ఐ లవ్ పవన్ కల్యాణ్.. సీఎం అయితే చూడాలని ఉంది.. కత్తి మహేశ్
సినీ విమర్శకుడిగా కత్తి మహేశ్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా వివాదాస్పద వ్యక్తిగా కూడా మంచి పేరు సంపాదించుకొన్నారు.
Recommended Video

సినీ విమర్శకుడిగా కత్తి మహేశ్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా వివాదాస్పద వ్యక్తిగా కూడా మంచి పేరు సంపాదించుకొన్నారు. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం ద్వారా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి నేపథ్యంలో ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే కామెడీ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చానీయంశమయ్యాయి.

పవన్ కల్యాణ్‌పై కత్తి మహేశ్ విమర్శలు
రాజకీయాలకు సంబంధించి పవన్ కల్యాణ్‌పై కత్తి మహేశ్ ఇటీవల తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ చాలా సంఖ్యలో ఫోన్లు చేసి విసిగించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా చెప్పుకొన్నారు.

హైపర్ ఆది స్కిట్ కాంట్రవర్సీ
ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమంలో పవన్ పై విమర్శలు చేసినందుకుగానూ.. అలాగే రివ్యూలను ఉద్దేశించి కత్తి మహేశ్‌పై హైపర్ ఆది ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో పవన్ గురించి కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

పవర్ స్టార్ పవన్ అంటే ఇష్టం
నాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ పవన్ కల్యాణ్. ఆయన లేకుంటే ఈ స్థాయికి వచ్చే వాడిని కాదు.

పవన్ సీఎం అయితే చూడాలని ఉంది
దేవుడి లాంటి పవన్ కల్యాణ్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు కత్తి మహేశ్ జవాబిస్తూ.. పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయితే చూడాలని అనుకొంటున్నాను. ఆయన బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలి అని అన్నారు.

తప్పుగా అర్థం చేసుకొన్నారు..
పవన్ ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకొంటున్నారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించడం నా ఉద్దేశం కాదు. పవన్ కల్యాణ్ అభిమానులు నా విమర్శను తిట్టుగా అర్థం చేసుకొన్నారు. అందుకే ఈ సమస్య.

జనసేనకు మంచి అవకాశం
ఏపీ రాజకీయాల్లో మూడో పార్టీకి చాలా అవకాశాలున్నాయి. ఆ అవకాశాన్ని జనసేన పార్టీ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకొంటున్నాను. ఒకవేళ క్రియాశీలక రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఉంటే వచ్చే ఎన్నికల తర్వాత జనసేన కింగ్ మేకర్ అవుతుంది.

రివ్యూలను ఆపను
రివ్యూలను రాయడం నేను ఆపను. మంచి సినిమాకు చెడు సినిమాకు తేడా చెప్పాలన్నదే ఉద్దేశం. అందుకే సినిమా పరిశ్రమకు, ప్రేక్షకులకు మధ్య వారధిగా ఉండాలి అన్నదే నా లక్ష్యం.

పెసరట్టు చిత్రానికి నా రేటింగ్
నేను పెసరట్టు సినిమా తీశాను. అది చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన సినిమాను పట్టుకొని ఏం చేద్దాం. నా పెసరట్టు సినిమాకు ఎంత రేటింగ్ ఇస్తావని అడిగితే .5/5 (ఐదు పాయింట్లకు ఆర మార్కు) ఇస్తాను అని కత్తి మహేశ్ అన్నాడు.


Click it and Unblock the Notifications











