Karthika Deepam వంటలక్కపై విషప్రయోగం.. కుట్రను బయటపెట్టిన డాక్టర్ బాబు.. చేసింది ఎవరంటే!
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రేక్షకాదరణతో సాగుతున్న కార్తీకదీపం సీరియల్ భావోద్వేగాలతో ముందుకు సాగుతున్నది. గత పదేళ్లుగా దూరంగా ఉన్న దీప, డాక్టర్ కార్తీక్ ఇద్దరూ ఒక్కటి కావడం ఇరు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. అయితే దీప ఆరోగ్యం విషయంలో బయటపడిన ఓ కుట్ర ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసింది. ఆ కుట్ర వివరాల్లోకి వెళితే..

దీప ఆరోగ్యంపై కార్తీక్ దృష్టి
దీప అలియాస్ వంటలక్క ఆరోగ్యం క్షీణిస్తున్న విషయాన్ని తెలుసుకొన్న డాక్టర్ కార్తీక్ ఆమెను విజయనగరం నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం దీపకు వైద్యం చేయించాలని నిర్ణయం తీసుకొన్నారు. అలాగే మందులు వాడనని చెప్పిన దీపను మెడిసిన్స్ వాడేలా చేయడంలో సఫలమయ్యారు. దీప కోసం కార్తీక్ కూడా తన మనసును మార్చుకొనేందుకు సిద్ధమయ్యారు.

తల్లిదండ్రులను చూసి సంతోషంలో పిల్లలు
దీప ఇంటిలోకి అడుగపెట్టిన తర్వాత కుటుంబంలో ఆనందోత్సావాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు కలిసి ఉండటాన్ని చూసిన పిల్లలు ఇద్దరికి కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల మధ్య కలిసి భోజనం చేయడం వారి మధ్య సహృదయ, సంబంధాలకు అద్దం పట్టాయి.

భావోద్వేగానికి గురైన వంటలక్క
డాక్టర్ కార్తీక్ కుటుంబంలో నెలకొన్న ఆనంద క్షణాల మధ్య దీప మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. మేడ మీద భోజనం చేస్తున్న సమయంలో తండ్రి ఎక్కడ అని పిల్లలు అడిగిన విషయాలను గుర్తు చేసుకొని దీప కంటతడి పెట్టింది. నాన్న ఎప్పుడొస్తారని అడిగిన ప్రతీసారి తాను పడిన బాధను చెప్పుకొని భోరున విలపించింది. దాంతో ఇప్పుడు పిల్లలను మళ్లీ బాధపెట్టడం ఎందుకని డాక్టర్ కార్తీక్ సముదాయించారు.

మోనితపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
దీప, కార్తీక్, శౌర్య, హిమల మధ్య అనుబంధాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. దీప, కార్తీక మధ్య ఏర్పడిన విభేదాలకు మోనిత కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీప, కార్తీక్ మధ్య మళ్లీ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించకుండా చర్యలు తీసుకోవాలని అత్తమ్మ సౌందర్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలా భావోద్వేగాలతో సాగుతున్న ఈ సీరియల్‌లో మరో భారీ ట్విస్టుకు తెరలేపారు.
Recommended Video

దీపపై విష ప్రయోగం అంటూ..
మోనితతో కార్తీక్ మాట్లాడుతూ.. నేను ఇటీవల డాక్టర్‌ను కలిశాను. ఆ సమయంలో దీపపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చనే విషయాన్ని డాక్టర్ ప్రస్తావించారు. అలాంటి కుట్రకు ఎవరు పాల్పడి ఉంటారనే అనుమానాన్ని డాక్టర్ కార్తీక్ వ్యక్తం చేశారు. ప్రసవం సమయంలో తాను విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చిన విషయం బయటపడుతుందా అనే భయంలో మోనిత ఉండిపోయింది. ఇలాంటి ట్విస్టుతో కార్తీక దీపం సీరియల్‌ను యూనిట్ సభ్యులు మరో మలుపు తిప్పారు.


Click it and Unblock the Notifications











