For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam అందుకే డాక్టర్ బాబును జైల్లో పెట్టించా.. చంద్రముఖి, నీలాంబరి రేంజ్‌లో మోనిత

  |

  మోనిత హత్య కేసులో అరెస్టైన డాక్టర్ కార్తీక్‌కు సహాయం చేస్తున్న కానిస్టేబుల్ రత్నశీల వ్యవహార శైలిపై తొలి నుంచి ఏదో అనుమానాలు వ్యక్తవుతున్నాయి. లాక్‌ప్‌లో దిండు, బెడ్‌షీట్ ఇచ్చిన కానిస్టేబుల్.. తన ఇంటి నుంచి తెచ్చిన చపాతీలు, చాయ్ ఇస్తే.. నీవు నాకు ఏమౌవుతావు.. మీరు ఎవరు అంటూ అంటూ కార్తీక్ ప్రశ్నించడం తెలిసిందే. అయితే కార్తీక్ అనుమానాలకు జవాబిస్తూ నేను కానిస్టేబుల్ మాత్రమే అని సమాధానం చెప్పింది.అయితే మీరు నా మీద ఎందుకు జాలి పడుతున్నారు? అని కార్తీక్ అడిగితే.. నేను జాలి పడటం లేదు సార్... మీరు నేరం చేయలేదని నాకు అనిపిస్తున్నది. మీరు మంచి వారని విన్నాను.

  మీ హస్తవాసి మంచిదని తెలిసింది అని కానిస్టేబుల్ రత్నశీల చెప్పి కార్తీక్‌ను నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రేక్షకులకు వ్యక్తమైన అనుమానాలకు తగినట్టే డాక్టర్ మౌనితకు సమాచారం అందిస్తున్నారనే విషయం బయటకు పొక్కింది. హత్యకు గురైనట్టు భావిస్తున్న మోనితను ఊరు బయట మారుమూల ప్రాంతంలోని ఓ ఇంటిలో మోనితను పెట్టి డబ్బు తీసుకొంటూ సమాచారం అందజేయడం బయటపడింది. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్‌ 1120లో రత్నశీల, మోనిత మధ్య ఏం జరిగిందంటే..

  Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

  మోనితకు కానిస్టేబుల్ రత్నశీల సహాయం

  మోనితకు కానిస్టేబుల్ రత్నశీల సహాయం

  మోనిత ఉంటున్న ఇంట్లోకి వెళ్లిన కానిస్టేబుల్ మేడమ్ పిలువగానే.. ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది. నా కార్తీక్‌కు ఏమైంది అంటూ ఫోన్ లాగేసుకొని.. అందులోని ఫోటోలను చూస్తూ ఎలా ఉన్నావు రా అంటూ కంగారు పడిపోయింది. అంతలోనే నీవు అడిగినట్టే.. మా ఆయనకు బాగాలేదంటే మందులు రాసిచ్చాడు అంటూ చీటిని చూపించింది.

  దాంతో నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. ఎదుటి వారికి సహాయం చేస్తావా కార్తీక్ అంటూ ఓ రకమైన ఫీలింగ్‌కు మోనిత గురైంది. నీది ఎంత మంచి మనసురా.. అందుకే నీవంటే నాకు చచ్చేంత పిచ్చి.

  కానీ దీప వచ్చిన తర్వాత నుంచి మారిపోయావురా.. దానికి నా సంగతి తెలియాలని జైలులో పెట్టించాలని అనుకొన్నాను. కానీ నిన్ను ఏ మాత్రం బాధపెట్టడానికి కాదు అంటూ మోనిత తనలో తాను అనుకొంటూ పిచ్చిదానిలా బిహేవ్ చేసింది.

  Shruti Haasan హాట్ హాట్‌గా.. ముంబైలో బ్యూటీ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే!

  దీప నిన్ను వదలను అంటూ మోనిత

  దీప నిన్ను వదలను అంటూ మోనిత

  నా కార్తీక్‌కు నాకు దూరం చేసిన దీపకు నేనంటే ఏమిటో తెలియాలి. లేకపోతే నా ముందే కార్తీక్‌కు పాన్ తినిపిస్తుందా? ఇందులో నీ తప్పేమీ లేదు కార్తీక్. ఆ దీప ఏమంటుందోనని తిన్నావు గానీ.. నీ ముఖంలో సంతోషం లేదు. అది నా నుంచి దూరం చేయాలని చూసింది. కానీ నేను మాత్రం నిన్ను వదలను. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ సో మచ్ అంటూ మోనిత తన మైకంలో తాను మునిగిపోయింది.

  రత్నశీల సహాయానికి మోనిత డబ్బు

  రత్నశీల సహాయానికి మోనిత డబ్బు

  అయితే మోనిత వ్యవహారం అర్ధం కాకుండా ఉండటంతో మేడమ్ అంటూ కానిస్టేబల్ రత్నశీల పిలిచింది. దాంతో సారీ అంటూ ఆమె వైపు చూసి.. నా కార్తీక్‌ను చూడగానే ఎమోషనల్ అయ్యాను అని మోనిత అంటే.. మేడమ్ నాకు టైమ్ అయింది. నేను వెళ్తాను అంటూ రత్నశీల చెప్పింది. దాంతో ఉండు.. అంటూ వెళ్లి దిండు కింద ఉన్న డబ్బు తీసి రత్నశీల చేతిలో పెట్టింది.

  నాకు ఈ గతి పట్టించిన దీపను అంటూ..

  నాకు ఈ గతి పట్టించిన దీపను అంటూ..

  కానిస్టేబుల్ రత్నశీల వెళ్తుండగా జాగ్రత్త అంటూ మోనిత చెబుతూ.. నీవు నా మనిషి అన్నట్టు ఎవరికీ తెలియకూడదు అని చెప్పింది. దాంతో అలాగే అంటూ రత్నశీల అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కార్తీక్ రాసిన మందుల చీటీని చూస్తూ పిచ్చిదానిలా మారిపోయింది. ఒసే దీప.. నాకు ఈ గతి పట్టించిన నిన్ను వదలనే. వదలను అంటూ హిస్టీరియా వచ్చిన దానిలా గట్టిగా మోనిత అరిచింది. దాంతో ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ ముగిసింది.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  మోనిత.. చంద్రముఖి, నీలాంబరి మాదిరిగా

  మోనిత.. చంద్రముఖి, నీలాంబరి మాదిరిగా

  కార్తీక్ పేల్చిన తుపాకీ గుళ్లతో చనిపోయిందనుకొన్న మోనిత మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన మోనిత.. పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా ఉంది. చంద్రముఖి, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను తలపించే విధంగా మోనిత పాత్రను డిజైన్ చేశారనే మాట వినిపిస్తున్నది. మోనితగా శోభిత శెట్టి తన పాత్రలో జీవిస్తున్నదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

  English summary
  Karthika Deepam August 17th August's Episode preview. Latest episode of 1120 goes once again with emotional content.Karthik arrested in Monita murder case. In this occasion, Monita re enty shocks audience. Monita performance attracts all.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X