Karthika Deepam కార్తీక్, దీప మీ అంతు చూస్తా? వదలను అంటూ మరో కుట్రకు మోనిత రెడీ!
కార్తీకదీపం సీరియల్‌లో తాజా ట్వీస్టు మరింత ఆసక్తిగా మార్చింది. కార్తీక్, దీప తిరిగి తమ ఇంటికి రావడం, ఆ రోజే వారి పెళ్లి రోజు కావడంతో సౌందర్య వారికి తన చేతులు మీదుగా కల్యాణం జరిపించారు. అదే సమయంలో మోనిత అక్కడికి రావడం, కల్యాణ వేడుకకు వచ్చిన డాక్టర్ భారతీ, రవి దంపతులు వారికి కంగ్రాట్స్ చెప్పి.. కార్తీక్ డాక్టర్ వృత్తిని చేపట్టడానికి మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలపడం లాంటి విషయాన్ని చెప్పారు. దాంతో కార్తీక్ కుటుంబ చాలా సంతోషంగా ఫీలైంది.
కానీ కార్తీక్‌కు డాక్టర్ వృత్తిని కొనసాగించేలా అనుమతి లభించడం వెనుక మోనిత ఉందని డాక్టర్ రవి చెప్పడంతో దీప కోపంతో ఊగిపోయింది. డాక్టర్ రవి అన్ని దారులు మూసుకుపోయాయని కొత్త నాటకం ఆడుతున్నారా అంటూ నిలదీసింది. మోనితను దెప్పి పొడుస్తూ.. నాటకాలు ఆడటం నీకు కొత్త కాదు.. నీ గురించి నాకు తెలియదా? అంటూ దీప వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది. ఇంకా తాజా ఎపిసోడ్ 1276లో ఎలాంటి విషయాలు చోటు చేసుకొన్నాయంటే..

మోనితకు దారుణంగా అవమానం
మోనితతో దీప మాట్లాడుతూ.. అత్త గారు చెప్పినట్టు పిలువని పేరంటానికి వచ్చావు. ఎలాంటి గొడవ చేయకుండా భోజనం చేసి వెళ్లు. వంట కూడా నేనే చేశాను. భోజనం చాలా రుచికరంగా ఉంటుంది అని దీప సెటైర్ వేసింది. దాంతో నేను భోజనం చేయడానికి రాలేదు అని మోనిత అంటే.. నా చేతి వంట తిని అదృష్టం నీకు లేదులే.
మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా వచ్చిన దారిలోనే వెళ్లు. లేదంటే మర్యాద ఉండదు. లేదంటే నీకు ఇష్టమైన, నీకు అర్ధమైన మాటల్లోనే చెబుతాను. కార్తీక్ నీ చేతులతోనే నీ మెడలో తాళి కట్టించుకొంటాను అని మనసులో మోనిత అనుకొంటుండగా.. ఏం ఆలోచిస్తున్నావు మోనిత.. మాతో సెల్ఫీ దిగాలనుకొంటున్నావా? ఆదిత్య నీ ఫోన్ ఇవ్వు.. అంటూ బలవంతంగా మోనితను నిలుచోబెట్టి దీప సెల్ఫీ తీసింది. అయితే అక్కడ జరుగుతున్న అవమాన భారాన్ని తట్టుకొలేక వెళ్లిపోయింది.

కార్తీక్‌ను దెబ్బ కొట్టడానికి ఏదో ఒకటి చేస్తా
కార్తీక్ ఇంటిలో జరిగిన అవమానాన్ని భరించలేక మోనిత ఊగిపోయింది. దీప ఎత్తిపొడుస్తూ మాట్లాడిన తీరును జీర్ణించుకోలేకపోయింది. ఎక్కడికో వెళ్లాలని అనుకొన్నా.. వీరిద్దరి బంధం మరింత బలపడినట్టు ఉంది. వచ్చి రాగానే.. పెళ్లి సందడి ఏంటో.. వీళ్ల అన్యోన్యత ఏంటో.. అసలు నచ్చడం లేదు. ఏదో ఒకటి చేయాలి.. ఏదో ఒకటి చేయాలి.. ఏం చేయాలి.. మోనిత అంటే ఏంటో వీళ్లకు తెలిసేలా చేయాలి.. అని మోనిత ఊగిపోయింది.
అంతలోనే బాబాయ్ ఫోన్ మోగింది. దాంతో దీపకు చెక్ చెప్పడానికి బాబాయ్‌ను ఎందుకు ఉపయోగించుకోకూడదు. వాడుకోవడంలో నా కంటే ఎవరు గొప్ప.. రెండు కన్నీటి చుక్కలు పెడితే బాబాయ్ కరిగిపోతాడు. గతంలో పెట్టిన బాధలన్నీ మరిచిపోతాడు అంటూ ఫోన్ ఎత్తింది.

బాబాయ్ గుండె ఆపరేషన్‌తో కార్తీక్‌ను ఇరికించేందుకు
అమెరికాలో ఉంటున్న బాబాయ్ గుండె ఆపరేషన్‌కు ఇండియాకు రావడంతో కుశలు ప్రశ్నలు వేసింది. ఆరోగ్యం ఎలా ఉందంటూ పలకరించింది. అయితే ఆశలన్నీ వదులేసుకొన్నాను అని అంటే.. నీ కూతురు ఉందని మరిచిపోయావా? అయితే తనకు గుండె ఆపరేషన్ జరగాల్సి ఉంది. డాక్టర్ కార్తీక్ అయితే బెస్ట్ అని అంటున్నారు. అందుకే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను.
కార్తీక్ సర్జరీ చేస్తాడా అని బాబాయ్ అడిగితే.. కార్తీక్ ఎవరునుకొంటున్నావు.. మీ అల్లుడు. మేమిద్దరం పెళ్లి చేసుకొన్నాం అని మోనిత అంటే.. మంచి వార్త చెప్పావు అని బాబాయ్ సమాధానం ఇచ్చారు. దాంతో నా గురించి ఎక్కువ ఆలోచించకు అంటూ బాబాయ్ చేయాలో అనే విషయాన్ని ఫోన్‌లో చెప్పింది. మిమ్మల్ని కాపాడుకొంటాను అంటే.. కార్తీక్, నువ్వు పెళ్లి చేసుకొన్నావా? అంటే.. నేను, నా బాబు, కార్తీక్ కలిసి పూజ చేసిన ఫోటో పంపిస్తాను అంటూ ఫోన్ పెట్టేసి.. బాబాయ్‌ని బుట్టలో వేసుకొన్నానే ఓ వికటపు నవ్వు నవ్వింది.

అదిరిపోయేలా ప్లాన్ వేశా అంటూ మోనిత
బాబాయ్‌తో ఆడిన నాటకం గురించి తనలో తాను మాట్లాడుకొంటుంటే.. ప్రేమగా రెండు మాటలు పడిపోయాడు. బాబాయ్ నాకు ఇప్పుడు ఆయుధం. చుట్టాలు ఉపయోగపడుతారని అంటుంటారు. కార్తీక్‌కు దగ్గర అవ్వడానికి బాబాయ్ బంధాన్ని ఉపయోగించుకొంటాను. కార్తీక్ నీతో బిడ్డను కని.. నాకు నేను తాళి కట్టుకొని.. నాకు నేను భార్యగా ప్రపంచానికి అరిచి అరిచి చెప్పుకొంటుంటే.. నీవు, నీ భార్యతో కలిసి బయటకు వెళ్తావు.
మళ్లీ వచ్చి అన్యోన్యయంగా పెళ్లి రోజు జరుపుకొంటారా?. ఇవన్నీ చూసి మోనిత ఊరుకొంటుందా? కళ్లలో నిప్పులు పోసుకొంటుంది. దీప మిమ్మల్ని విడగొట్టే దాక మనశ్శాంతి ఉండదు. కార్తీక్‌ను నీ వైపు నుంచి నావైపుకు తిప్పుకొంటాను. ఈ సారి అదిరిపోయే ప్లాన్ వేశాను అంటూ మోనిత చిటికెలు వేసింది.

బస్తీకి వెళ్లి వస్తానంటూ దీప
కార్తీక్ మళ్లీ ఇంటికి రావడంతో సౌందర్య ఆనందంతో ఉప్పొంగిపోయింది. ప్రేమగా అన్నం తినిపిస్తుంటే.. దీప వచ్చి.. నేను బస్తీకి వెళ్లి వస్తాను అత్తయ్య అంటే.. కుటుంబ సభ్యులు ఓ రకంగా చూశారు. నేను బస్తీకే కదా వెళ్లి వస్తానని చెప్పాను దీప అంటే.. అవును.. మీరు లేనప్పుడు చాలా విషయాలు జరిగాయి. మోనిత హాస్పిటల్ అమ్మేసి.. బస్తీలో మీరు ఉంటున్న ఇంటిని కొనుగోలు చేసి.. అక్కడ హాస్పిటల్ పెట్టింది అని సౌందర్య చెప్పింది. అలాగే తన బిడ్డ పోయాడని, ఆ పిల్లాడిని ఆదిత్య ఎత్తుకొచ్చాడని ఇంటికి వచ్చి గొడవ చేసింది అని కుటుంబ సభ్యులు చెప్పడంతో దీప షాక్ తిన్నది.
ఇలాంటి సమయంలో వెళ్లడం మంచిది కాదు అంటే.. మనం ఇదే తప్పు చేస్తున్నాం. తప్పు లేకున్నా మనం మోనితకు భయపడుతున్నాం. పిల్లలకు చెప్పు నేను బస్తీకి వెళ్లి వస్తాను. ఇప్పుడు నేను బస్తీకి వెళ్లకపోతే.. ఇది మోనిత విజయమే అవుతుంది అని దీప అక్కడి నుంచి బస్తీకి బయటకు వెళ్లింది.

మోనిత ఇంటికి వచ్చిన బాబాయ్
ఇదిలా ఉండగా, మోనిత ఇంటికి బాబాయ్ వచ్చాడు. బాబాయ్‌ను చూసి ఎక్కడలేని ప్రేమను ఒలకబోసింది. మోనిత ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు. అంతలోనే బాబాయ్ అనుమానంగా చూడటం చూసి.. ఓవరాక్షన్ చేస్తున్నానా అంటూ సందిగ్దంలో పడింది. అయితే మన మధ్య ఎన్నో గొడవలు ఉంటాయి. అంత మాత్రాన బంధాలు విడిపోతాయా? రా ఇంటిలోకి అంటూ ప్రేమగా తీసుకెళ్లింది. ఇంటిలోకి తీసుకొచ్చి కాళ్ల మీద పడింది. గతంలో నిన్ను ఏదైనా కష్టపడితే క్షమించాలి అంటూ ఏడ్చింది. దాంతో నీకు కోపం ఎక్కువ అంతేగానీ.. మరోటి నీలో కనిపించదు అంటూ బాబాయ్ చెప్పడంతో తన ప్లాన్ వర్కవుట్ అయిందని సంబరపడిపోయింది.

హాస్పిటల్‌లో అడుగుపెట్టిన కార్తీక్
ఇక చాలా రోజుల తర్వాత తన హాస్పిటల్‌లో అడుగుపెట్టిన కార్తీక్‌కు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అయితే హాస్పిటల్‌లోకి అడుగుపెట్టగానే.. గతంలో నీవు డాక్టర్‌గా పనిచేయడానికి అనర్హుడివి అంటూ డాక్టర్ రవి చెప్పిన విషయాలు గుర్తుకు రావడంతో ఎమోషనల్ అయ్యాడు. అలా ఆలోచనల్లో ఉండగా..రిసెప్షనిష్టు వచ్చి మీరు రాగానే సమాచారం అందించమని మోనిత చెప్పింది. ఆమెకు మీరు వచ్చినట్టు చెప్పాలా? అని అడిగితే అవసరం లేదని చెప్పి మళ్లీ ఆలోచనల్లో పడ్డాడు.


Click it and Unblock the Notifications











