అర్దరాత్రి.....బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ సంచలనం!
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు2 పేరు వింటే చాలు అందరికీ ఇపుడు కౌశల్ ఆర్మీ పేరే వినిపిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కౌశల్ ఆర్మీ క్రియేట్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరైనా కౌశల్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే వెంటనే వారిపై విరుచుకుపడుతున్నారు. చివరకు షో హోస్ట్ నాని వ్యవహారంలో ఏదైనా తేడా కనిపించినా వీరు ఊరుకోవడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో 2కె రన్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా నిన్న అర్దరాత్రి బిగ్ బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ చేసిన హడావుడి హాట్ టాపిక్ అయింది.
అర్దరాత్రి పూట బాణాసంచా వెలుగులు
కౌశల్ కూతురు లల్లి పుట్టినరోజును పురస్కరించుకుని.... బిగ్‍బాస్ హౌస్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ బయట కౌశల్ మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. అర్దరాత్రి మొదలైన ఈ క్రాకర్స్ వెలుగులు కొన్ని గంటల పాటు జిగేల్ మన్నాయి.
కౌశల్ ముఖంలో సంతోషం చూడాలనే
కౌశల్ ఇంటికి దూరంగా ఉన్నా.... లల్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని కౌశల్ అన్నకు తెలిసేలా ఈ క్రాకర్స్ కాల్చినట్లు కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
ఎన్నడూ లేనంత గ్రాండ్‌గా
గతంలో కౌశల్ కూతురు లల్లి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగాయో తెలియదు కానీ..... ఇపుడు మాత్రం సోషల్ మీడియాలో లల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వేలాది ట్వీట్స్, కామెంట్స్ దర్శనమిస్తున్నాయి.

కౌశల్ ‘బిగ్‌బాస్ 2' విన్నర్ అంతే....
ఈ సీజన్ బిగ్‌బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మాత్రమే అని గట్టినమ్మకంతో ఉంది కౌశల్ ఆర్మీ. అత్యధిక మంది సపోర్ట్ ఉన్న కంటెస్టెంట్ ఆయన మాత్రమే. ఆయనకు టైటిల్ దక్కక పోతే విజేత ఎంపికలో అవకతవకలు జరిగినట్లు తాము భావిస్తామని వారు అంటున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











