Karthika Deepam మోనిత అంటేనే మోసం.. నీపై అలాంటి కుట్ర.. అనుమానం వ్యక్తం చేసిన వంటలక్క

కార్తీక్‌దీపం సీరియల్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకొంటున్నాయి. మోనిత కారణంగా గుండె ఆపరేషన్ విఫలం కావడంతో మనస్తాపం చెందిన డాక్టర్ కార్తీక్ తన ఆస్తిని బాధితురాలికి అప్పగించి ఇంటి నుంచి తాడికొండ గ్రామానికి వెళ్లడం, అక్కడ అనేక కష్టాలు పడి చివరకు ఇంటికి రావడంతో కార్తీక్ కష్టాలు ముగిసాయి. తన పెళ్లి రోజు కావడంతో తన కుమారుడు, కోడలికి మళ్లీ కల్యాణం జరిపించారు. ఈ సందర్బంగా డాక్టర్ భారతీ, డాక్టర్ రవి గిఫ్టుగా ఓ సర్టిఫికెట్ ఇచ్చి.. మీ మీద నిషేధం తొలిగించారు. మెడికల్ అసోసియేషన్ మీకు లైసెన్స్‌ను పునరుద్దరించారు అని చెప్పారు. అంతలోనే మోనిత ఎంట్రీ ఇవ్వడంతో ఆమె వల్ల మీకు డాక్టర్ లైసెన్స్ వచ్చింది అని డాక్టర్ రవి చెప్పారు. దాంతో దీప, కార్తీక్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మోనిత వ్యవహారంపై డాక్టర్ భారతీ, రవి, దీపకు అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ 1278 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్ డాక్టర్స్ అసోసియేషన్‌లోకి రావడంపై డాక్టర్ భారతీ, రవి చర్చించుకొన్నారు. కార్తీక్ అసోసియేషన్‌లోకి రావడం మంచిదేగా అని రవి అంటే.. అవును మంచిదే.. నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ భారతీ సమాధానం చెప్పింది. కార్తీక్‌పై నిషేధం ఎత్తివేయడం హ్యాపీగా ఉంది. కానీ కార్తీక్‌కు మోనిత సహాయం చేయడమే అంటూ భారతీ అనుమానం వ్యక్తం చేసింది. అయితే కార్తీక్‌కు మోనిత సహాయం చేయడంలో తప్పేముంది అంటూ డాక్టర్ రవి ప్రశ్నించాడు. దాంతో లేదు రవి.. నాకు ఎక్కడో లింకు మిస్ అయి ఉంటుంది. కార్తీక్‌కు మోనిత సహాయం చేయడం వెనుక మరేదో ఉందనే అనుమానం నాకు, దీపకు ఉంది అని భారతీ చెప్పింది. అయితే మోనిత నీకు క్లోజ్ కదా.. అని రవి అంటే.. నాకు క్లోజ్ కానీ.. నాకు, మోనితకు మధ్య చాలా అభిప్రాయ బేధాలు ఉంటాయి. కానీ కార్తీక్‌కు సపోర్ట్ చేయడం వెనుక ఏదో అనుమానం ఉంది.. దాని గురించి ఆలోచించాలి అంటే.. కొన్ని విషయాలు వదిలేస్తేనే మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది అని డాక్టర్ రవి అన్నాడు.

Karthika Deepam February 17th Episode number 1278

మోనిత వెళ్లిపోయిన తర్వాత దీపకు కార్తీక్ అసలు విషయం చెప్పాడు. తన బాబాయికి గుండె ఆపరేషన్ చేస్తే.. నేను బోర్డు, హాస్పిటల్ తీసేస్తాను. అంతేకాకుండా ఇంటిని కూడా అమ్మేస్తాను అని మోనిత చెప్పిన విషయాలను దీపకు కార్తీక్ చెప్పాడు. అయితే నీకు మెడికల్ అసోసియేషన్ నిషేధం తొలగించడం వెనుక మోనిత కుట్ర ఏదో ఉంది అంటే.. నీవు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అంటే.. లేదు.. నీపై నిషేధం విధించడం వెనుక మోనిత పాత్ర ఉందని ఎందుకు అనుకోకూడదు అని దీప అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటి వరకు జరిగిన రచ్చ సరిపోలేదా? అంటే.. మన పక్క నుంచి సాధు జంతువు వెళితే.. ఆలోచించ వద్దు.. కానీ క్రూర జంతువు వెళితే ఆలోచించాలి. మోనిత అంటేనే మోసం.. నీకు డాక్టర్ లైసెన్స్ రావడం వెనుక మోనిత సపోర్ట్ ఉంటే.. పోవడం వెనుక కూడా మోనిత ఉండవచ్చు కదా అని దీప అంటే.. ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావేంటి అంటూ.. ఇన్ని కష్టాలు పడ్డాం.. ఇది నెగిటివ్‌గా ఆలోచించడం కాదు.. మళ్లీ ఇబ్బందుల రాకుండా జాగ్రత్త పడటం అంటూ దీప చెప్పడంతో కార్తీక్ ఆలోచనల్లో పడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X