నువ్వే నరకం చూపిస్తాన్నావు.. వంటలక్కపై భగ్గుమన్న డాక్టర్ కార్తీక్.. నలిగిపోతున్న అత్త సౌందర్య!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘంగా సాగుతున్న కార్తీక దీపంలో రోజు రోజుకు భావోద్వేగాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు మోనిత కుట్రలు, మరోవైపు దీపను కాపాడుకొనేందుకు భర్త కార్తీక్, అత్త సౌందర్య ఆరాటాలు ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురిచేస్తున్నాయి. దీంతో తాజా ఎపిసోడ్ భావోద్వేగాలతో మరింత రచ్చగా మారింది. 1031 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

దీప ఎంతో కాలం బతకదని..
వేడికి దగ్గరగా ఉండటం, ఎండలో తిరగడం, లేదా వంటగదిలో ఎక్కువగా ఉండటం వల్ల దీప ఎక్కువ రోజులు బతకదని చెప్పిన విషయాలతో డాక్టర్ కార్తీక్, అత్త సౌందర్యలో ఆందోళన పెరిగిపోయింది. తన ఆరోగ్యం ఎంత దారుణంగా ఉంటుందనే విషయం తెలియక దీప వంటగదిలోకి దూరి వంటలు చేయడం మొదలుపెట్టింది. దాంతో దీపపై కార్తీక్ భగ్గుమన్నారు.

డబ్బావాలాల మాదిరిగా టిఫిన్లు పంపించమను
దీప అలియాస్ వంటలక్క మొండిగా వ్యవహరించడంపై డాక్టర్ కార్తీక్ ఘాటుగా స్పందించారు. దీపను ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పు మమ్మీ. టిఫిన్లే కాకుండా లంచ్, డిన్నర్ అన్నీ చేయమను. ఇంకా తృప్తి తీరకపోతే.. టిఫిన్ బాక్సులు కొనిస్తా.. డబ్బావాలా మాదిరిగా ఆఫీసుల్లో వేయమని చెప్పు అంటూ కార్తీక్ ఘాటుగా స్పందించారు. డైనింగ్ టేబుల్ వద్ద కార్తీక్ అలా అనడంతో ఇంటి సభ్యులందరూ బిత్తరపోయారు.

నరకం నీవే చూపిస్తున్నావంటూ..
కార్తీక్ మాటలకు సమాధానం ఇస్తూ.. నేనంటే ఆయనకు ఇష్టం లేదు. అంత మాత్రాన ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నేనంటే గిట్టడం లేదు. ఎందుకు నరకం చూపిస్తున్నారు అంటూ దీప ఆవేశంగా తన వాదనను వినిపించారు. అయితే దీప మాటలకు అడ్డుపడుతూ.. ఆపు ఇక నీ మాటలు.. నరకం నేను చూపిచడం లేదు. నీవే చూపిస్తున్నావు. నీ పంతమే నిన్ను.. నిన్ను అంటూ తన ఆవేదనను బయటపెట్టేందుకు ప్రయత్నించగా.. తల్లి సౌందర్య అడ్డుపడ్డారు.

దీపతో గొడవ పడకురా అంటూ
కార్తీక్ మాటలకు సౌందర్య అడ్డుపడుతూ.. ఏంటీరా.. అలా మాట్లాడుతున్నావు. వద్దురా.. దానితో గొడవ పడుతావేంటిరా? అంటూ నిలదీసింది. అయితే తల్లి మాటలకు శాంతించిన కార్తీక్.. తనకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పండి అంటూ కార్తీక్ చెప్పగానే ఇంటి సభ్యులందరూ షాక్ గురయ్యారు.
Recommended Video

వంట చేసుకో.. మందులు మింగు అంటూ..
తన కుటుంబ సభ్యులు షాక్‌లో ఉండటం చూసి మళ్లీ కార్తీక్ మళ్లీ టాపిక్‌ను లేవదీస్తూ.. నాకు ఇక అవసరం లేదు. వంట చేసుకోమను.. మందులు మింగమను. నేను మాత్రం దాని చేతి వంట తినను. నేను తినకుండా ఎన్ని వంటలు చేస్తే ఏం లాభం అంటూ డైనింగ్ టేబుల్ వద్ద నుంచి విసవిస వెళ్లిపోయారు దాంతో కార్తీక్ తండ్రి, సోదరుడు, మరదలు ఇంట్లో ఏం జరుగుతందనే విషయం తెలియక తికమకకు గురయ్యారు.


Click it and Unblock the Notifications











