3 వివాహాలు చేసుకున్న టీవీ నటి, ఇక నో అంటోంది!
లండన్: బ్రిటిష్ మోడల్, టీవీ నటి క్యాటి ప్రైస్ ఇప్పటికి మూడు వివాహాలు చేసుకుంది. అయితే ఇటీవల ఆమె మూడో పెళ్లి కూడా పెటాకులైంది. దీంతో ఇక పెళ్లి జోలికే పోను అంటోంది. ప్రస్తుతం క్యాటి ప్రైస్ గర్భవతి కూడా. పెళ్లి చేసుకోవడం, విడిపోవడం లాంటి వాటితో విసిగిపోయానని, అందుకే ఇకపై పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.
తన మూడో భర్త కేరన్ హేలర్‌తో క్యాటీ ప్రైస్ గత నెలలోనే విడిపోయింది. భర్తతో విబేధాలు రావడం వల్ల అతనితో విడిపోయింది. ప్రస్తుతం క్యాటీ ప్రైస్ వయసు 35. బ్రిటన్ టీవీ షోలలో ఆమె హాట్ ఫేవరెట్. హాట్ అండ్ సెక్సీ గ్లామర్ లేడీగాను పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె తనకు పుట్టబోయే బిడ్డవిషయమై ఎంతో ఆసక్తిగా ఉంది.

కేరన్ హేలర్‌తో క్యాటీ ప్రైస్ వివాహం 2013 జనవరిలో జరిగింది. బహమాస్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి ఆగస్టులో జెట్ అనే మగపిల్లాడు జన్మించాడు. హేలర్ కంటే ముందు క్యాటీ ప్రైస్‌కు రెండు సార్లు వివాహం జరిగింది. ఆస్ట్రేలియన్ పాప్ స్టార్ పీటర్ ఆండ్రూ, కేజ్ ఫైటర్ అలెక్స్ రేడ్‌తో వివాహం జరిగింది. ముగురు పిల్లలు కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications











