బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా కస్తూరి ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి
ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయింది టాప్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. 2006లో హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో గత 12 సీజన్లుగా టాప్ రియాలిటీ షోగా వర్ధిల్లుతోంది. దక్షిణాదిలో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఈ షో ప్రసారం అవుతోంది.

తమిళంలో ప్రారంభం
ఇక్కడి వాళ్లకు కూడా బిగ్ బాస్ ఎంతగానో నచ్చింది. అందుకే టాప్ రేటింగుతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళంలో మూడో సీజన్ కూడా ప్రారంభమైపోయింది. దీనికి కూడా విశ్వ నాయకుడు కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదటి రోజు నుంచే చర్చనీయాంశం అయింది.

తొలి రోజు నుంచీ హాట్ టాపిక్
ప్రారంభ ఎపిసోడ్‌లోనే గొడవలు పెట్టుకుని కంటెస్టెంట్లు షోపై ఆసక్తిని పెంచేశారు. తర్వాత చాలా రోజులు ఉంటారనుకున్న వారు తొలి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేషన్ అయిపోయారు. దీనికితోడు, ప్రస్తుత కంటెస్టెంట్లలో ఒకరైన శరవణన్ ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. దీంతో ఈ షో మరోసారి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
కస్తూరి ఎంట్రీ
ఇక, ఇదే సీజన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే.. సీనియర్ నటి కస్తూరి శంకర్ త్వరలోనే వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరవుతారన్న వార్త. గతంలో దక్షిణాదికి చెందిన అన్ని భాషల్లో నటించిన ఈమె బిగ్ బాస్‌లోకి వస్తున్నారని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

సీనియర్ నటి స్పందన
ఈ నేపథ్యంలో కస్తూరి దీనిపై స్పందించారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘పాము, ముంగీస కొట్లాడుతున్న ఫొటోను షేర్ చేసి, నేను బిగ్ బాస్‌లోకి వస్తే కమల్, నేను ఇలాగే ఉంటాం. నాపై వస్తున్న వార్తలకు సరైన సమాధానం ఇదే' అంటూ ఆమె సమాధానం చెప్పారు. దీంతో కస్తూరి బిగ్ బాస్‌లోకి వెళ్లడం లేదని పరోక్షంగా చెప్పినట్లైంది.

స్క్రీన్ షాట్స్ వైరల్
అయితే, ఆమె బిగ్ బాస్ షో నిర్వహకులతో చాటింగ్ చేసినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కస్తూరి.. బిగ్ బాస్‌లోకి వెళ్లడానికి ఛాన్స్ ఇవ్వమని సదరు వ్యక్తిని కోరడం.. అందుకే వాళ్లు 4న ఫిక్స్ చేయడం.. అయితే, కస్తూరి మాత్రం నేను కమల్ వచ్చిన రోజు వెళ్తా అని చెప్పడం' కనిపించింది.


Click it and Unblock the Notifications











