పద్నాలుగేళ్ల వయసులో తొలిసారిగా.. ఆడదానిలా మారడానికి టైం పట్టింది.. కస్తూరీ కామెంట్స్
అన్నమయ్య చిత్రంలో రమ్యకృష్ణకు ధీటుగా, పోటీగా నాగార్జునతో ఆడింది పాడింది కస్తూరీ. భారతీయుడు, ఆకాశ వీధీలో, డాన్ శీను వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కస్తూరి. అయితే ఈ మధ్య మాత్రం కేవలం వివాదాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. తమిళనాట కస్తూరీ చేసే కామెంట్స్ సెన్సేషన్‌కు దారి తీస్తున్నాయి. సినీ, రాజకీయ అంశాలపై తనదైన ముద్ర వేస్తూ అందర్నీ ఓ ఆటాడుకుంటోంది.
Recommended Video

అలా లీక్ చేశారు..
కస్తూరీ తాజాగా అలీ షోలో పాల్గొంది. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి వివరించింది. తల్లి తన బిడ్డకు పాలు ఇస్తున్నట్టుగా కస్తూరి ఆ మధ్య చేసిన ఫోటో షూట్ ఎంతటి సంచలనానికి దారి తీసింతో తెలిసిందే. నాటి సంగతులను వివరిస్తూ.. ‘ఆ ఫోటో షూట్ ఇక్కడ చేయలేదని, అమెరికన్ సొసైటీ కోసం చేసిందని, అక్కడి వారికే ఆ కాపీరైట్ ఉందని కానీ ఇక్కడ కాపీ చేసి లీక్ చేశారు. అయితే ఇక్కడ కూడా మంచి స్పందన లభించింద'ని చెప్పుకొచ్చింది.

చిన్ననాటి ఫోటోలు..
కస్తూరీ చిన్ననాటి ఫోటోలను చూసి తెగ మురిసిపోయింది. పుట్టినప్పటి నుంచి ఎదిగే క్రమంలో ఉన్న ఫోటోలన్నింటిని అలీ చూపించేసరికి సంబరపడిపోయింది. అందులో భాగంగా చిన్నతనంలో కస్తూరీ ఎలా ఉండేదో వివరించింది ఇక తన తమ్ముడి గురించి చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ సంస్థలో వైద్యుడిగా పని చేస్తున్నాడని తెలిపింది.

పద్నాలుగేళ్ల వయసులో..
ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటూ అలీ ప్రశ్నించగా అవునని సమాధానం చెప్పింది. పద్నాలుగేళ్ల వయసులో ఓ ప్రపోల్ వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇంకా అతను గుర్తున్నాడా? అంటే అవునని షాక్ ఇచ్చింది. ఇక ఈ సందర్భంగా నాటి విషయాలను కూడా చెప్పుకొచ్చింది. అప్పుడు తాను చాలా బక్కగా ఉండేదాన్ని, ఎవ్వరూ ప్రపోజ్ చేసేవారు కాదని వివరించింది.

ఆడలక్షణాలు రావడానికి..
‘ఆ వయసులో చాలా బక్కగా ఉండేదాన్ని, ఆడదానిలా మారడానికి, ఆడలక్షణాలు రావడానికి చాలా సమయం పట్టింది. ఎవరైనా లెటర్స్ ఇచ్చినా వాళ్లకు ఇవ్వు.. వీళ్లకు ఇవ్వు అని ఇచ్చేవారు. నాకు ఎవ్వరూ ఇచ్చేవారు. అలాంటి సమయంలో నాకు ఒకరు ఇచ్చారు. చాలా సంతోషపడిపోయాను. రాసింది ఎవరు అని కూడా చూసుకోలేదు. లెటర్ వచ్చినందుకు సంబరపడ్డాను' అంటూ కస్తూరీ తన ప్రపోజల్ విషయాలను తెలిపింది.


Click it and Unblock the Notifications











