twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 2 హోస్ట్ నాని మీద కౌశల్ ఆర్మీ పోలీస్ కంప్లయింట్ ఇవ్వబోతున్నారా?

    |

    Recommended Video

    బిగ్ బాస్ 2 హోస్ట్ నాని మీద కౌశల్ ఆర్మీ పోలీస్ కంప్లయింట్ ఇవ్వబోతున్నారా?

    బిగ్ బాస్ తెలుగు 2 హోస్ట్ నాని తీరుతో కౌశల్ ఆర్మీ అప్ సెట్ అయ్యారా? 'అమ్మ' గురించి నాని చేసిన కామెంట్స్ వారిని బాధించాయా? దీనిపై కౌశల్ ఆర్మీ పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టు చేస్తుంటే అలానే అనిపిస్తోంది.

    'సిల్లీ ఫెల్లోస్' సినిమా ప్రమోషన్లో భాగంగా అల్లరి నరేష్, సునీల్ ఇటీవల బిగ్ బాస్ ఇంటిని సంప్రదించారు. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 9న స్టార్ మాటీవీలో ప్రసారమైంది. ఈ సందర్భంగా ఫన్ క్రియేట్ చేసేందుకు కొన్ని టాస్కులు పెట్టారు. ఇంటి సభ్యులను రెండు గ్రూఫులుగా విడగొట్టిన నాని వారి మధ్య కొన్ని ఆర్గుమెంట్స్ పెట్టారు.

     గేమ్ మూలంగా చిక్కుల్లో నాని

    గేమ్ మూలంగా చిక్కుల్లో నాని

    ఈ టాస్క్‌లో కౌశల్ సునీల్ టీమ్ లో ఉంటూ ల్లి పాత్ర పోషించాడు. గేమ్ మొత్తం సరదాగా సాగింది. మెంబర్స్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తల్లి పాత్ర పోషించి కౌశల్‌ను మీ భర్తతో బాండింగ్ ఎలా ఉందో చెప్పాలని నాని అడిగారు. దీనికి కౌశల్ సమాధానం ఇస్తుంగా నాని మధ్యలో కల్పించుకుని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

     స్పర్శ వర్కౌట్ అవ్వలేదా?

    స్పర్శ వర్కౌట్ అవ్వలేదా?

    ఇద్దరు అబ్బాయిలను దత్తత తీసుకోవడానికి కారణం ఏమిటి? అని నాని అడగ్గా.... కౌశల్ సమాధానం ఇచ్చేలోపే నాని మధ్యలో కల్పించుకుని స్పర్శ వర్కౌట్ అవ్వలేదా....అంటూ సెటైర్ వేశారు. దీంతో ఇంట్లో అందరూ నవ్వులు చిందించారు. అయితే నాని చేసిన ఈ వ్యాఖ్యలపై కౌశల్ ఆర్మీ ఆగ్రహంగా ఉంది.

    కౌశల్ అభిమానుల ఆగ్రహం

    తల్లులను అవమానించే విధంగా నాని వ్యాఖ్యలు ఉన్నాయని కౌశల్ ఆర్మీ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు. ఒక సెలబ్రిటీ అయుండి ఉమెన్ గురించి తప్పుగా మాట్లాడారని, వెంటనే అతడిపై కేసు ఫైల్ చేయాలని హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్ ఖాతాకు మెసేజ్ పెట్టారు.

    లోకల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయండి

    కౌశల్ ఆర్మీ చేసిన రిక్వెస్టుపై హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్ ఖాతా ద్వారా రిప్లై ఇచ్చారు. లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వాలని సూచించారు. మరి నిజంగానే కౌశల్ ఆర్మీ అన్నంత పని చేస్తారా? వెయిట్ అండ్ సీ...

    English summary
    Kaushal Army is very upset with host Nani for insulting mothers on Bigg Boss Telugu 2. This group is apparently considering on filing a complaint against the actor-turned-host with the Hyderabad police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X