Don't Miss!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీతగా వంటలక్క రాముడిగా డాక్టర్ బాబు.. రామాయణ గాథతో ‘కార్తీకదీపం’ టీం
బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌ది ఓ చరిత్ర. మొన్నీమధ్యే కార్తీకదీపం ధారావాహిక వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో టీం మొత్తం సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఇక ఈ సీరియల్ కూడా ముగిసిపోతోందని అనుకునే సమయంతో అందరికీ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంకో వెయ్యి ఎపిసోడ్లకు వరకు సీరియల్‌ను సాగదీస్తారని అందరికీ తెలిసిపోయింది. మామూలుగా కార్తీక దీపం టీం బయటకు ఎక్కువగా కనిపించదు.
సోషల్ మీడియాలో హల్చల్..
కార్తీకదీపం సీరియల్, వంటలక్క దీప, డాక్టర్ బాబు కార్తీక్ పాత్రల మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బుల్లితెర, సోషల్ మీడియాలో డాక్టర్ బాబుగా నిరుపమ్, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ హవా ఓ రేంజ్లో ఉంటుంది.
స్పెషల్ ఈవెంట్లు..
కార్తీకదీపం సీరియల్ మెంబర్స్ ఎక్కువగా బయటి షోల్లో సందడి చేయరు. కానీ ఈ మధ్య మాత్రం తెగ హల్చల్ చేస్తున్నారు. గతేడాది దసరా ఈవెంట్లో వంటలక్క, డాక్టర్ బాబు మొదటి సారిగా వేరే షోల్లో కనిపించారు. అమ్మవారి వేషంలో కనిపించిన ప్రేమీ విశ్వనాథ్ అందరినీ ఆకట్టుకుంది.
ఇప్పుడు ఇలా..
అయితే అప్పుడు అమ్మవారిగా కనిపించిన ప్రేమీ విశ్వనాథ్ ఇప్పుడు సీతమ్మ వారిలా మారిపోయింది. నిరుపమ్ శ్రీరాముడిలా మారిపోయాడు. పిల్లలిద్దరూ (శౌర్య, హిమ) లవకుశులుగా మారారు. వీరంతా కలిసి బుల్లితెరపై రామాయణాన్ని అందరికీ చూపించారు.
ఉగాది స్పెషల్..
ఉగాది స్పెషల్‌గా కార్తీకదీపం ఓ నాటకం వేసింది. అందులో రాముని పాత్రలో నిరుపమ్ కనిపించగా.. సీతమ్మ వారిలా ప్రేమీ విశ్వనాథ్ కనిపించింది. శౌర్య (కృతిక), హిమ (సహృద)లు తమ కథను వివరించారు. ఇప్పుడు కార్తీకదీపం కథ కూడా రామాయణ గాథలానే మారింది. అనుమానంతో దీపను దూరంగా ఉంచడం.. పిల్లల కోసం డాక్టర్ బాబు తాపత్రయ పడటం, తల్లిదండ్రులను కలపాలని పిల్లలు ప్రయత్నించడం జరుగుతూ ఉంది.