అందరూ గొర్రెలే: వైరల్ అవుతున్న కౌశల్ ఆర్మీ తిరుగుబాటు సాంగ్!
బిగ్‌బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్.. గెలుపుకు కారణం కౌశల్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన సోషల్ మీడియా గ్రూప్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కౌశల్ ఆర్మీ సహాయంతో కెరీర్లో మరింత ఎత్తుకు ఎదుగుదామని, పెద్ద సెలబ్రిటీ అయిపోదామని భావించిన కౌశల్ ఆశలు కుప్పకూలాయి. కౌశల్ ఆర్మీ తిరుగుబాటుతో వ్యవహారం రివర్స్ అయింది. అభిమానులను కౌశల్ కమర్షియల్‌గా వాడుకుంటున్నాడంటూ ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఈ మేరకు కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు మీడియాకు ఎక్కి రచ్చ చేయడం, కౌశల్ వాటిని ఖండించడం తెలిసిందే.

అందరూ గొర్రెలే..
అయితే కౌశల్ ఆర్మీ తిరుగుబాటు అంతటితో ఆగలేదు. ‘అందరూ గొర్రెలే' అంటూ తాజాగా ఓ సాంగ్ విడుదల చేశారు. ఇందులో కౌశల్ తీరును ఎంగడుతూ విమర్శలు చేశారు. ఈ పాటలో అన్నీ తిట్లే ఉన్నప్పటికీ వినసొంపైన బీట్స్ వాడటంతో సాంగ్ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఇది ఇపుడు వైరల్ అయింది.

పాట రాసింది ఎవరు?
చెన్నైకు చెందిన అరవింద్ ఈ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో ఆర్మీ సభ్యుడు నవీన్ తీవ్ర విమర్శలు చేశారు. కౌశల్ ఆర్మీ పేరుతో తామంతా భజన చేసి ఇప్పుడు గొర్రెలం అయ్యాం అనే అర్థం వచ్చేలా ఈ పాట ఉండటం గమనార్హం.

ఓట్లు వేసి అందరూ నిన్ను గెలిపిస్తే..
‘‘అందరూ గొర్రెలే... ఓట్లు వేసి అందరూ నిన్ను గెలిపిస్తే.. బయటకు వచ్చాక ఇలా చేస్తావా?.. నిన్ను ఎదిరిస్తే ఆర్మీ నుంచి తీసేస్తావా? నువ్వు ఎవడో కూడా తెల్వదంటూ నన్ను వేసేస్తావా.. సార్ నే నీ ఫ్యాన్ అండీ.. గొర్రెల్లో ఒక గొర్రెనండీ.. గొర్రె కసాయోన్ని నమ్మినట్లు.. నిన్ను నమ్ముకుంటే.. నువ్వు ఇలా చేస్తావా.. చీప్ చీప్ చీప్ చీప్... అందరూ గొర్రెలే'' అంటూ ఈ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి.

సెటైర్లే సెటైర్లు..
అన్న అనుకుంటే పీఎం కాల్ కూడా వస్తది, అన్న అనుకుంటే సీఎం సీటు కూడా వస్తది. అన్న అనుకుంటే భూమి రివర్స్ కూడా అవుతది, అన్న అనుకుంటే టెన్త్ పాస్ కూడా కాకుండా డాక్టరేట్ వస్తది... అంటూ ఈ సాంగులో కౌశల్ ఆర్మీ తిరుగుబాటు దారులు సెటైర్లు వేశారు.

నీ గేమ్ ఓవర్
‘‘సింపతీ స్కీమ్‌తో నువ్వు గేమ్ ఆడి గెలిచినావు.. గేమ్ పూర్తి కాగానే కమర్షియల్ అయ్యావు... బాబాయ్ నీ గేమ్ ఓవర్'' అంటూ ప్రతి లైన్లోనూ కౌశల్‌ను టార్గెట్ చేస్తూ ఈ సాంగ్ రూపొందించారు.


Click it and Unblock the Notifications











