దయచేసి ప్రతి నెల ఒక వంద రూపాయలు పంపండి: బిగ్‌బాస్ కౌశల్
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 2 రియాల్టీషో విన్నర్ కౌశల్ తన అభిమానులను కలుస్తూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా అనంతపురంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన విజయోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ.... కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ మొదలు పెట్టినట్లు వెల్లడించారు.
ఈ ఫౌండేషన్‌ను దేశంలోనే ది బెస్ట్ ఎన్జీవోగా తీర్చిదిద్దాలనేది తన కోరిక అని చెప్పిన ఆయన... సంస్థ ముందుకు సాగడానికి నిధులు కూడా అవసరమని, సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.

కౌశల్ ఆర్మీతో డబ్బులు వసూలు చేశారు
ఈ మధ్య రోడ్డు యాక్సిడెంటుకు సంబంధించి కౌశల్ ఆర్మీ పేరుతో చాలా మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వారిని సేవ్ చేయడం జరిగిందని విన్నాను. ఇలాంటివి ఏమున్నా మన ట్రస్ట్ ద్వారా ఒకపై వారిని కాపాడటం జరుగుతుందని కౌశల్ తెలిపారు.

మీరూ నెలకు ఒక వంద పంపండి
మొన్న ఫౌండేషన్ మొదలు పెట్టిన రెండో రోజే ఒక ఫ్యాన్ వాళ్ల బాబాయికి లివర్ సమస్య ఉందని చెప్పి డొనేషన్ అడిగారు. అప్పుడే మొదలు పెట్టిన మన ఫౌండేషన్ కు అంత నిధులు రాలేదు. మీరంతా కూడా ప్రతి నెల ఒక వంద రూపయాలు ఇస్తే మన వాళ్లను కాపాడుకోవచ్చు. ఫ్యూచర్లో చాలా మందిని ట్రస్ట్ ద్వారా కాపాడుకోవచ్చని కౌశల్ తెలిపారు.

అందులో డ్రెస్సులు కొనండి
ఫౌండేషన్ నిధుల సేకరణలో భాగంగా కౌశల్ ఆర్మీ వెబ్ సైట్లో కొన్ని డ్రెస్సులు పెట్టడం జరుగుతుంది. మీకు ఆ డ్రెస్సులు నచ్చితే కొనుక్కోవచ్చు. అలాగే కౌశల్ మండ డాట్ కామ్ నుంచి ఒక క్యాలెండర్ ఉంటుంది. మీరు ఎప్పుడు కలవాలనుకున్నా అందులో నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని కలవొచ్చని కౌశల్ తెలిపారు.

ఆ వయసులోనే మోడలింగ్ ఏజెన్సీ
నేను బిగ్‌బాస్ షోకు వెళ్లక ముందు నాకన్నా ఎక్కువ ఒక టాలెంటెడ్ యాక్టర్స్ కోసం తపన పడేవాన్ని. జీవితంలో ఎంత కష్టపడి, ఒంటరిగా ఎవరి సహకారం లేకుండా పైకొచ్చానో నాకు తెలుసు. అలాగే యాక్టర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క్రరికి బ్యాగ్రౌండ్ లేక పోతే ఒక ప్రాపర్ బ్యాగ్రౌండ్‌గా, ఒక కేరాఫ్ అడ్రస్‌గా ఉండాలని నేను నాకు 18 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ లో మోడలింగ్ ఏజెన్సీ మొదలు పెట్టడం జరిగింది.

అందరూ మనవైపే చూడాలి
ఇపుడు అదే మోడలింగ్ ఏజెన్సీ ద్వారా టాలెంటెడ్ యాక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలని ఒక పెద్ద అకాడమీ మొదలు పెట్టాలనుకుంటున్నాను. మీకు ఎవరికి యాక్టింగులో ఇంట్రస్ట్ ఉన్నా కేరాఫ్ అడ్రస్ నేనే అవ్వాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇతర ప్రాంతాలకు నటుల కోసం పరుగెత్త కుండా మన తెలుగు రాష్ట్రాల నుంచే తీసుకునేలా నా వంతు సహకారం అందిస్తాను... అని కౌశల్ మండ తెలిపారు.


Click it and Unblock the Notifications











