twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌశల్ ఆర్మీని కెలికిన కత్తి మహేష్.. ఆ పేరులోనే హింస!

    |

    Recommended Video

    Kathi Mahesh Serious Comments On Kaushal Army

    బిగ్ బాస్ 2 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. దీనితో విజేతగా ఎవరు నిలుస్తారో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం హౌస్ లో 7 గురు ఇంటి సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఫైనల్స్ కు చేరుకుంటారు అనే చర్చ బిగ్ బాస్ అభిమానుల మధ్య జరుగుతోంది. కౌశల్, గీత మాధురి, తనీష్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కౌశల్ ఆర్మీ పేరుతో ఆడియన్స్ నుంచి కౌశల్ కు లభిస్తుంది మద్దత్తు అంతా ఇంతా కాదు. కౌశల్ ఆర్మీపై ఎప్పుడూ వివాదాల్లో ఉండే కత్తి మహేష్ కామెంట్ చేశాడు.

     ప్రతి అంశంలోనూ

    ప్రతి అంశంలోనూ

    ప్రతి అంశం గురించి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే కత్తి మహేష్ తాజగా కౌశల్ ఆర్మీ గురించి స్పందించాడు. ఎప్పటిలాగే ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు.

    పేరులోనే హింస ఉంది

    పేరులోనే హింస ఉంది


    కౌశల్ ఆర్మీ అనే పేరులోనే హింస ఉంది అంటూ కత్తి మహేష్ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. ఎవరికోసం ఈ కౌశల్ ఆర్మీ, సాలు కౌశల్ ఎవరు. బిగ్ బాస్ షోలో ఉన్న ఇంటి సభ్యులలో కొందరు నచ్చుతారు.. కొనరు నచ్చరు. అంత మాత్రాన నచ్చని వారిని ఎలా పడితే అలా ట్రోల్ చేయడమేనా అంటూ కత్తి మహేష్ ప్రశ్నించాడు.

     2కె రన్ ఎందుకు

    2కె రన్ ఎందుకు

    కౌశల్ కోసం 2 కె రన్ ఎందుకు అంటూ కత్తి ప్రశ్నించాడు. కేరళ వరద భాదితుల కోసం ఇలాంటి పని చేసి ఉంటే సమాజంలోకి మంచి సంకేతాలు వెళ్ళేవి అని కత్తి తెలిపాడు. అభిమానం ఉండవచ్చు కానీ దురాభిమానం ఉండకూడదని సూచించాడు.

    వాళ్లకు కూడా ఫ్యామిలీస్

    వాళ్లకు కూడా ఫ్యామిలీస్


    మీరు ట్రోల్ చేసే వ్యక్తులకు కూడా కుటుంబాలు ఉంటాయనేది గమనించాలి. ఇలా ట్రోల్ చేస్తే వారి కుటుంబ సభ్యులు బాధపడతారు అంటూ కత్తి మహేష్ కౌశల్ ఆర్మీపై మండిపడ్డాడు.

    English summary
    Kathi Mahesh serious comments on Kaushal Army. Kaushal Army should stop trolling says Kathi mahesh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X