బిగ్‌బాస్ వేదికపై కార్తికేయ ఫెర్ఫార్మెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా.. సినీ వర్గాల ప్రశంసలు
దసరా పండుగ సందర్భంగా ప్రసారమైన బిగ్‌బాస్ తెలుగు మహా ఎపిసోడ్‌పై మంచి రెస్సాన్స్ వస్తున్నది. వేదికపైకి యువ హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, కమెడియన్ హైపర్ ఆది లాంటి వారు ప్రేక్షకులను తమ పెర్పార్మెన్స్‌తో రంజింప చేశారు.
ఇటీవల కాలంలో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో మెగాస్టార్ చిరంజీవిని ఆకట్టుకొని.. ప్రశంసలు అందుకొన్న హీరో కార్తికేయ మరోసారి వేదికపై సత్తా చాటారు. సమంత హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోలో కార్తికేయ తన డ్యాన్స్ ఫెర్ఫార్మ్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. ఐదు మెలోడి పాటలపై ఆయన వేసిన స్టెప్పులకు సినీ, ప్రేక్షక వర్గాలపై మంచి ప్రశంసలు అందాయని హీరో కార్తికేయ తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు బిగ్‌బాస్ షో వేదికపై పెర్ఫార్మ్ చేసే అవకాశం లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నా డ్యాన్స్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు ఫోన్ చేసి అభినందించడం చాలా హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో ఇదో గొప్ప అనుభూతి అని కార్తికేయ తెలిపారు. తన ఎనర్జి, మూమెంట్స్‌పై అభిమానులు నుంచి మంచి స్పందన వస్తున్నదని కార్తికేయ పేర్కొన్నారు.
ఇక కెరీర్ పరంగా.. కార్తికేయ ప్రస్తుతం ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వస్తున్న చావు కబురు చల్లగా అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్రను పోషించడం ద్వారా తమిళ చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నారు. ఇక చావు కబురు చల్లగా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











