Kathi Mahesh లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్: ఆపరేషన్ అయింది, డాక్టర్స్ ఏమంటున్నారంటే?

ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు ? అనే విషయంలోకి వెళితే.

Recommended Video

Medicare hospital doctors would release health bulletin on Kathi mahesh health condition soon
యాక్సిడెంట్

యాక్సిడెంట్

విజయవాడ నుంచి స్వస్థలం పీలేరు వెళుతున్న కత్తి మహేష్ కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. డ్రైవింగ్ సీట్లో ఉన్న సురేష్ అనే వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోగా కత్తి మహేష్ మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. దీంతో ఎదురుగా వెళ్తున్న ఒక లారీని అనుకోకుండా ఢీకొనడంతో సురేష్ వైపు ఉన్న ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడం తో ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి కానీ కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టకపోవడంతో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోలేదు, దీంతో ఆయన ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.

చెన్నై అపోలోలో

చెన్నై అపోలోలో

తెల్లవారు జాము సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేష్, ప్రమాదం జరిగింది కత్తి మహేష్ కి అని వెల్లడించడంతో అప్పటికప్పుడు ఆయనని నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి పోలీసులు తరలించారు. అయితే ఆయన కళ్ళు పూర్తిగా దెబ్బతినడంతో ముందుగా శస్త్రచికిత్స చేసి అప్పటికప్పుడు ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం

అయితే ఆయన కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆయన ఇక చూడలేదు అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా తాజాగా దానికి సంబంధించిన అప్డేట్ ఆయన స్నేహితులు వెల్లడించారు. ముఖ్యంగా కత్తి మహేష్ కి సంబంధించిన ఆరోగ్య వివరాలన్నీ వెంకట్ సిద్ధారెడ్డి అలాగే మరో రచయిత అరుణాంక్ లత ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. వారు అందించిన తాజా సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

స్టేబుల్ గానే ఉన్నా

స్టేబుల్ గానే ఉన్నా

''కత్తి మహేష్ ఇప్పుడు స్టేబుల్ గానే ఉన్నాడు'', అని పేర్కొన్న ఆయన డాక్టర్ల అబ్జర్వేషన్ లోనే ఉన్నాడని ప్రస్తుతానికి సెడేషన్ ఇవ్వడం కూడా నిలిపివేశారని చెప్పుకొచ్చారు. కత్తి స్పృహలోకి వచ్చాడని త్వరలోనే ఐసియు నుంచి కూడా జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తారని ఆయన వెల్లడించారు.. cerebral edima అనే చికిత్స జరుగుతూనే ఉంటుందని కనీసం రెండు వారాల పాటు ఈ చికిత్స కోసం ఆస్పత్రిలో ఉండాలని ఆయన వెల్లడించారు.

ప్రచారాలు తిప్పికొట్టాలని

ప్రచారాలు తిప్పికొట్టాలని

ఒక మతానికి, అభిమానం మతానికి పుట్టిన వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పేర్కొన్న ఆయన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వాట్సాప్ యూనివర్సిటీ వార్తలను మనవాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారని, కాస్త అవి చూసుకోవాలని ఆయన తన సన్నిహితులను కోరారు..ఈ వివరాలన్నీ 30వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాలకు తానే డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నానని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X