Kaun Banega Crorepati 17: కళ్లు చెదిరేలా అమితాబ్ రెమ్యునరేషన్! ఒక్కో ఎపిసోడ్‌కి ఎన్ని కోట్లంటే?

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు మేకర్స్ రకరకాల కాన్సెప్ట్‌లతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. సీరియల్స్, రియాలిటీ షోలు, డ్యాన్స్ కార్యక్రమాలు దశాబ్ధాలుగా వినోదాన్ని పంచుతున్నాయి. భారతీయ టెలివిజన్ రంగంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ఓ సంచలనం. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ దాదాపు 25 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తన హోస్టింగ్ స్కిల్స్‌తో ఈ టాప్ షోకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారారు. కౌన్ బనేగా కరోడ్ పతి అంటే అమితాబ్.. అమితాబ్ అంటే కౌన్ బనేగా కరోడ్ పతి అన్నట్లుగా ఆయన ముద్ర వేసుకున్నారు.

అమితాబ్‌ను నిలబెట్టిన కౌన్ బనేగా కరోడ్‌పతి
సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌‌గా, బిగ్‌బీగా వెలుగొందుతున్న అమితాబ్‌కు కొత్త తరం హీరోలతో పోటీ ఎదురైంది. ఈ దశలో ఇంటిల్లిపాదికి అమితాబ్‌ను దగ్గర చేసింది కౌన్ బనేగా కరోడ్ పతి. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లోన అమితాబ్ క్రేజ్ విస్తరించింది. అంతేకాదు.. వరుస ఫ్లాపులు, సినీ నిర్మాణంలో నష్టాలతో అమితాబ్ పని అయిపోయిందని అవమానాలు ఎదురవుతున్న దశలో బచ్చన్ కుటుంబాన్ని నిలబెట్టింది కౌన్ బనేగా కరోడ్‌పతి. డ్యాన్స్‌, పాటలు మాదిరిగా కాకుండా వినోదం, విజ్ఞానం కలబోతగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. దీనికి అమితాబ్ స్కిల్స్ తోడు కావడంతో కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఇండియాలోనే టాప్ షోగా గుర్తింపు తెచ్చుకుంది.

Kaun Banega Crorepati 17 How Much is Amitabh Bachchan s remuneration per Episode

కేబీసీ ఫార్ములాతో ఎన్నో షోలు
కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని ప్రేరణగా తీసుకుని పలు షోలు వెల్లువెత్తాయి. అయితే అవన్నీ ప్రేక్షకులను ఆదరించలేకపోయాయి. తెలుగులో కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో కార్యక్రమం టెలికాస్ట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. అయితే హిందీలో కౌన్ బనేగా కరోడ్‌పతి మాదిరిగా ఈ ప్రోగ్రామ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

హోస్ట్‌గా బిగ్‌బీ తప్పుకుంటారని ప్రచారం
ఇదిలాఉండగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఇప్పటి వరకు 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం 17వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. అయితే కొత్త సీజన్‌కు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించరని పుకార్లు వైరల్ అయ్యాయి. బిగ్‌బీ హోస్ట్‌గా తప్పుకుని ఆయన ప్లేస్‌లో మరో సూపర్‌స్టార్ ఈ షోను నడిపిస్తారని అప్పట్లో హిందీ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు కూడా ఒక దశలో వినిపించాయి.

కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17 ప్రోమో విడుదల
అయితే దీనికి చెక్ పెట్టారు కేబీసీ నిర్వాహకులు. ఈ మెగా షోకు మరోసారి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ మేరకు సోనీ టీవీ .. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17 టెలికాస్ట్ అయ్యే వివరాలతో ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో హోస్ట్ సీట్‌లో బిగ్‌బీ కనిపించారు. ఆగస్ట్ 11వ తేదీ నుంచి కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17 ప్రారంభం అవుతుందని.. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీLIV‌లో ప్రసారమవుతుందని తెలిపింది.

అమితాబ్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
ఇదిలాఉండగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా చేస్తున్నందుకు అమితాబ్ బచ్చన్‌కు పారితోషికంగా ఎంత చెల్లించబోతున్నారని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు బట్టి కేబీసీ ఒక్కో ఎపిసోడ్‌కు అమితాబ్ బచ్చన్ దాదాపు 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ కింద ఛార్జ్ చేతున్నారట. సీజన్ ముగిసేసరికి ఎన్ని ఎపిసోడ్స్ జరిగితే అంత మొత్తం బిగ్‌బీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X