ఇంటిని, భర్త, పిల్లల్ని వదిలి వెళ్లిన వంటలక్క.. కార్తీక దీపంలో దీప మరో షాకింగ్ ట్విస్టు!

కార్తీకదీపం సీరియల్‌లో ప్రతీ ఎపిసోడ్‌లో ఏదో కొత్త ట్విస్టును ప్రేక్షకులకు పంచుతూ ఎమోషనల్‌గా సాగిపోతున్నది. తాజా ఎపిసోడ్ 1033లో భార్య దీప, భర్త కార్తీక్, అత్త సౌందర్య మధ్య భారీ వాగ్వాదమే చోటు చేసుకొన్నది. వంటకు దూరంగా పెట్టాలన్న కార్తీక్, సౌందర్య ప్లాన్ ఫలించకపోగా.. దీప మరింత బెట్టు చేయడం ఈ వాగ్వాదానికి కారణమైంది. తాజా ఎపిసోడ్‌లో జరిగిన విషయాల్లోకి వెళితే..

సహనం కోల్పోయిన కార్తీక్

సహనం కోల్పోయిన కార్తీక్

వంటగదిలో దూరిన దీపను చూసిన కార్తీక్‌ ఒక్కసారిగా సహనంగా కోల్పోయారు. ఇక సామ్రాజ్యాన్ని ఏలడం తప్ప మరోపని లేదా? ఇంట్లో ఏం జరుగుతున్నది మమ్మీ అంటూ కార్తీక్ నిలదీశాడు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక నలిగిపోతున్నానురా అంటూ సౌందర్య సమాధానం ఇచ్చింది. అయితే నీ మనవరాళ్లకి తల్లి అవసరం లేదంటే అలాగే వదిలేయ్ మమ్మీ అంటూ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నా.. సౌందర్య

మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నా.. సౌందర్య

నీకు ఆవేదనకు, ఆమె మొండితనానికి మధ్య నేను ఎంతగా నలిగిపోతున్నానో నీకు తెలుసా కార్తీక్ అంటూ సౌందర్య ఎమోషనల్ అయ్యారు. టీ కప్పులతో అక్కడి వచ్చిన దీపను కషాయం తెచ్చావా? అంటూ కార్తీక్ అడిగితే.. కాఫీ అంటూ బదులిచ్చింది. అంతటితో ఆగకుండా మీకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను.. తిని వెళ్లండి.. మధ్యాహ్నం బాక్సుల పట్టుకొని మీ హాస్పిటల్‌కు వస్తే బాగుండదేమో అంటూ దీప అల చెప్పుకుంటూ పోతుంటే.. కార్తీక్ అసహనంతో ఊగిపోయారు.

ఇంట్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందా?

ఇంట్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందా?

మమ్మీ ఇంట్లో ఏం జరుగున్నది? ఇంట్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుందా? అంటూ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సౌందర్య సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో ఏదైనా చెప్పాలనుకొంటే డైరెక్టుగా నాతో చెప్పమని చెప్పండి అత్తగారు అంటూ దీప ఘాటుగా సమాధానం ఇచ్చింది. వాడు వద్దన్న పనిని ఇలా పంతంతో చేయడం సబబేనా? మొండితనంతో ఇలా చేయడం కరెక్టేనా అంటూ అత్త సౌందర్య ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేసింది.

రోగిష్టి పేరుతో పనికిరాని వస్తువులా..

రోగిష్టి పేరుతో పనికిరాని వస్తువులా..

ఇష్టపడని భర్తతో సర్దుపోవడం ఎలా అత్తయ్య గారు.. పాత సామాన్ల మాదిరిగా ఓ గదిలో వేసినా సర్దుకుపోతున్నాను. అనారోగ్యం పేరుతో రోగిష్టిలా అందరి దృష్టిలో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వంటపనికి, ఇంటి పనికి దూరం పెట్టి భార్యగా చేయాల్సిన ఏ పనిని చేయనివ్వకుండా ఓ పనికిరాని వస్తువులా పడి ఉండమన్నా నేను సర్దుకుపోతున్నాను అంటూ దీప గట్టిగా బదులిచ్చారు.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
ఈ ఇంట్లో దిక్కుమాలిన కోడలిగా

ఈ ఇంట్లో దిక్కుమాలిన కోడలిగా

ఏ బంధం లేదనే కాదా.. నేను ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎవరికి సంబంధం లేకుండా విజయనగరంలో బతుకుతుంటే.. పిల్లలకు ఆయా కావాలని.. ఇంటికి దిక్కుమాలిన కోడలను తీసుకొచ్చారు అని దీప అంటే.. నీవు అందరిని అపార్థం చేసుకొంటున్నావు.. ప్రతీ ఒక్కరిని శత్రువులా చూస్తున్నావు. కొద్ది రోజులు ఓపిక పడితే అంతా సర్దుకుపోతుంది అని సౌందర్య సర్దిచెప్పింది. అయితే తదుపరి ఎపిసోడ్‌లో దీప ఇంటిని వదిలిపెట్టి మళ్లీ తన పాత ఇంటికి వెళ్లడం షాకింగ్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X