్రయత్నం దీప చేసింది. అయితే హిమను ఇక్కడే ఉంచి డబ్బు తీసుకెళ్లు. పాప ప్రాణాలు కాపాడుకో అంటూ డబ్బు ఇవ్వబోయింది. అయితే డబ్బు తీసుకోకుండా హిమను లాక్కెల్లింది. దాంతో డబ్బు తీసుకో.. ఎప్పటికైనా డబ్బు కట్టే పరిస్థితి మీతో లేదు. నీ బిడ్డ ఎప్పటికైనా నా వద్దకే రావాల్సి ఉంటుంది అంటూ రుద్రాణి గట్టిగా ఆరిచింది. కానీ హిమను తీసుకొని దీప వెళ్లిపోయింది.

శౌర్య ఆపరేషన్ కోసం అప్పు పుట్టదు అంటూ
హిమను తీసుకొని ఊర్లో చాలా మందిని అప్పు కోసం ప్రయత్నించింది. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉండగా, మళ్లీ రుద్రాణి ఎదురైంది. అప్పు కోసం తిరిగి తిరిగి నీకు నీరసం వస్తుంది కానీ.. డబ్బు దొరకదు. నీకు ఎక్కడా డబ్బు పుట్టదు అంటూ రుద్రాణి చెప్పింది. ఈ డబ్బు తీసుకొని నీ బిడ్డకు ఆపరేషన్ చేయించుకో అంటూ వెంటపడింది. అయినా రుద్రాణి నుంచి డబ్బు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్తుండగా..అప్పు ఫోన్ మోగింది. శౌర్యను వేరే హాస్పిటలకు తీసుకువచ్చామని అడ్రస్ చెప్పారు. దాంతో దీప హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ ఆపరేషన్ చేయమని హాస్పిటల్ సిబ్బందిని కార్తీక్ కాళ్లావేళ్లా పడ్డారు. కానీ డబ్బు చెల్లించనిదే ఆపరేషన్ చేయమని చెప్పారు. ఇదిలా ఉండగా శౌర్య ఉన్న హాస్పిటల్‌ను వెతికేందుకు రుద్రాణి తన అనుచరులతో బయలు దేరింది.

డాక్టర్ కార్తీక్ అయితేనే పాప బతుకుతుందంటూ
హాస్పిటల్‌లో శౌర్య పరిస్థితి దీనంగా ఉండటంతో ఇప్పడే బయటకు వస్తానని కార్తీక్ చెప్పి వెళ్తుంటే.. అప్పు కొంత డబ్బు చేతిలో పెట్టాడు. దాంతో కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు. నేరు మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు తీసుకొన్నాడు. తాను తీసుకొన్న మెడిసిన్స్, చెల్లించిన డబ్బు చూసి.. మీరు డాక్టరా అని అడిగితే.. కాదు నేను గతంలో మెడికల్ స్టోర్‌లో పనిచేసే వాడిని అంటూ కార్తీక్ సమాధానం చెప్పాడు. మందులు తీసుకొని వచ్చి శౌర్యకు ఇచ్చాడు. అయితే తాజా ప్రోమోలో శౌర్య గుండె ఆపరేషన్‌కు డాక్టర్ కార్తీక్ అయితేనే సాధ్యపడుతుంది అంటూ వైద్యులు చెప్పడంతో దీప.. అతడిని తీసుకొస్తానని చెప్పడం కనిపించింది. ఇలా ఎమోషనల్‌గా సీరియల్ సాగుతున్నది.
Recommended Video

కార్తీకదీపం తాజా రేటింగ్ ఇలా..
ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్ 2022లో కూడా టాప్ రేటింగ్‌లో సాగుతున్నది. గత రెండేళ్లకుపాగా ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీని సాధిస్తున్నది. ఈ సీరియల్ స్టడీగా 13.5 రేటింగ్‌తో కొనసాగుతున్నది. ఇతర సీరియల్స్‌కు అందకుండా అగ్రస్థానంలో ఉంది. అయితే కొద్ది వారాలుగా స్లోగా, సాగదీత ఎక్కువైందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











