కౌశల్‌కు చెక్: చిరంజీవిని కలిసిన తనీష్.. రంగంలోకి మెగాస్టార్.. ఏం జరుగుతున్నదంటే!

Recommended Video

Tollywood Hero Tanish Meets Chiru In The Wake Of Controversy? | Filmibeat Telugu

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగిసి నెలలు కావొస్తున్న ఆ ఇంటిలో గడిపిన స్టార్ల మధ్య గొడవలు మాత్రం మీడియాలో రచ్చ రచ్చగా మారాయి. బిగ్‌బాస్2 సీజన్‌లో తనీష్ గ్యాంగ్ ఓ వైపు, కౌశల్ ఒక్కడు మరోవైపు ఉండగా ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకొన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ షో వరకే పరిమితం అవుతాయనుకొంటే అవి ఇప్పుడు కూడా నిప్పులా రాజుకొని మంటల తయారయ్యాయి. టెలివిజన్ మీడియాలో సుదీర్ఘమైన లైవ్‌లతో ఈ గొడవ మరింత వివాదంగా మారింది. అయితే ఈ వివాదంలోకి చిరంజీవి పేరు రావడం మరింత ఆసక్తిగా మారింది. చిరంజీవి ఎందుకు ఎలా ఎంటరయ్యారంటే..

బిగ్‌బాస్ విజేత కౌశల్‌పై ఆరోపణలు

బిగ్‌బాస్ విజేత కౌశల్‌పై ఆరోపణలు

కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నిధులను కౌశల్ దుర్వినియోగం చేశారని ఆ సంస్థకు సంబంధించిన సభ్యులే ఆరోపించడంతో వివాదానికి కొత్తగా అంకురార్పణ జరిగింది. ఓ టెలివిజన్ షోలో కౌశల్‌పై కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఫౌండేషన్ పేరుతో కౌశల్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని కౌశల్ ఆర్మీలోని సభ్యులు ఆరోపించడంతో వివాదం ప్రముఖంగా మారింది.

నాపై తనీష్, బాబు గోగినేని కుట్ర

నాపై తనీష్, బాబు గోగినేని కుట్ర

కౌశల్ ఆర్మీ ఫౌండేషన్, తనపై వచ్చిన ఆరోపణలపై కౌశల్ స్పందిస్తూ.. నాపై ఓ కుట్ర జరుగుతున్నది. దానికి తనీష్, బాబు గోగినేని కారణం అని అన్నారు. తనకు వచ్చిన ఓ సినిమా ఆఫర్‌ను తనీష్ చెడగొట్టాడని, తన సినిమా ఆగిపోవడానికి కారణం తనీష్ అని తీవ్రంగా స్పందించారు.

అనవసరంగా నన్ను వివాదంలోకి లాగాడు

అనవసరంగా నన్ను వివాదంలోకి లాగాడు

కౌశల్ చేసిన ఆరోపణలపై ఓ టెలివిజన్ ఛానల్ చర్చా కార్యక్రమంలో తనీష్ మాట్లాడుతూ.. నాపై కౌశల్ ఆరోపణలు చేసి నన్ను అనవసరంగా వివాదంలోకి లాగాడు. అసలేం జరుగుతున్నదో అర్థం కావడం లేదు. బిగ్‌బాస్ షో తర్వాత నేను ఇప్పటి వరకు మీడియాతో ఒక్క మాట మాట్లాడలేదు అని తనీష్ పేర్కొన్నారు. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని కౌశల్‌ను హెచ్చరించాడు.

 కౌశల్‌కు లీగల్ నోటీసులు పంపిస్తా

కౌశల్‌కు లీగల్ నోటీసులు పంపిస్తా

కౌశల్ ఆర్మీ వల్ల నేను వ్యక్తిగతం చాలా బాధపడ్డాను. నా కుటుంబం కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నది. అయినా సహనంతో నా బాధను భరించాను. అయితే తాజా ప్రెస్‌మీట్‌లో నా పేరు బయటపెట్డడంతోపాటు, సోషల్ మీడియాలో నా ఫోటోను షేర్ చేశారు. వాటికి జవాబుగా నేను అతడికి లీగల్ నోటీసులు పంపుతాను అని తనీష్ పేర్కొన్నారు.

చిరంజీవిని తనీష్ కలువడంతో

చిరంజీవిని తనీష్ కలువడంతో

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని తనీష్ కలువడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాకు ఓన్లీ వన్ ఇన్సిపిరేషన్ చిరంజీవి గారు. ఆయన పాటలు చూస్తూ డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకొన్నాను. 16 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశాను. ఈ రోజును ఎప్పటికీ మరువలేను అని తనీష్ తన ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.

చిరంజీవి నాకు బాస్ లాంటివారు

చిరంజీవి గారు అద్భుతమైన వ్యక్తి. నాకు ఆయన బాస్ లాంటి వారు. థాంక్యూ సోమచ్ సర్.. మీకు ఎప్పటికీ నేను ఏకలవ్య శిష్యుడిని. నా జీవితంలో 2019 మార్చి 5వ తేదీని ఎప్పటికీ మరిచిపోను అని తనీష్ ట్వీట్ చేశాడు. కౌశల్‌తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో చిరంజీవిని తనీష్ కలవడం మరింత క్రేజీగా మారింది.

తనీష్ కోసం చిరంజీవి రంగంలోకి..

తనీష్ కోసం చిరంజీవి రంగంలోకి..

మెగాస్టార్ చిరంజీవిని తనీష్ కలువడం వెనుక అసలు కారణం తెలియరాలేదు. అయితే కౌశల్‌తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మెగాస్టార్‌ దృష్టికి దీనిని తీసుకెళ్లారా? లేక ఎందుకు కలిశాడు? అనే ప్రశ్నలు లేచాయి. అంతేకాకుండా కౌశల్‌తో వివాదంలో తనకు సహకారం అందించాలని చిరంజీవిని తనీష్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజం ఉన్నదని తేలడానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X