Karthika Deepam మోనితకు స్ట్రాంగ్ వార్నింగ్.. రంగంలోకి సౌందర్య

కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్, దీపను మళ్లీ కష్టాల్లో నెట్టేందుకు మోనిత కుట్రలు పన్నుతున్నది. దీపతో అమీతుమీ తేల్చుకొనేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తున్నది. బాబాయ్ గుండె ఆపరేషన్‌ను అడ్డం పెట్టుకొని కార్తీక్‌ను మరోసారి సమస్యల్లో పడేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కార్తీక్ తల్లి సౌందర్య రంగంలోకి దిగింది.. తాజా ఎపిసోడ్ 1290 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

కార్తీక్‌తో తల్లి సౌందర్య మాట్లాడుతూ.. ఎప్పుడూ లేని విధంగా మోనిత నీకు ఎందుకు హెల్ప్ చేసింది. ఆమెలో ఏదో దుర్మార్గపు ఆలోచన ఉందనే దీప అనుమానం అంటుంటడగా.. మోనిత ఫోన్ చేసింది. కార్తీక్ ఆపరేషన్ చేస్తున్నావా అంటూ.. చిరాకులో కార్తీక్ చేస్తున్నాను. నీవు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నావా అంటే.. నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను అంటూ ఫోన్ మధ్యలోనే కట్ చేయడంతో.. ఏంటీ కాల్ అలా కట్ చేశాడు. ఆపరేషన్ డేట్ టైమ్ ఎప్పుడో చెప్పకుండా ఫోన్ పెట్టేశాడు అని మోనిత అనుకొన్నది. ఫోన్ పెట్టేసిన కార్తీక్.. విన్నారుగా.. నేను మోనిత బాబాయ్‌కి ఆపరేషన్‌ చేస్తాను అని కార్తీక్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Karthika Deepam serial todays highlights:Soundarya strong waring to Monita

ఇక మోనిత వ్యవహారం గురించి కార్తీక్, సౌందర్య మధ్య హాట్ హాట్ వాగ్వాదం జరిగింది. ఆపరేషన్ చేస్తే తాను అన్నీ వదిలేస్తానని చెప్పింది. అంతేకాకుండా నా డాక్టర్ లైసెన్స్ రావడానికి కారణం ఆమె అని డాక్టర్ రవి చెప్పాడు కదా అని కార్తీక్ చెబితే.. పులి చేతిలో బంగారు కడియం పట్టుకొని మనుషులను పిలిచిన కథను మరిచిపోయావా? మోనిత అలాంటిదే. మోనిత సాయం చేసిందంటే.. ఏదో బలమైన కుట్ర ఉంటుంది. నీకు, మోనితకు దోష నివారణ పూజ చేయించాం. ఆ సమయంలో ప్రియమణితో ఫోటోలు తీయించి ఎంత రచ్చ చేసిందో తెలుసు కదా.. మోనితను నమ్మకు అంటూ కార్తీక్‌కు తల్లి సౌందర్య హితవు పలికింది.

ఇదిలా ఉంటే.. మోనితకు బుద్ది చెప్పేందుకు ప్రజా వైద్యశాలకు వెళ్లింది. బస్తీవాసుల మనసు మార్చేందుకు మోనిత ప్రయత్నిస్తుందా అంటూ కారు డ్రైవర్ వారణాసిని అడిగింది. అవును ఉచితంగా వైద్యం చేస్తున్నది. అవసరమైనప్పుడల్లా డబ్బులు ఇస్తున్నది. అందరూ మోనిత మాయలో పడుతున్నారు అని వారణాసి అంటే.. అవును బస్తీవాళ్లు మంచి వాళ్లు కదా.. మోనిత ప్లాన్స్, మాయలు వాళ్లకు తెలియదు కదా అని సౌందర్య అంటే.. అవును మేడమ్.. దీపక్క వాళ్లు కనిపించకపోతే ఎక్కడికి వెళ్లారో అని బాధపడ్డాం. కానీ దీపక్క వచ్చిన తర్వాత వాళ్లను మోనిత ఏమి చేస్తుందో అని బయపడుతున్నా. అసలు రాకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. మీరే ఏదైనా చేయండి. దీపమ్మ సంతోషంగా ఉండేందుకు మోనితకు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అని అంటుండగా.. మోనిత బాబాయ్ అక్కడికి వచ్చాడు. దాంతో మీరు వెళ్లండి.. నేను అతడితో మాట్లాడుతాను అంటూ లక్ష్మణ్, వారణాసిని అక్కడి నుంచి బయటకు పంపించింది.

Karthika Deepam serial todays highlights:Soundarya strong waring to Monita

మోనిత బాబాయ్ రాగానే.. మా అబ్బాయి కార్తీక్. ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్స్ చేసి ఎంతమందినో కాపాడారు అని సౌందర్య అనగానే.. అవును అమెరికాలో డాక్టర్లు కూడా కార్తీక్ పేరే చెప్పారు అని మోనిత బాబాయ్ అన్నారు. దాంతో మీకు ఆపరేషన్ కాగానే మోనితను తీసుకొని అమెరికాకు వెళ్లిపో అంటూ సౌందర్య ఆర్డర్ వేసింది. అంతలోనే అక్కడికి వచ్చిన మోనిత.. సౌందర్య మాటలు వింటూ షాక్ గురైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X