Karthika Deepam ఛీ కొట్టినా ప్రేమ తగ్గలేదు.. కార్తీక్ కాళ్ల మీద పడిన మోనిత.. ఏం జరిగిందంటే?

కార్తీకదీపంలో రకరకాల ట్విస్టులు చోటుచేసుకోవడంతో గత కొద్ది రోజులుగా చప్పగా సాగుతున్న సీరియల్‌‌లో ఇంట్రెస్టింగ్‌ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. మోనిత బాబాయ్‌కి గుండె ఆపరేషన్ వ్యవహారం సెంట్రల్ పాయింట్‌గా మారింది. ఈ పాయింట్ ఆధారంగా రకరకాల ఎమోషన్స్‌ను సన్నివేశాల్లో జొప్పిస్తున్నారు. బాబాయ్ గుండె ఆపరేషన్‌ను సాకుగా చేసుకొని మోనిత మరో కుట్రకు ప్లాన్ చేసిందనే అనుమానాలు కార్తీక్ కుటుంబ సభ్యులను కూడా కన్విన్స్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో 1280 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

 బాబాయ్‌తో కపట నాటకం

బాబాయ్‌తో కపట నాటకం

తన బాబాయ్‌ను మోనిత బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నించింది. తనను ఉపయోగించుకొని డాక్టర్ కార్తీక్‌ను కష్టాల్లో పడేసేందుకు ప్లాన్ చేసింది. బాబాయ్ కాళిని తనపై పెట్టుకొని గోర్లు కట్ చేస్తుంటే.. ఏంటమ్మా.. ఇదంతా.. అని అడిగాడు. అందుకు నేను మిమ్మల్ని గతంలో చాలా కష్టాలు పెట్టాను. ఆ తప్పులను సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను అని మోనిత అంటే.. నీలో ఎంత మార్పు అంటూ బాబాయ్ పొంగిపోయాడు. అయితే పిచ్చి బాబాయ్ మారితే నేను ఎందుకు మోనితను అవుతాను. మారను బాబాయ్ అని మనసులో అనుకొంది. అయితే వెంటనే తన కాలిని వెనుకకు తీసుకొంటే.. ఏమైంది బాబాయ్ అని మోనిత అడిగింది. దాంతో నట్టిట్లో గోర్లు తీస్తే.. కీడు జరుగుతుందంటారు అని బాబాయ్ అంటే.. నిజంగా కీడు జరుగబోతుంది. కానీ నీవు ఏమీ చేయలేవు అని మనసులో అనుకొంటూ మోనిత ఆనందపడిపోయింది.

 నీ గుండె ఆగిపోతుంది అంటూ

నీ గుండె ఆగిపోతుంది అంటూ

అయితే తన ఫీలింగ్స్ బయటకు కనిపించకుండా బాబాయ్‌ను బోల్తా కొట్టించే ప్రయత్నాలు చేస్తూ.. అలాంటివి ఆలోచించకు. నీ కూతురు మోనిత ఉంది. నా ప్రాణాలు అడ్డువేసైనా నిన్ను కాపాడుకొంటాను. నీ మాటలు వింటుంటే నా గుండె ఇప్పుడే ఆగిపోయిటట్టు ఉంది అని అంటే.. నీకు కూతురు ఉంటే.. ఆ మాట అంటావా? నీ కూతురు లాంటి దానిని. నిన్ను కాపాడుకొంటాను అని మోనిత అంటే.. నీవు మారడానికి ఏ దేవుడు దయ కారణమో.. అని బాబాయ్ అన్నాడు. దాంతో నేను మారాను అంటే నాకే నమ్మకం కలగడం లేదు. నా ప్లాన్ నీకు తెలిస్తే.. నీ గుండె ఇప్పుడే ఆగిపోతుంది అని మోనిత అంది.. అంతేకాకుండా నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు అని బాబాయ్‌తో చెప్పింది. దాంతో బాబాయ్ కంటతడి పెట్టుకొన్నాడు. ఏంటి బాబాయ్ అలా కంటతడి పెట్టుకోకు అని మోనిత అంటే... నా మీద చెప్పలేనంత ప్రేమ చూపిస్తున్నావు.. ఇంకా నిన్ను ఏమీ అడుగాలి అంటూ బాబాయ్ ఎమోషనల్ అయ్యాడు.

 నర్సుతో కలిసి కుట్ర

నర్సుతో కలిసి కుట్ర

అయితే బాబాయ్ ఆపరేషన్ సందర్భంగా కార్తీక్‌కు మత్తు మందు అందించే ప్లాన్‌ను నర్స్‌కు చెబితే.. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో మోనిత షాక్ తిన్నది. ఏంటి నేను వలపన్నితే ఎవరు పడకుండా ఉండరు. కానీ ఈ నర్స్ ఇలా రివర్స్ గేర్ వేసిందేమిటి అనుకొని కంగారుపడింది. మీకు ఇష్టమైతే ఆపరేషన్ చేయించుకోండి అంటూ నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే నర్సు తన వ్యవహారాన్ని ఎక్కడ బయటపెడుతుందనే విషయంతో భయపడిన మోనిత వెంటనే నర్సు వద్దకు వెళ్ళి.. నేను అడిగాను.. నీవు ఒప్పుకోలేదు.. అంతటితో మరిచిపో.. ఈ విషయాన్ని కార్తీక్‌కు చెప్పకు అని అంటుండగా.. మోనిత అంటూ కార్తీక్ పిలిచాడు. దాంతో ఒక్కసారిగా భయపడిపోయింది. దాంతో నర్సుకు మరోసారి చెబుతూ.. ఏం మాట్లాడుకోలేదు. ఆ విషయం గురించి మరిచిపో.. ఆపరేషన్ గురించి అడిగానని కార్తీక్ అడిగితే చెప్పు అంటూ నర్సుతో గుసగుసలాడింది.

కార్తీక్ పిలువగానే మోనిత

కార్తీక్ పిలువగానే మోనిత


ఇక నర్సుతో మాట్లాడుతుంగా మోనితను కార్తీక్ పిలిచాడు. తనతో ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే.. ఏం లేదు. పేషంట్ కండిషన్ గురించి మాట్లాడి.. మందులు మార్చమని చెప్పాను అని మోనిత సమాధానం చెప్పింది. అయితే నీవు నా క్యాబిన్‌కు రా.. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అంటే.. ఏమైనా విన్నాడా? అంటూ కంగారు పడింది. అయితే లోనికి వెళ్లగానే.. కూల్‌గా ఉన్నాడంటే.. ఏం వినలేదని అర్ధమైంది అంటూ లోపలికి వెళ్లింది. మోనితను చూస్తూ.. ఓ మాట అడుగుతాను.. నిజం చెబుతావా? అంటే.. పరిస్థితులు నన్ను చెడ్డదానిగా చేశాయి. నా మనసు నిండా నీవే ఉన్నావు. నేను అబద్దం చెబుతానా అంటే.. ఉపోద్ఘాతం వద్దు.. నేను ఓ విషయం అడుగతా.. నిజం చెప్పు అంటూ కార్తీక్ అన్నాడు. ఆపరేషన్ చేస్తే నీవు హాస్పిటల్ తీసేస్తానని చెప్పావు. నన్ను ఇబ్బంది పెట్టనని చెప్పావు. ఇందులో కుట్రలు, ప్లాన్స్ ఏమీ లేవు కదా అంటే.. వెంటనే కార్తీక్ కాళ్లపై మోనిత పడింది.

కార్తీక్ నీవు అవమానించినా...

కార్తీక్ నీవు అవమానించినా...

కార్తీక్ నన్ను ఎంతగా అవమానించావు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్. నా మీద ఏ మాత్రం నమ్మకం లేదా? నన్ను ఎంత అవమానించావో తెలుసా? చీకొట్టినా ప్రేమ తగ్గలేదు. నీకు ఓ పాపను కనిచ్చా. నీవు దీప దీప అని కలవరించినా.. సమాజం అంతా చీకొట్టినా నీపై ఇసుమంత ప్రేమ కూడా తగ్గలేదు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. నా ప్రేమ నీకు ఇప్పటికి అర్ధం కాలేదు అంటే భోరుమని మోనిత ఏడిస్తే.. కార్తీక్.. సారీ అంటూ ఆమెను భుజాలు పట్టుకొని లేపాడు. దాంతో ఆమె సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అయింది. నా కన్నీళ్లకు పడిపోయాడు అంటూ మనసులో ఆనందపడింది. కార్తీక్ నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను. నిన్ను ఏమీ కోరను. నీ పర్సనల్ లైఫ్‌ను నీకే వదిలేస్తాను. నా బాబాయ్‌ ప్రాణాలను కాపాడు. నా మాట మీద నిలుచుంటాను. కానీ నన్ను అవమానించావు. ప్రేమను అనుమానించావు. నా బాబాయ్‌ని బతికించు అంతకంటే ఏమీ అవసరం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బయటకు వెళ్లి ఓ కపట నవ్వును విసిరేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X