twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam అక్కా, చెల్లె బంధాలు నచ్చవు.. హిమకు షాకిచ్చిన శౌర్య

    |

    ఆటో డ్రైవర్ జ్వాలానే తన అక్క శౌర్య అని తెలుసుకొన్న హిమ సంతోషంలో మునిగి తేలింది. శౌర్య ఆచూకీ లభించడంతో హిమ ఆనందంలో మునిగిపోయింది. శౌర్య ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎప్పుడూ మౌనంగా బాధతో కనిపించే హిమ మఖం ఆనందంతో వెలిగిపోయింది. తమ చిన్ననాటి ఫోటో పట్టుకొని నువ్వేమో నేను శత్రువు అని అంటున్నావు. కానీ నీవంటే నాకు ఇష్టం. నేను ఎవరో తెలియకుండానే నాకు అన్నం తినిపించావు. నీవేవరో తెలిసిన తర్వాత ఇంటికి బ్రహ్మండంగా ఆహ్వానిస్తారు. అప్పుడు నన్ను ఎంతగా ప్రేమిస్తావో తెలుసా? అంటూ నీ తింగరి అంటూ బెడ్‌పై గెంతులు వేసింది. ఇంకా కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1324లో ఏం జరిగిందంటే?

    ముసలి తింగరి అంటూ..

    ముసలి తింగరి అంటూ..

    హిమ ఎగరడం చూసి ఏంటి అని సౌందర్య అడిగితే.. శౌర్య ఫోటోతో మాట్లాడుతున్నాను అని హిమ చెప్పింది. అయితే హిమ చలాకీతనం చూసి సౌందర్య ఆశ్చర్యపోయింది. ముసలి తింగరి అంటూ తన నాన్నమ్మ ఆటపట్టించింది. అయితే ఈ ఆనందానికి కారణమేమిటి అంటే.. కారణాలు అడగకూడదు.. ఆనందించాలే అంటూ నాన్నమ్మకు చెప్పి గెంతులు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. హిమ ఆనందం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు పట్టక సౌందర్య ఆశ్చర్యపోయింది.

    హిమ వల్లే జీవితాల్లో విషాదం

    హిమ వల్లే జీవితాల్లో విషాదం

    తమ ఇంటికి రావడంతో ఆనందరావును డాక్టర్ నిరుపమ్ పలకరించాడు. ఆనందరావు తన చేయి ఇచ్చి చూడమన్నారు. ఏంటి చేయి ఇస్తున్నావు అంటే.. డాక్టర్ కాదా ఓ సారి పల్స్ చూడమని అడిగా అంటూ ఆనందరావు చెప్పాడు. అయితే హిమ చలాకీగా ఉండటంపై ఆనందరావు, నిరుపమ్ చర్చించుకొన్నారు. హిమలో ఆనందానికి కారణం ఏమిటి అంటే.. దానికి కారణం ఓ వ్యక్తి ఉందిలే.

    దానిని సమయం వచ్చినప్పుడు చెబుతా అని అంటే.. హిమ ఆనందం గురించి చర్చించుకొంటున్న సమయంలో కూతురు స్వప్న వచ్చి.. హిమ వల్లే అందరి జీవితాల్లో విషాదం నిండింది. అలాంటి హిమ వల్ల శౌర్యకు కూడా సంతోషం లేకుండా పోతుంది అంటూ స్వప్న సీరియస్‌గా కామెంట్ చేసింది.

    దీపను కార్తీక్ దూరం పెట్టినా

    దీపను కార్తీక్ దూరం పెట్టినా

    కూతురుతో పంతం గురించి ఆనందరావు మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. స్వప్న కొంత విసుగు తెచ్చుకొన్నది. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిందేదో జరుగుతుంది. మనషులను, మనసులను మార్చాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరగదు. నీ అల్లుడు, అమ్మ మీద నా అభిప్రాయం మారదు అని స్వప్న తెగేసి చెప్పింది.

    అయితే దీపను కార్తీక్ దూరం పెట్టినా.. తన ప్రేమను తగ్గించుకోలేదు అంటే.. అందరూ దీపలా ఉండలేరని తండ్రి ఆనందరావుతో స్వప్న ఘాటుగా స్పందించింది. నీవు చెప్పినట్టే నేను కూడా చాలా ఉదాహరణలు చెబుతాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. మీ అల్లుడు మీకు మంచివాడనిపిస్తే.. వెళ్లి సన్మానం చేయండి. కానీ అతడి గురించి చెప్పకండి అంటూ స్వప్న విసురుగా వెళ్లిపోయింది.

    హిమ, శౌర్య ఒకే ఫ్రేమ్‌లో

    హిమ, శౌర్య ఒకే ఫ్రేమ్‌లో

    రవ్వ ఇడ్లీ నడిపే హోటల్ వద్ద ఉన్న శౌర్య వద్దకు నిరుపమ్, హిమ వచ్చారు. ఏమిటి మీరు ఇక్కడికి వచ్చారు అని శౌర్య అడిగితే.. నీతో పని ఉండి వచ్చాం. నీ సహాయం కొంత కావాలి. నీవు తింగరికి కాస్త తోడుగా ఉంటే.. ధైర్యం పెరుగుతుంది అంటూ హిమ, శౌర్య చేతులు నిరుపమ్ కలిపాడు. దాంతో హిమ, శౌర్య ఎమోషనల్ అయ్యారు.

    ఇక నుంచి హిమలో కొత్త తింగరిని చూపిస్తాను. నన్ను మించిపోయేలా తింగరిని తయారు చేస్తాను. తింగరిని టోటల్‌గా మార్చేస్తాను అని శౌర్య అంటే.. థ్యాంక్యూ అని నిరుపమ్ అన్నాడు. దీనికి థ్యాంక్యూ అని చెప్పడం ఎందుకని అంది. అయితే పక్కనే ఉన్న రవ్వ ఇడ్లీ మాట్లాడుతూ.. హిమ నీ డాక్టర్ కోటు ఇస్తే వేసుకొంటాను అని అడిగాడు. ఆ కోటు వేసుకొని జ్వాలా, హిమతో కలిసి ఫోటో దిగాడు. ఆ తర్వాత హిమ, శౌర్య కలిసి ఫోటో దిగి ఆనందంలో మునిగిపోయారు.

    బంధాలు, అనుబంధాలు నచ్చవు అంటూ

    బంధాలు, అనుబంధాలు నచ్చవు అంటూ

    ఆ తర్వాత శౌర్య, హిమ ఒకే ఆటోలో ప్రయాణించారు. శౌర్య ఆటో నడుపుతుంటే.. హిమ వెనుక సీట్లో కూర్చొని రకరకాలు ఆలోచించింది. జ్వాలా అంటూ పిలిచి.. జ్వాలా మంచి పేరు. నీ పేరును అమ్మ, నాన్నలు పెట్టారా అని హిమ అడిగితే.. వెంటనే ఆటో ఆపేసి.. సీరియస్ అయింది. నా అమ్మ, నాన్నల గురించి మాటెత్తకు అని శౌర్య అంటే.. మనం ఫ్రెండ్స్ కదా.. నాకు చెప్పవా? అంటే.. ఇక అలాంటి మాటలు నావద్ద మాట్లాడకు అంటూ ఆటో స్టార్ట్ చేసింది.

    అయితే జ్వాలాతో మాట్లాడుతూ.. నీవు నన్ను చెల్లెలు అనుకో అని అనగానే.. వెంటనే ఆటో సడన్ బ్రేక్ వేసింది. నాకు బంధాలు, అనుబంధాలు.. అక్కా, చెల్లెలు అనే పదాలు నచ్చవు. డాక్టర్ సాబ్ చెప్పడాని నీతో ఉంటున్నాను. ఇంకోసారి నాతో ఇలాంటి ప్రశ్నలు అడగకు. ఇదే పరిస్థితిలో వేరే వాళ్లు ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది అని శౌర్య ఆటో వేసుకొని.. హిమను అక్కడే వదిలేసి వెళ్లింది. దాంతో నీవు ఎంతదూరం ఉన్నా.. నీ దగ్గరగా వస్తాను. నీవు ఎంత కోపగించుకొన్నా.. నేను నీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తా అని హిమ మనసులో అనుకొన్నది.

    లేటేస్ట్ ప్రోమోలో మరో ట్విస్టు

    లేటేస్ట్ ప్రోమోలో మరో ట్విస్టు

    తాజా ప్రోమోలో శౌర్య ఆటోను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. నీ లైసెన్స్ గడువు ముగిసింది. రెన్యువల్ చేయించుకోవాలి కదా.. అంటే చూసుకోలేదు సార్ అని శౌర్య అంటే.. అంతలోనే పక్కనే ఉన్న ప్రేమ్.. ఏయ్ ఎక్స్‌ట్రా నీ తిక్క కుదిరిందా? ఆటోను అసలే వదలొద్దు అన్నాడు. ఏయ్ ఎక్స్‌ట్రా.. ఇక ఆపుతావా అని శౌర్య అంటే.. దేవుడా నీవు ఉన్నావయ్యా అంటూ ప్రేమ్ మరింత రెచ్చగొట్టాడు. అయితే శౌర్య ఆటోను నడుపుకుంటూ వెళ్తుంటే తల్లి స్వప్న చూసి.. నువ్వేంటిరా ఆటో నడుపుతున్నావు అంటూ షాక్ అయింది. ప్రేమ్ బైక్‌పై శౌర్య, హిమ ఇద్దరు ట్రావెల్ అవుతూ కనిపించారు.

    13వ వారంలో కార్తీకదీపం రేటింగ్

    13వ వారంలో కార్తీకదీపం రేటింగ్

    ఇక కార్తీకదీపం సీరియల్ తెలుగు బుల్లితెరపై తన టాప్ రేటింగ్‌ను కొనసాగిస్తూనే ఉంది. గతవారం ప్రకటించిన రేటింగ్‌లో టాప్ టీఆర్పీని అందుకొన్నది. ఈ ఏడాది 13వ వారంలో ఈ సీరియల్ అర్బన్‌లో 12.61 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇక రూరల్‌లో 13వ వారంలో 10.24 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.

    English summary
    Karthika Deepam April 12th Episode number 1324
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X