Karthika Deepam మోనితకు మరో ఎదురు దెబ్బ.. కుట్రలను కార్తీక్‌కు చెప్పిన దీప!
కార్తీకదీపం సీరియల్‌లో మోనిత ఎత్తులకు దీప పైఎత్తులు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. తాము ఊరు విడిచివెళ్లిన సమయంలో బస్తీలో వంటలక్క ప్రజావైద్యశాల పెట్టారనే విషయం తెలుసుకొన్న దీప.. ఆ హాస్పిటల్ బోర్డును కారు డ్రైవర్ వారణాసితో పీకించేసింది. దాంతో దీప, మోనిత మధ్య రచ్చ జరిగింది. ఇంకా తాజా ఎపిసోడ్ 1278లో ఏం జరిగిందంటే..
Photos Courtesy: Star మా and Disney+Hotstar

వారణాసితో బోర్డు పీకించేసిన దీప
కారు డ్రైవర్ వారణాసి చేత మోనిత ఇంటిపై కట్టిన వంటలక్క హాస్పిటల్ బోర్డును దీప నాశనం చేసిన తర్వాత బస్తీవాసులంతా కంగారు పడిపోయారు. దీప ఇలా చెప్పడం ఏమిటి? కారు డ్రైవర్ బోర్డు చింపి వేయడమేమిటి? దీపమ్మ వచ్చిన ఆనందం కూడా లేకుండా పోయింది. మోనిత వస్తే ఎలాంటి గందరగోళం ఉంటుందో అని బస్తీవాసులు భయపడ్డారు. అంతలోనే మోనిత వచ్చి తన ఇంటి ముందు ఉన్న గుంపును చూసి కంగారుపడిపోయింది. కొంపదీసి నా బాబాయి చెక్కేశాడా? ఆయన కోసం బాధలో ఉన్నట్టు.. కొన్ని కన్నీళ్లు పెట్టుకొని మంచి ప్లాన్ వేశానే.. ఇప్పుడు ఇలా పైకి వెళ్లిపోతే నా పరిస్థితి ఏం కావాలి? అంటూ తనలో తాను అనుకొన్నది. జనాన్ని తోసుకొంటూ వెళ్లే సరికి హాస్పిటల్ బోరు ముక్కలు ముక్కలుగా కనిపించింది.

దీపకు కోపం వచ్చిందంటే అంటూ మోనిత
తన హాస్పిటల్ ముందు ఉన్న లక్ష్మణ్‌తో మాట్లాడుతూ.. ఏం జరిగింది అంటే.. దీపమ్మ చెప్పిందని కారు డ్రైవర్ బోర్డును ముక్కలు చేశాడు అని చెప్పాడు. దాంతో వంటలక్క ప్రజా వైద్యశాల అని పేరు పెట్టుకొన్నందుకు కోపం వచ్చిందేమో.. పర్వాలేదు.. ముక్కలన్నీ జోడించి.. జెండా మాదిరిగా పైన కట్టు. అవి జెండా మాదిరిగా రెపరెపలాడుతుంది అని లక్ష్మణ్‌కు చెప్పింది. అయితే దీపకు కోపం వచ్చిందంటే నా విజయం దక్కినట్టే అని మనసులో అనుకొన్నది. అయితే బాబాయ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే.. మీరు ఆరోగ్యంగా ఉన్నారు. అదే నాకు హ్యాపీ. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అంటూ చెప్పింది. అయితే దీప వద్దని చెప్పింది కదా.. మళ్లీ ఎందుకు అని బస్తీవాసి అడ్డు చెప్పబోగా.. అతడిని చెంపపై కొట్టింది. లక్ష్మణ్ అవన్నీ కట్టగట్టి పైన పెట్టు. వాటిని తీపి గుర్తులుగా పెట్టుకొందాం అంటూ అక్కడి నుంచి సరసరా వెళ్లిపోయింది.

తాతయ్య లేడు.. ఆనంద్ వచ్చాడు..
ఇంటి సభ్యులతో ఇళ్లంతా కళకళాలాడటంతో సౌందర్య హ్యాపీగా ఫీలైంది. ఎన్ని రోజులైందో ఇలా అందరం కలిసి ఉండటం అని ఎమోషనల్ అయింది. అయితే ఇలాంటి సమయంలో నాన్న ఉంటే బాగుండు అని కార్తీక్ అంటే.. అవును.. నాన్న ఆరోగ్యం కుదుటపడిందట.. వచ్చి తీసుకెళ్లమని చెప్పారు అని సౌందర్య చెప్పింది. అయితే అందరం అంత్యాక్షరి ఆడుకొని చాలా రోజులు అయింది బాబాయ్ అంటూ శౌర్య అనడంతో.. నీకు ఆడాలని ఉందా.. అందుకే ప్రపోజల్ పెట్టావా అని ఆదిత్య అన్నాడు. దాంతో నీ ఆరోగ్యం బాగాలేదు శౌర్య.. కొద్ది రోజులు ఆగు.. ఆ తర్వాత ఆడుకొందువు అని కార్తీక్ చెబితే.. అవును.. శౌర్య ఆరోగ్యం బాగాలేదు అంటూ దీప చెప్పింది. అయితే అందరం కలిసి ఉన్నాం కాబట్టి.. ఓ సెల్ఫీ తీసుకొందాం అని ఆదిత్య సెల్పీ తీస్తుంటే.. ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది.. ఆనందరావు తాతయ్య లేడు కాబట్టి.. ఆయన స్థానంలో ఆనంద్ ఉన్నాడు అంటూ శౌర్య చెప్పింది.

నీ కొడుకు మీద ప్రేమ లేదా?
అయితే ఆనంద్‌ను ఎత్తుకొని కార్తీక్ ఆడిస్తుంటే.. మోనిత ఇంట్లోకి వచ్చింది. దీపక్క దీపక్క అంటూ కార్తీక్‌ను చూసి.. ఏంటి కార్తీక్.. ఆదిత్య కొడుకును ఆడిస్తున్నావా? నీ కొడుకును ఎప్పుడైనా ఆడించావా? అంతా స్వార్ధమా? ఆదిత్య కొడుకు అంటే అంత ప్రేమనా? అని మోనిత అంటే.. అది కాదు.. ఆదిత్య కొడుకు కాదని ఏదో చెప్పబోతుంటే.. శ్రావ్య వెంటనే.. ఆదిత్య కొడుకు అని చెప్పకు. అలా చెబితే.. ఎవరు? ఏంటని కూపీ లాగుతుంది అని.. ఆనంద్‌ను కార్తీక్ నుంచి తీసుకొని వెళ్లిపోయింది

పిచ్చి పనులు చేస్తే ఊరుకోను..
తన ఇంటికి రావడంపై మోనితను కార్తీక్ అడుగుతూ.. ఎందుకు వచ్చావు అంటే.. రావడానికి హక్కు ఉంది. రావడానికి వంద కారణాలు ఉన్నాయి అని మోనిత అంటే.. దానికి సమాధానం నేను చెబుతాను అంటూ దీప జోక్యం చేసుకొంది. వచ్చేలా చేశావు కదా దీప అంటే.. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకోను అని దీప సమాధానం చెప్పింది. దాంతో ఏం జరిగింది అంటూ కార్తీక్ అడిగితే.. కార్తీక్ ఆశీస్సులతో వంటలక్క ప్రజావైద్యశాల అంటూ బోర్డు పెట్టించింది. ఆ బోర్డును నేను తీయించాను. అందుకే కడుపు మంటతో ఇక్కడికి వచ్చింది అని దీప అంటే.. ఆ ఇంటిని నేను కొనుక్కొన్నాను. బోర్డు పెట్టుకొనే హక్కు నాకు ఉంది అని మోనిత అంటే.. నా పేరు పెట్టుకొనే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. మొండిఘటం ప్రజా వైద్యశాల అని బోర్డు పెట్టుకో అంటూ దీప ప్రశ్నించింది.
Recommended Video

ఇంటికో బోర్డు పెడుతా అంటూ
కార్తీక్‌తో మోనిత మాట్లాడుతూ.. నేను బోర్డు తీసేస్తాను అని చెప్పాను. ఈ విషయాన్ని వివాదంగా మార్చుకు అని చెప్పింది. అంతేకాకుండా.. ఒక్క బోర్డు తీసేస్తే.. ఇంటికో బోర్డు పెడుతా అంటే మోనిత అంటే.. కుక్క తోక వంకర.. దానిని సరిచేస్తాను అని దీప అంటే.. బస్తీవాళ్లను చూసుకొని బలం పెంచుకొన్నావా? అని మోనిత అంటే.. బస్తీవాసులు దీప ఫ్యాన్స్ అని నీవే అన్నావు కదా అని దీప సమాధానం ఇచ్చింది. దాంతో కార్తీక్ సింపుల్‌గా అయిపోయే దానిని కాంప్లికేట్ చేసుకొంటున్నావు. గోటితో పోయేదానిని గొడ్డలితో తెచ్చుకోకు అని కార్తీక్‌కు మోనిత వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు నీ ఆటలు సాగాయి.. నీ కంటే ఎక్కువ ప్లాన్స్ వేయగలను. అతి త్వరలోనే.. నీకు దీప అంటే ఏమిటో చూపిస్తా అని మోనితకు దీప వార్నింగ్ ఇచ్చింది. దాంతో మోనిత అక్కడి నుంచి అవమానంతో వెళ్లిపోయింది.


Click it and Unblock the Notifications











