KBC 13: అమితాబ్ జోరు మాములుగా లేదుగా.. కేబీసీలో ఎప్పుడు? ఎలా పాల్గొనవచ్చంటే!

ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 13వ సీజన్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. కోవిడ్ సమయంలో కూడా బిగ్ బీ తన జోరును ఏ మాత్రం తగ్గించకుండా కొనసాగిస్తుండటం అభిమానులను, బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. తాజాగా కేబీసీ సీజన్ 13 షోకు సంబంధించిన టీజర్‌ను సోనీ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తన ఆఫీషియల్ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.

మీ కలల సాకారానికి ప్రయత్నం అనే మూడు అక్షరాల గురించి ఎప్పడైనా ఆలోచించారా? అంటూ వీడియోలో బిగ్‌బీ అంటూ ఉండటం కనిపించింది. ఇక ఈ సీజన్ 13లో పాల్గొనడానికి మే 10వ తేదీన సోని ఎంటర్‌టైన్‌మెంట్‌లో అమితాబ్ అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా ఈ షోలో పాల్గొనడానికి ఛాన్స్ దొరుకుతుందనే విషయం తెలిసిందే.

 Kaun Banega Crorepati season 13: Amitabh Bachchan gets ready for the big Show

గత ఏడాది లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కేబీసీ 12వ సీజన్‌ను అమితాబ్ బచ్చన్ మొదలుపెట్టారు. ఈ సమయంలోనే అంటే జూలై 2020లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇద్దరికి కోవిడ్ సోకింది. ఆ తర్వాత ఈ షోను ప్రారంభించి అభిమానులను ఆకట్టుకొన్నారు.

బ్రిటన్‌లో హూ వాంట్స్ టూ బీ ఏ మిలియనీర్ అనే కార్యక్రమం ఆధారంగా తెలుగులో కౌన్ బనేగా కరోడ్‌పతి షో ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి ఏకధాటిగా ఈ షోకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X