నా బెడ్‌పై ప్రతీ రాత్రి ఆ ముగ్గురు మగాళ్లు ఉండాల్సిందే.. అసలు గుట్టువిప్పిన కస్తూరి

ప్రస్తుతం తమిళ నాట కొన్ని పేర్లు సోషల్ మీడియాలో నానా రకాలుగా వైరల్ అవుతున్నాయి. అందులో వనితా విజయ్ కుమార్, కస్తూరి శంకర్ పేర్లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ కమ్రంలో కస్తూరీని అలీ తన ప్రోగ్రాంకు గెస్ట్‌గా తీసుకొచ్చాడు. ఆమె జీవితంలోని సంఘటనలు, వ్యక్తిగత విషయాలను తెలుగు ప్రేక్షకుల ముందుంచాడు. ఈ క్రమంలో ఆమె ఎన్నో విషయాలను వెల్లడించింది. అందులో ముఖ్యంగా పడుకునే సమయంలో మాత్రం ఓ ముగ్గురి ఫోటోలు పెట్టుకునే పడుకుంటుందట.

 ముగ్గురితో పడుకుంటా..

ముగ్గురితో పడుకుంటా..

చనిపోయే ముందు ముగ్గురికి ఏదో చెబుతారట, చెప్పే చనిపోతారట అని అలీ ఏదో అడిగితే. అవును.. ముగ్గురితో పడుకుంటాను.. అని ఒక్కసారిగా మాటలు ఆపేసింది. ఈ విషయాన్ని కరెక్ట్‌గా చెప్పకపోతే తప్పుగా కన్వే అవుతుందని నాలిక కరుచుకుంది. వెంటనే అలీ అందుకుని నేను కూడా అదే అనుకున్నా అని చెప్పుకొచ్చాడు.

 ఇళయరాజా ఫోటో..

ఇళయరాజా ఫోటో..

పడుకునేప్పుడు తన బెడ్‌పై ముగ్గురు మగవారు ఉండాల్సిందే.. ఆ ముగ్గురి ఫోటోలు పెట్టుకుని పడుకుంటాను. అందులో ఇళయరాజా గారు ఒకరు. ఆయన వల్లే నేను ఉన్నాను, ఆయన పాటల వల్లే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. ఆయన నాకు దైవ సమానులు. ఇక రెండో ఫోటో తమిళ రచయిత రెబల్ లాంటి వాడు. ఎప్పుడో వందేళ్ల క్రితమే గొప్ప గొప్ప రచనలు చేశారు.వారి ఫోటో కూడా పెట్టుకుంటాను.

సాయి బాబా ఫోటో..

సాయి బాబా ఫోటో..

ఇష్టదైవం అయిన సాయి బాబా ఫోటోను కూడా పెట్టుకుంటా. ఈ ముగ్గురే నా జీవితాన్ని కాపాడింది. అందుకు వారి ఫోటోలను పెట్టుకుని పడుకుంటాను' అంటూ తన పర్సనల్ విషయాలను వెల్లడించింది. ఇది తన బెడ్ పై ముగ్గురు మగవారు, వారి ఫోటోల కథ. ఇక తన క్రష్ గురించి చెబుతూ కస్తూరీ తెగ ఫీలైపోయింది.

 విజయ్, నాగ్ అంటే క్రష్..

విజయ్, నాగ్ అంటే క్రష్..

తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా క్రష్ అని తల్లి పాత్ర అయితే అసలు చేయనని, జంటగా చేస్తానని నిర్మొహమాటంగా చెప్పేసింది. అంతేకాదు నాగార్జున అంటే ఎంతో ఇష్టమని, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడని రోజంతా ఆ చేయిని చూస్తుండిపోయానని, కడుక్కోకుండా అలానే ఉంచానని తెలిపింది.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
పెళ్లి చేసుకో అంటారు..

పెళ్లి చేసుకో అంటారు..

సోషల్ మీడియాలో కొందరు తనను పొడుగుతారని, ఇంకొందరు తిడతారని తెలిపింది. అయితే కొందరు మాత్రం.. ఫస్ట్ పెళ్లి చేసుకో అని సలహా ఇస్తారని చెప్పుకొచ్చింది. కానీ తనకు పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా ఎవ్వరికీ తెలియదని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X