దేవుడు దగా చేశాడు.. శాశ్వతంగా దూరమవుతున్నా.. నిన్ను ఓదార్చేది ఎవరు?.. తండ్రితో దీప భావోద్వేగం
అత్తారింటి నుంచి దీప ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంపై తండ్రి ఆందోళనకు లోనవుతూ కనిపించారు. దీపపై బెంగతో విపరీతంగా మద్యం సేవించడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి దీపకు సంబంధించిన పీడకల రావడంతో బెంబేలు పడిపోయాడు. హఠాత్తున బెడ్‌పై నుంచి లేచి దీప గురించి మరింత కంగారు పడిపోయారు. అనంతరం దీప, తండ్రి మధ్య సంభాషణ ఎలా ఎమోషనల్‌గా సాగిందంటే..
Recommended Video

దీపకు తల్లిదండ్రుల ఫోన్ కాల్
దీప ఫోన్‌కు కాల్ చేయగానే కార్తీక్ ఎత్తి సమాధానం చెప్పారు. దీప వద్దే తాను ఉన్నారనే విషయాన్ని వెల్లడించారు. శ్రీరాంనగర్ బస్తీలోని ఇంటిలోనే క్షేమంగా ఉంది అంటూ చెప్పారు. దాంతో ఓసారి తనతో మాట్లాడాలని ఉందని దీప తండ్రి అడిగారు. అలా ఫోన్ దీపకు ఇస్తూ.. బాగానే ఉన్నానని చెప్పు అంటూ కార్తీక్ అన్నారు.

దేవుడు దగా చేశాడు..
దీపతో తండ్రి మాట్లాడుతూ.. నీవు ఎక్కడికి వెళ్లావనని భయపడ్డాను అమ్మా.. నీవు దగా పడ్డావు కదా అమ్మా.. అంటూ అవును నాన్న అంటూ దీప తెలిపింది. ఈ దేవుడే కాదు.. ఆ దేవుడు దగా చేశాడు అంటూ దీప సమాధానం చెప్పారు. కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందకమ్మా.. నీ కోసం ఇప్పుడూ నీ పుట్టిల్లు ఉంటుందనే విషయాన్ని చెప్పాను కదా. మన ఇంటికి రాకూడదా అంటూ దీప తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నుంచి అంతా ప్రశాంతతే...
అయితే దీప తన తండ్రి మాటలకు సమాధానం ఇస్తూ.. ఎవరికీ భారం కాకూడదనే ఇక్కడికి వచ్చాను నాన్న అని అన్నారు. దాంతో ఈ రాత్రి పూట ఇలాంటి మాటలు ఎందుకు.. ప్రశాంతంగా పడుకో అమ్మా అంటూ తండ్రి అంటే.. ఇక నుంచి అంతా ప్రశాంతతే నాన్న అని సమాధానం ఇచ్చింది. అందుకు చాలా సంతోషం తల్లి.. నీవు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అంటూ తండ్రి అన్నారు.

మొత్తానికే కనిపించకుండా...
దీప క్షేమంగా ఉందని తెలిసి తండ్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. నీవు కనిపించడం లేదని తెలిసినప్పటి నుంచి గుండెల్లో మంటగా ఉంది అంటూ తండ్రి అన్నారు. దానికి దీప తన మనసులోనే .. మొత్తానికే కనిపించకుండా పోతున్నాను నాన్న.. అప్పుడు ఏమై పోతావో నాన్న.. అప్పుడు నిన్ను ఎవరు ఓదార్చుతారు నాన్న అంటూ కన్నీరుమున్నీరైంది.

డాక్టర్ బాబు ఉన్నాడు.. ఇంకా ఏం భయం లేదు..
దీప, ఆమె తండ్రి ఒకరికొకరు కన్నీళ్లు పెట్టుకొంటున్నారని చూసి... మీ నాన్నను ఏడవకుండా ఉండమని చెప్పడానికి ఫోన్ ఇచ్చాను. ఏడిపించడానికి కాదు అంటూ కార్తీక్ అన్నారు. దాంతో నాన్న ఏడవకు.. ప్రశాంతంగా నిద్రపో అంటూ దీప చెప్పింది. దానికి నీవు కూడా ఎలాంటి కలతలు, కలలు లేకుండా నిద్రపో అని తండ్రి చెప్పాడు. నాతో డాక్టర్ బాబు ఉన్నాడు కదా.. ఇక ఏం భయం లేదు... నేను ఉన్నంతకాలం మీకు కనిపిస్తూనే ఉంటాను అంటూ దీప ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











