twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీప్తి సునైనా అవుట్ వెనుక ‘ఆర్మీ’ హస్తం.. బిగ్‌బాస్‌లో హిట్లర్‌గా కౌశల్!

    By Rajababu
    |

    బిగ్‌బాస్‌లో ఇంటి సభ్యులందరిలో కంటే కౌశల్ బలమైన అభ్యర్థనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. టాస్క్‌లో అతను చూపే ఇంట్రస్ట్, ఇంటి సభ్యులతో వ్యవహరించే తీరు ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. తప్పు జరిగిన తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఓ స్టయిల్ కనబరుస్తారు. ఇంటి సభ్యులు ఎవరైనా కౌశల్‌తో గొడవపడితే ఆ వ్యక్తి బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్ కావడం అందర్ని షాక్ గురి చేస్తున్నది.

     ఇంట్లో బిగ్‌బాస్‌గా కౌశల్‌

    ఇంట్లో బిగ్‌బాస్‌గా కౌశల్‌

    రియాలిటీ షోలో బిగ్‌బాస్ ఉన్నాడో లేడో తెలియదు. కానీ ఇంట్లోనే కాదు షోలో కూడా కౌశల్ బిగ్‌బాస్‌గా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు మీడియాలో వస్తున్నాయి. బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందే కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసుకొన్నాడని విమర్శ వస్తున్నది.

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Episode 70 Highlights...!
    కౌశల్ పక్కా ప్లానింగ్

    కౌశల్ పక్కా ప్లానింగ్

    బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందే కౌశల్ పక్కా ప్లానింగ్ చేసుకొన్నాడనేది ఇన్‌సైడ్ టాక్. కౌశల్‌‌ను ఎవరైనా తిడితే వాళ్లు ఆ వారమే ఎలిమినేట్ కావడం చర్చనీయాంశమైంది. దాంతో ఇంట్లో కౌశల్‌కు మద్దతుగా బయట ఆర్మీ బలంగా పనిచేస్తున్నదనే వాదనకు బలం చేకూరుతున్నది.

    కౌశల్‌పై అనుమానాలు

    కౌశల్‌పై అనుమానాలు

    బిగ్‌బాస్ ఇంట్లో కూడా కౌశల్‌పై అనుమానాలు బలంగానే ఉన్నాయి. కౌశల్‌తో గొడవ పెట్టుకొంటే అవుట్ కావడం గ్యారంటీ అనే భయం కూడా ఇంటి సభ్యులను వెంటాడుతున్నది. గతంలో ఈ విషయంపై కూడా చర్చ జరిగింది.

    కిరిటీకి గట్టిదెబ్బ

    కిరిటీకి గట్టిదెబ్బ

    ఆరంభంలో కెప్టెన్సీ టాస్క్‌లో గొడవ జరగడం, కౌశల్‌పై అసత్య ఆరోపణలు చేయడంతో కిరీటికి గట్టి దెబ్బనే తగిలింది. ఆ తర్వాత కిరీటీ బయటకు జరిగింది. అలాగే నందిని, భానుశ్రీ విషయంలో అదే జరిగింది. కౌశల్‌తో పెట్టుకొంటే ఖేల్ ఖతం అనే వరకు వచ్చింది.

     అర్ధాంతరంగా తేజస్వి అవుట్

    అర్ధాంతరంగా తేజస్వి అవుట్

    బిగ్‌బాస్ ఇంట్లో తేజస్వి మదివాడకు కౌశల్‌కు మధ్య మాటల యుద్ధం భారీగానే జరిగింది. వారి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారింది. ఆ క్రమంలో టైటిల్ గెలుస్తుందనుకొన్న తేజస్వి అర్ధాంతరంగా బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్ అయింది.

    బాబు గోగినేనికి చేదు అనుభవం

    బాబు గోగినేనికి చేదు అనుభవం

    దర్శకుడు రాజమౌళిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేనికి కూడా అదే చేదు అనుభవం ఎదురైంది. నాది ఇంటర్నేషనల్ స్టాటస్.. కౌశల్ స్థాయి ఎంత బాబు కామెంట్ చేయడం విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కౌశల్, బాబు గోగినేని మధ్య దూరం పెరిగింది. ఆ నేపథ్యంలోనే కౌశల్ ఆర్మీ అతడికి వ్యతిరేకంగా ఓట్లు గుప్పించారనే వాదన వచ్చింది.

    దీప్తి సునైనాకు అదేగతి

    దీప్తి సునైనాకు అదేగతి

    బిగ్‌బాస్ కాల్ సెంటర్ టాస్క్‌లో తాజాగా కౌశల్‌పై ఫోన్‌లో మాట్లాడుతూ దీప్తి సునైనా థూ అని ఉమ్మి వేసింది. అలాగే ఆయనను కించ పరిచే విధంగా కామెంట్లు విసిరింది. వింతగా ప్రవర్తించడం, కౌశల్‌పై నోరు పారేసుకోవడం వలన దీప్తి సునైనపై ప్రేక్షకులే ఆగ్రహం కలిగింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే దీప్తి సునైన ఎలిమినేషన్ జరిగింది. దీప్తి బయటకు రావడం వెనుక కౌశల్ ఆర్మీ హస్తం ఉందని మరోసారి ఆరోపణలు వస్తున్నాయి.

     కౌశల్ ఆర్మీ బలమైన శక్తిగా

    కౌశల్ ఆర్మీ బలమైన శక్తిగా

    ఇక బిగ్‌బాస్‌లోకి కామన్ మ్యాన్ నూతన్ నాయుడు రీ ఎంట్రీ కావడానికి కౌశల్ ఆర్మీ బలంగా పనిచేసింది అని చెప్పుకొంటున్నారు. సోషల్ మీడియాలో ప్రభావం చూపుతున్న కౌశల్ ఆర్మీ కారణమని బహిరంగంగానే కొందరు వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌లో విభిన్నమైన ఆట తీరుతో ఆకట్టుకొంటున్న కౌశల్‌కు భారీగా మద్దతు లభిస్తున్నది. కానీ అతడి తీరు నచ్చని వాళ్లు మాత్రం కౌశల్ హిట్లర్‌గా వ్యవహారిస్తున్నాడని అంటున్నారు.

    English summary
    Bigg Boss 2 Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Kaushal Army showing big Influence on Bigg Boss Elimination process.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X