కుక్కల్లా మీద పడుతున్నారు?.. ఏం మాట్లాడుతున్నవురా కౌశల్.. సామ్రాట్, తనీష్ దూకుడు!

Recommended Video

కుక్కల్లా మీద పడుతున్నారు : కౌశల్

బిగ్‌బాస్‌ ఇంటిలో సెలబ్రిటీల మధ్య మరోసారి భారీగానే వాగ్వాదం జరిగింది. కౌశల్‌కు, ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. మంగళవారం జరిగిన సంఘటనలు ఇంటి సభ్యుల్లో ఆగ్రహావేశాలు రెచ్చగొట్టాయి. కౌశల్ చేసిన కామెంట్ రచ్చరచ్చగా మారింది. భావోద్వేగాలు రేకెత్తాయి. బుధవారం ఎపిసోడ్ మరింత గందరగోళంగా మారిందనే విషయం స్పష్టంగా కనిపించింది. వివరాల్లోకి వెళితే..

కౌశల్‌ను ఒంటరివాడిని చేసి

కౌశల్‌ను ఒంటరివాడిని చేసి

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో మరోసారి కౌశల్‌ను ఇంటి సభ్యులందరూ ఒంటరివాడిని చేశారు. రేస్ టూ ఫినాలే టాస్క్‌లో కౌశల్ కంటైనర్‌ను సామ్రాట్, తనీస్ ధ్వంసం చేశారు. రోల్ రైడాకు సమ్రాట్, తనీష్ మద్దతిస్తూ తనను కార్నర్ చేయడంపై కౌశల్ తప్పుపట్టారు. గీతా, దీప్తి కూడా వారు డీల్ చేసుకొన్నారు అని పేర్కొన్నారు.

కుక్కల్లా మీద పడుతారా?

కుక్కల్లా మీద పడుతారా?

బిగ్‌బాస్‌ ఇంటిలో కౌశల్ చేసిన కామెంట్ భారీ గొడవకు దారి తీసింది. సందర్భం ఏమిటో తెలియదు కానీ.. కౌశల్ ఆవేశంగా మాట్లాడుతూ.. నేను ఏదైనా మాట్లాడితే.. అందరూ కుక్కల్లా మీద పడుతారు అని అన్నారు. ఆ మాటలతో ఇంటి సభ్యులు ఫైర్ అయ్యారు.

అరేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా

అరేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా

కౌశల్‌ చేసిన కామెంట్‌పై ఇంటి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపైకి దూసుకెళ్లారు. అరేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నువ్వు. మైండ్ యువర్ లాంగ్వేజ్. కుక్క అనొద్దు అని సామ్రాట్ వేలెత్తి హెచ్చరించారు. దానికి కౌశల్ సమాధానం ఇస్తూ నేను నిన్ను అనలేదు. నేను నిన్ను అన్నానా అని కౌంటర్ ఇచ్చాడు.

మమల్ని కుక్కలు అంటావా?

మమల్ని కుక్కలు అంటావా?

కౌశల్ మాటలపై తనీష్, రోల్ రైడా ఫైర్ అవుతూ.. మరెవర్ని అన్నారు. మమల్ని కుక్కలు అంటారా? నేను ఎంత కష్టపడి ఇంట్లోకి వచ్చాను అంటూ రోల్ రైడా ఏడ్చాడు. మమల్ని అనకపోతే ఎవరి అన్నారు అంటూ తనీష్ ప్రశ్నించాడు. ఏడుస్తున్న రోల్ రైడాను సామ్రాట్, తనీష్ బుజ్జగించారు.

కావాలనే ఎమోషన్స్‌ను రెచ్చగొట్టాడు

కావాలనే ఎమోషన్స్‌ను రెచ్చగొట్టాడు

కౌశల్ వ్యాఖ్యలపై గీతా మాధురి స్పందిస్తూ.. కావాలనే మనలో ఉన్న ఎమోషన్స్‌ను బయటకు రెచ్చగొట్టేలా ప్రయత్నించాడు. అందులో సక్సెస్ అవుతున్నాడు అని అన్నారు. కౌశల్ కావాలంటే నీ కాళ్లు పట్టుకొంటానని ఏడుస్తున్న రోల్ రైడాను గీతా ఓదార్చింది.

కౌశల్ ఎటాక్‌తో ఝలక్

కౌశల్ మాటలపై ఆగ్రహం చెందిన సామ్రాట్, తనీష్, రోల్ రైడా, గీతా మాధురి ఝలక్ తిన్నారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజలు గ్రహించాలని సామ్రాట్ కెమెరా ముందు వెల్లడించడం గమనార్హం. అయితే కౌశల్ ఎందుకు ఈ స్థాయిలో మాట్లాడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇంటి సభ్యులు కౌశల్‌ను ఏ విధంగా రెచ్చగొట్టారు అనే ప్రశ్నలకు బుధవారం ఎపిసోడ్‌లో సమాధానం దొరుకుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X