Don't Miss!
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Lifestyle
కరోనా పెరగడానికి ఈ 4 విషయాలు ప్రధాన కారణం ... జాగ్రత్తగా ఉండండి ...
- Automobiles
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ యాంగిల్ కూడా ఉందా?.. ఊర మాస్!.. ‘కస్తూరి’ సీరియల్ హీరోయిన్ రచ్చ
ప్రస్తుతం బుల్లితెరపై కేవలం సీరియల్స్ మాత్రమే రాజ్యమేలడం లేదు. ఇతర కార్యక్రమాలు, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ షోల హవా నడుస్తోంది. ఇంతకు ముందు సీరియల్ హీరోయిన్లు కేవలం అక్కడే కనిపించేవారు. స్పెషల్ ఈవెంట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలలో పాల్గొనే వారు కాదు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్యా తన మాస్ స్టెప్పులతో అందరినీ షాక్‌కు గురి చేసింది.

కస్తూరి సీరియల్‌లో అలా..
కస్తూరి సీరియల్ స్టార్ మాలో ఇటీవలె మొదలైంది. ఈ సీరియల్‌లో ఐశ్వర్యా అనే నటి కొత్తగా బుల్లితెరకు పరిచయమైంది. చలాకీ అల్లరి పిల్ల పాత్రలో కస్తూరిగా ఐశ్వర్యా బాగానే నెట్టుకొస్తోంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగానే నటిస్తోంది. ఇక అందంలోనూ ఐశ్వర్యా పర్వాలేదనిపించేలానే ఉంది.

ఈవెంట్లలో రచ్చ..
కస్తూరి సీరియల్‌తో ఐశ్వర్యకు మంచి గుర్తింపే వచ్చింది. అందుకే ఆమెను ఇతర షోలకు, పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలోనూ భాగం చేస్తున్నారు. ఆ మధ్య దసరాకు వచ్చిన జాతరో జాతర షోలోనూ కస్తూరి సీరియల్ హీరో, హీరోయిన్లు బాగానే పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే కస్తూరి సీరియల్‌తో ఎంత పద్దతిగా కనిపించే ఐశ్వర్యా తాజాగా తనలోని ఇంకో కోణాన్ని చూపించింది.

డ్యాన్స్ ప్లస్ షో..
ప్రస్తుతం స్టార్ మా వాళ్లు డ్యాన్స్ ప్లస్ షోను ఎలాగైనా పైకి లేపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కంటెస్టెంట్లు వేసే డ్యాన్స్, ఆ పర్ఫామెన్స్‌లు ఎవ్వరూ చూడటం లేదని అందరికీ అర్థమైంది. అందుకే ఓంకార్ మంచి ప్లాన్ వేశాడు. బుల్లితెరపై ఉన్న సెలెబ్రిటీలను పట్టుకొచ్చి డ్యాన్స్‌లు చేయిస్తున్నాడు.

అందుకే అలా..
రేటింగ్స్‌ను పెంచే క్రమంలోనే ఓంకార్ తన డ్యాన్స్ ప్లస్ షోలో పర్ఫామెన్స్ చేసేందుకు సీరియల్ హీరోయిన్లు, హాట్ యాంకర్లను తీసుకొచ్చాడు. అందుకే విష్ణుప్రియ కూడా రెచ్చిపోయి మరీ డ్యాన్సులు చేసింది. నాభి అందాలు, నడుమును తెగ ఊపుతూ రెచ్చిపోయింది.

ఇప్పుడు ఆమె..
కస్తూరి సీరియల్ ఎంతో చక్కగా కనిపించే ఐశ్వర్య డ్యాన్స్ ప్లస్ షోలో రచ్చ చేసింది. భూం బద్దల్ అనే ఐటెం పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసింది. వాటిని చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు. ఆమె ఈమె ఒక్కటేనా? అని ఆశ్చర్యపోతున్నారు.