కార్తికేయ 2, సీతారామం ఫస్ట్ టైమ్ టీఆర్పీ.. ప్రభాస్ సినిమా కంటే ఎక్కువే..
టిఆర్పి రేటింగ్ అనేది కూడా ఇప్పుడు సినిమాలకు చాలా ప్రత్యేకంగా మారింది. ఒకప్పుడు సినిమాలకు కేవలం థియేట్రికల్ బిజినెస్ అనేది చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు మాత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా సినిమాలకు చాలా లాభదాయకం. కాబట్టే కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు థియేట్రికల్ గా సక్సెస్ అయినంత ఓటీపీ శాటిలైట్ ప్లాట్ ఫామ్ లో మాత్రం సక్సెస్ కావడం లేదు.
ఇక ఇటీవల వచ్చిన కార్తికేయ 2 అలాగే సీతారామం సినిమాలు డీసెంట్ రేటింగ్స్ అయితే అందుకున్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రభాస్ సినిమా కంటే ఎక్కువ స్థాయిలో రేటింగ్స్ రావడం విశేషం. నిఖిల్ సిద్దార్థ్ నటించినా కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీకృష్ణ మిస్టరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది.

పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో ప్రాఫిట్ అందించిన ఈ సినిమా జీ తెలుగులో ఇటీవల మొదటిసారి టెలిక్యాస్ట్ చేశారు. ఇక ఫస్ట్ టైం 7.88 టిఆర్పి వచ్చింది. ఇక అక్టోబర్లో విడుదలైన మరొక సినిమా సీతారామం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విషయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రెండు వారాల తర్వాత కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోటికి పైగా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయితే ఇటీవల సీతారామం సినిమా టెలివిజన్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. ఇటీవల స్టార్ మా లో టెలికాస్ట్ అయినా ఈ సినిమా 8.73 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్ రాదేశ్యామ్ సినిమా జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 8.25 రేటింగ్ మాత్రమే అందుకుంది. ఒక విధంగా పాన్ ఇండియా హీరో కంటే ఎక్కువ స్థాయిలో సీతారామం సినిమాకు ఎక్కువ రేటింగ్ రావడం విశేషం. ఇక నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా మొదటిసారి జెమినీ టీవీలో టెలికాస్ట్ కాగా దానికి కేవలం 3.41 రేటింగ్ మాత్రమే వచ్చింది.


Click it and Unblock the Notifications











