బిగ్‌బాస్‌లోకి కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్.. ఇంట్లో RX 100 జంట సందడి
బిగ్‌బాస్ ఇంటిలోకి దసరా పండుగ సందర్భంగా ఇద్దరు సెలబ్రిటీలు అడుగుపెట్టనున్నారు. నాగార్జున ఈ వారాంతం షూట్‌కు గైర్హాజరు కావడంతో ఆయన స్థానంలో అక్కినేని కోడలు సమంత వేదికపైకి రానున్నారు. ఈ క్రమంలోనే RX 100తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న కార్తికేయ గుమ్మకొండ, పాయల్ రాజ్‌పుత్ ఏడో వారాంతంలో సందడి చేయనున్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ విషయానికి వస్తే...

వీకెండ్ సెలబ్రేషన్‌లో కార్తీకేయ
ఇటీవల కాలంలో సినీ అవార్డులు, ప్రత్యేక వేడుకల వేదికపై డ్యాన్సులతో ఉర్రూతలూగిస్తున్న కార్తికేయ మరోసారి తన ప్రతిభను చాటుకొనేందుకు బిగ్‌బాస్ తెలుగు 4ను వేదిక చేసుకొన్నాడు. కార్తీకేయకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు గత పది రోజుల క్రితమే ఆయనను దసరాతోపాటు వీకెండ్ సెలబ్రేషన్‌లో పాలుపంచుకోవాలని కోరగా, అందుకు సిద్ధమయ్యారు.

8 నిమిషాలపాటు డ్యాన్స్ షో
శనివారం జరిగబోయే ఎపిసోడ్ ఆరంభంలో కార్తికేయ వేదికపైకి రానున్నారు. దాదాపు 8 నిమిషాలపాటు వేదికపై తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌ను ఇవ్వనున్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్ సెలబ్రిటీలతో కార్తీకేయ ముచ్చటిస్తారు. అనంతరం కార్తికేయ దసరా శుభాకాంక్షలు చెప్పి షోను నుంచి నిష్క్రమిస్తారు అని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

పాయల్ రాజ్‌పుత్ సందడి
ఇక కార్తికేయతోపాటు RX 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ కూడా బిగ్‌బాస్ సెలబ్రిటీలకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. బిగ్‌బాస్ వేదికపై పాయల్ రాజ్‌పుత్ తన గ్లామర్ పంట పండించేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఏ రేంజ్‌లో పాయల్ రాజ్‌పుత్ బిగ్‌బాస్‌లో సందడి చేస్తారో వేచి చూడాల్సిందే.
Recommended Video

ఏడోవారంలో ఎలిమినేషన్
దసరా పండుగ వేడుకల నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు షోలో ప్రస్తుత వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదనే విషయం స్పష్టమవుతున్నది. ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయకుండా వచ్చే వారం కూడా కొనసాగిస్తారని, ఎనిమిదో వారానికి డబుల్ నామినేషన్‌తో బ్యాలెన్స్ చేస్తారనే మాట వినిపిస్తున్నది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియను ఎలా బ్యాలెన్స్ చేస్తారనే విషయం ఇప్పుడు ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











