కార్తికదీపం సీక్వెల్ - టీవీ సీరియల్ హిస్టరీలోనే తొలిసారి అలా చేయనున్న మేకర్స్!
బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వంటలక్క, డాక్టర్ బాబు రాక సమయం ఆసన్నమైపోయింది. అది కూడా టీవీ తెరపై సంచలనం విజయం సాధించిన కార్తీక దీపం సీరియల్‌కు సీక్వెల్‌గా వస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని నేరుగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు మేకర్స్. దీని కోసం టీవీ సీరియల్ చరిత్రలో ఎవరూ చేయని విధంగా తొలిసారి అలా చేయబోతున్నారు. దాని గురించి పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
కార్తీక ద్వీపం నవవసంతం అంటూ వంటలక్క - డాక్టర్ బాబు మళ్లీ వస్తుండటంతో బుల్లితెర మహిళ ఆడియెన్స్ అంతా అలర్ట్ అయిపోతున్నారు. అమ్మలు, అత్తలు, కోడళ్లు, ఆడపడుచులు అంతా సీరియల్‌ను వీక్షించేందుకు సిద్ధమైపోతున్నారు. సాయంత్ర 8 గంటల కల్లా అన్ని పనులు పూర్తి చేసేసుకుని తీరిగ్గా వంటలక్క - డాక్టర్ బాబు బంధాన్ని చూసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మేకర్స్ కూడా వాళ్లలో మరింత ఆసక్తిని పెంచేందుకు ప్రమోషన్స్‌లో ఇంకాస్త జోరు పెంచారు. వరుసగా ఇప్పటికే ప్రోమోలను వదిలారు. ఇతర ధారావాహికలకు షాకిస్తూ కార్తీక దీపం సీరియల్ ప్రసార టైమింగ్స్‌ను కూడా చెప్పేశారు.

అయితే ఇప్పుడీ సీరియల్ మేకర్స్ ఓ సరికొత్త ప్లాన్ చేయబోతున్నారు. వంటలక్క డాక్టర్‌బాబును నేరుగా చూసేందుకు అవకాశం కల్పించేందుకు సన్నాహాలు శారు. అదేంటంటే ఇప్పటికీ సినిమాల విషయంలో మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లను చూశాం. సినిమా స్థాయి, అందులో నటించే వారి ఇమేజ్ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తుంటారు నిర్మాతలు. అయితే ఇప్పుడు తొలిసారి ఓ సీరియల్‌కు కూడా ఇలా చేయబోతున్నారు. అదే కార్తీక ద్వీపం సెకండ్ పార్ట్‌కు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
అవును మీరు చదివింది నిజమే. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. ప్రతిఒక్కరూ ఆహ్వానితులే అంటూ ప్రకటించారు. మార్చి 21 గురువారం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెం.2, ఎల్ వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ పక్కన ఉన్న ప్రసాద్ లాబ్స్ వేదికగా జరపనున్నారు. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న సీరియల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేస్తున్నారు.

ఇకపోతే టెలికాస్ట్ టైమింగ్ విషయంలో ఇతర సీరియల్స్‌కు షాకిచ్చిన ఈ కార్తిక దీపం నవవసంతం రేటింగ్ విషయంలోనూ షాకింగ్ ఇస్తుందేమో చూడాలి. గతంలో మాదిరిగా ఇతర సీరియల్స్ స్థానానికి ఎసరుపెడుతుందా? ప్రేమి విశ్వనాథ్, నిరూపమ్ కెమిస్ట్రీకి బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎందుకంటే పేరుకు సీక్వెల్ అనేగానీ కొత్త కథలో రాబోతుంది. కేవలం వంటలక్క డాక్టర్ బాబు పాత్రలు మాత్రమే కొత్తవి. మిగతా వారంతా కూడా కొత్తవాళ్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











